బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న దెయ్యం సినిమా - ‘భూల్ భులయ్యా 3’ కలెక్షన్లు ఎలా ఉన్నాయి? కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించిన ‘భూల్ భులయ్యా 3’ నవంబర్ 1న విడుదల అయింది. బ్లాక్‌బస్టర్ ‘భూల్ భులయ్యా’ సిరీస్ ఈ సినిమా విడుదల అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లలో దూసుకుపోతుంది. మొదటి రోజు ఈ సినిమా మనదేశంలో రూ.36.6 కోట్లు (నెట్) వసూలు చేసింది. రెండో రోజు ఫస్ట్ డే కంటే ఎక్కువగా రూ.38.4 కోట్లు వసూలు చేసింది. దీంతో రెండు రోజుల్లో ఈ సినిమా రూ.75 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ లెక్కన కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్కును దాటనుంది. అజయ్ దేవ్‌గణ్ ‘సింగం అగైన్’తో ‘భూల్ భులయ్యా 3’ పోటీ పడింది. ఈ సినిమాకు కూడా వసూళ్లు చాలా బాగా వస్తున్నాయి.