Crime News: నెల్లూరులో దోపిడీ దొంగల బీభత్సం- రైళ్లు ఆపి బంగారం, ఆభరణాలు, నగదు దోపిడీ
Train Robbery in Nellore | నెల్లూరులో దోపిడీ దొంగల బీభత్సం సృష్టించారు. పట్టపగలే అల్లూరు రోడ్డు- పడుగుపాడు స్టేషన్ల రైళ్లు ఆపి ప్రయాణికుల నుంచి బంగారం, ఆభరణాలు, నగదు దోపిడీ చేశారు.

Nellore Crime News | పడుగుపాడు: ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో దోపిడీ దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. జిల్లాలోని అల్లూరు రోడ్డు- పడుగుపాడు స్టేషన్ల మధ్య కొందరు గుర్తుతెలియని దుండగులు పట్టాలపై సాంకేతిక సమస్య సృష్టించి రైళ్లు ఆపారు. వెంటనే రైల్లోకి ఎక్కిన దుండగులు దోపిడీకి పాల్పడ్డార్చు. చండీగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలుతో పాటు బెంగళూరు ఎక్స్ ప్రెస్ రైళ్లలో దోపిడీ దొంగలు హల్ చల్ చేశారు. బోగీల్లోకి ఎక్కిన దుండగులు ప్రయాణికులను బెదిరించి.. మహిళల వద్ద నుంచి బంగారం, ఆభరణాలు, విలువైన వస్తువులు దోచుకెళ్లారు. దాదాపు అరగంటకు పైగా రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లలో దోపిడీ దొంగల ముఠా బీభత్సం సృష్టించినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దుండగులు పట్టాలపై కాయిన్స్ ఉంచి బెంగళూరు ఎక్స్ప్రెస్, చండీగఢ్ - మధురై వెళ్లే రైలు ఆపారు.
విజయనగరంలో పట్టాలు తప్పిన నాగావళీ ఎక్స్ ప్రెస్
విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలో 'నాగావళి ఎక్స్‌ప్రెస్' పట్టాలు తప్పింది. వెంకటలక్ష్మి థియేటర్ జంక్షన్ వద్ద నాగావళి ఎక్స్‌ప్రెస్ కొన్ని బోగీలు పట్టాలు తప్పింది. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు రెండు బోగీలు తప్పించి మిగతా బోగీలతో ట్రైన్ ను పంపించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

