AP PGECET 2025: ఏపీ పీజీఈసెట్ 2025 దరఖాస్తు ప్రారంభం - చివరితేది ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీ పీజీఈసెట్-2025 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 1న ప్రారంభమైంది. ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.

AP PGECET 2025 Application: ఏపీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025(AP PGECET) నోటిఫికేషన్ మార్చి 28న వెలువడిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 1న ప్రారంభమైంది. ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇక రూ.1000 ఆలస్య రుసుముతో మే 9 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో మే 15 వరకు, రూ.4000 ఆలస్య రుసుముతో మే 20 వరకు.. చివరగా రూ.10,000 ఆలస్య రుసుముతో మే 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల సవరణకు మే 25 నుంచి 27 వరకు అవకాశం కల్పించారు. మే 31 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్/బీఫార్మసీ ఉత్తీర్ణత పొందిన/చివరి ఏడాది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే గేట్/జీప్యాట్ అర్హత సాధించిన అభ్యర్థులకు వేరుగా నోటిఫికేషన్ విడుదలచేస్తారు.
వివరాలు...
* ఏపీపీజీఈసెట్ - 2025
కోర్సులు: ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మ్-డి (పీబీ).
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్/బీఫార్మసీ ఉత్తీర్ణత పొందినవారు దరఖాస్తుకు అర్హులు. చివరి ఏడాది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్ష విధానం: మొత్తం 120 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్ మీడియలోనే ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు. విద్యార్థులకు డిగ్రీ స్థాయిలో చదివిన సబ్జెక్టుల నుంచే ప్రశ్నలు ఇస్తారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం మాక్ టెస్టులకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షలో కనీసం అర్హత మార్కులను 25 శాతం అంటే 30 మార్కులుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి కనీస అర్హత మార్కులు లేవు.
APPGECET-2025 పరీక్షా కేంద్రాలు:
నెంబరు | జిల్లా పేరు | పరీక్ష కేంద్రం |
1. | అనంతపురం | అనంతపురం |
2. | చిత్తూరు | చిత్తూరు |
3. | తిరుపతి | తిరుపతి |
4. | తిరుపతి | గూడూరు |
5. | తూర్పు గోదావరి | రాజమండ్రి |
6. | కాకినాడ | కాకినాడ |
7. | గుంటూరు | గుంటూరు |
8. | పల్నాడు | నర్సరావుపేట |
9. | ఎన్టీఆర్ | విజయవాడ |
10. | కర్నూలు | కర్నూలు |
11. | శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు | నెల్లూరు |
12. | ప్రకాశం | ఒంగోలు |
13. | శ్రీకాకుళం | శ్రీకాకుళం |
14. | విశాఖపట్నం | విశాఖపట్నం |
15. | విజయనగరం | విజయనగరం |
16. | వెస్ట్ గోదావరి | భీమవరం |
17. | వైఎస్ఆర్ కడప | కడప |
18. | హైదరాబాద్ (తెలంగాణ) | హైదరాబాద్ |
ముఖ్యమైన తేదీలు...
➥ నోటిఫికేషన్ వెల్లడి: 28.03.2025.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.04.2025.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.04.2025.
➥ రూ.1000 ఆలస్యరుసముతో దరఖాస్తుకు చివరితేది: 01.05.2025 - 09.05.2025.
➥ రూ.2000 ఆలస్యరుసముతో దరఖాస్తుకు చివరితేది: 10.05.2025 - 15.05.2025.
➥ రూ.4000 ఆలస్యరుసముతో దరఖాస్తుకు చివరితేది: 16.05.2025 - 20.05.2025.
➥ రూ.10,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 21.05.2025 - 26.05.2025.
➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 25.05.2025 - 27.05.2025.
➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 31.05.2025 నుంచి.
➥ పీజీఈసెట్ పరీక్ష తేది: 06.06.2025 - 08.06.2025 వరకు.
పరీక్ష సమయం: మొదటి సెషన్: ఉ.09.00 గం. - ఉ.11.00 గం., రెండో సెషన్: మ. 02.00 గం. . సా.4.00 గం. వరకు.
➥ ప్రాథమిక కీ: 11.06.2025 4:00PM.
➥ ఆన్సర్ కీ వెల్లడి: 24.06.2025.
➥ ఫలితాల వెల్లడి: 25.06.2025.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

