మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం జపాన్‌లో సందడి చేస్తున్నారు. ఆయన నటించిన 'దేవర' మూవీ ఈ నెల 28న జపనీస్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. అక్కడి అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ, థియేటర్లలో అభిమానులతో సందడి చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.