CBG Plant In Prakasam: రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన- రూ.65వేల కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల మందికి ఉద్యోగాలు
Nara Lokesh | ప్రకాశం జిల్లా కనిగిరిలో ఏర్పాటు చేయబోతున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ కు రిలయన్స్ ప్రతినిధులతో కలిసి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Reliance CBG Plant in Kanigiri | కనిగిరి: ఏపీలో భారీ ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు అవుతోంది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం దివాకరపల్లి గ్రామ సమీపంలో సీబీజీ ప్లాంట్‌కు మంత్రి నారాలోకేష్ శంకుస్థాపన చేశారు. రిలయన్స్ ప్రతినిధులతో కలిసి సీబీజీ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమాల్లో నారా లోకేష్ పాల్గొన్నారు. అంతకు ముందు దివాకరపల్లికి చేరుకున్న మంత్రి లోకేష్‌కు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. మంత్రి లోకేష్ పర్యటన సందర్భంగా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు.
దివాకరపల్లి గ్రామ సమీపంలో రిలయన్స్ న్యూ ఎనర్జీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేయనున్న ప్లాంట్ ద్వారా ఏపీకి రూ.65 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. అనంతరం ఏర్పాటుచేసిన సభలో మంత్రి లోకేష్ పాల్గొంటారు. ఆ మొత్తంతో 500 వరకు సీబీజీ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 2.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని అధికారులు తెలిపారు. రిలయన్స్ సీబీజీ ప్లాంట్ దేశంలోనే తొలి ప్రాజెక్టు కావడం విశేషం.
గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్న ఏపీ ప్రభుత్వం
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం హరిత ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. గ్రీన్ ఎనర్జీతోనే భవిష్యత్ అని సర్కార్ అడుగులు వేస్తోంది. ఈ సీబీజీ ప్లాంట్ల ద్వారా వ్యవసాయ వ్యర్థాలను సేకరించి హరిత, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్లాంట్ ఒక రోజుకు 22 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో పని చేస్తుందని ప్రభుత్వం చెబుతోంది. నిరుపయోగంగా భూమిని గ్రీన్ ఎనర్జీ ప్లాంటేషన్ కోసం వినియోగిస్తామని అధికారులు తెలిపారు.
గన్నవరం ఎయిర్‌పోర్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ కి, మంత్రి లోకేష్, ఏపీ సీఎస్ విజయానంద్ స్వాగతం పలికారు. అనంతరం రిలయన్స్ బృందం తో కలిసి కనిగిరి బయలుదేరారు. కనిగిరిలోని దివాకరపల్లి గ్రామ సమీపంలో రిలయన్స్ ఏర్పాటు చేయనున్న సిబిజి ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటామని మంత్రి లోకేష్ తెలిపారు. ఈ సీబీజీ ప్లాంట్ ఏర్పాటుతో గ్రామీణ యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు.
గన్నవరం విమానాశ్రయంలో
— Lokesh Nara (@naralokesh) April 2, 2025
రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ గారికి నేను, సిఎస్ విజయానంద్ గారు స్వాగతం పలికాం. అనంతరం రిలయన్స్ బృందం తో కలిసి కనిగిరి బయలుదేరాను. కనిగిరిలో రిలయన్స్ ఏర్పాటు చేయబోతున్న సిబిజి ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ఈ ప్లాంట్… pic.twitter.com/acllhXX3Ls






















