ప్రభాస్ కి బాగా ఇష్టమైన పాట ఏంటో తెలుసా!

Published by: RAMA

డార్లింగ్ కి నచ్చే సాంగ్

మీకు ఇష్టమైన సాంగ్ ఏదని ఎవరైనా అడిగితే వాళ్ల సినిమాల్లో పాటల్లోంచి ఒకటి చెబుతారు..కానీ డార్లింగ్ ప్రభాస్ రూటే సెపరేటు..

జల్సా లో సాంగ్

ఎన్నో సినిమాలు, మెరెన్నో పాటలు..అన్నిటిలో ప్రభాస్ ని కట్టిపడేసిన సాంగ్ ఏదో తెలుసా..పవన్ కళ్యాణ్ జల్సా సినిమాలో ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్

ఎన్నిసార్లు విన్నా...

ఏ పార్టీకి వెళ్లినా, స్నేహితులను కలిసినా ఈ పాట గురించి ప్రస్తావన తప్పనిసరిగా ఉంటుందన్నాడు ప్రభాస్..ఆ పాట ప్లే చేయగానే..మళ్లీ మొదలెట్టాడురా అన్నట్టు ఫ్రెండ్స్ అంతా పారిపోయేవారన్నాడు

పర్టికులర్ లిరిక్ ఇదే

ముఖ్యంగా ఆ సాంగ్ లో 'రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎపుడో సొంత ముఖం' అనే లైన్ కి స్పెషల్ కోట్స్ పెట్టిమరీ హైలెట్ చేశాడు రెబల్ స్టార్

లైఫ్ స్టైల్ గురించే రాశారా

ఆ పాట ఆ సినిమాకోసం రాసి ఉండొచ్చు కానీ మన లైఫ్ స్టైల్ గురించే రాశారు అని అనిపించింది..అంత నచ్చిందంటూ ఆ సాంగ్ గురించి స్పెషల్ గా మాట్లాడాడు ప్రభాస్

ఆట టైటిల్ సాంగ్ అదుర్స్

ఆటలో టైటిల్ సాంగ్ గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించాడు ప్రభాస్.. ముందుగా తెలుసుకో మునిగే లోతెంతా సరదాగా సాగదు వేట నట్టేట ఎదురీత అంటూ సాగుతుంది..

జగమంత కుటుంబం నాది

తెలుగు సినిమా చరిత్రలో బెస్ట్ సాంగ్స్ తీస్తే అందులో తప్పనిసరిగా ఉండే పాట ‘చక్రం’ లోని ‘జగమంత కుటుంబం..’ అని తన మూవీ సాంగ్ గురించి ప్రస్తావించాడు

‘నా ఉచ్ఛ్వాసం కవనం’

‘నా ఉచ్ఛ్వాసం కవనం’ అనే కార్యక్రమంలో గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి మాట్లాడుతూ ఈ పాటల గురించి ప్రస్తావించాడు ప్రభాస్

సిరివెన్నెల గురించి...

సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి కేవలం పెద్దపెద్ద పండితులు మాత్రమే చెప్పగలరు.. నా మాటల్లో చెప్పాలంటే తెలుగు సాహిత్యరంగంలో ఆయనో సింహం అన్నాడు