Peddi Audio Rights: రామ్ చరణ్ పెద్ది ఆడియో రైట్స్... రికార్డు రేటుకు తీసుకున్న టీ సిరీస్
Ram Charan's Peddi Update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సానా బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న 'పెద్ది' సినిమా ఆడియో రైట్స్ టీ సిరీస్ సంస్థ సొంతం చేసుకుంది. రికార్డు రేటు ఆఫర్ చేసిందని సమాచారం.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా రూపొందుతున్న తాజా పాన్ ఇండియా సినిమా 'పెద్ది' (Peddi Movie - RC 16). ఇటీవల హీరో పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ మూవీ లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఆడియో రైట్స్ భారీ రేటుకు టీ సిరీస్ సంస్థ తీసుకుంది.
'పెద్ది' ఆడియో రైట్స్... 35 కోట్లు!
'పెద్ది' చిత్రానికి ఆస్కార్ విన్నర్, భారతీయులకు ఇష్టమైన సంగీత దర్శకులలో ఒకరు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దర్శకుడు బుచ్చిబాబు సానా ఇంతకు ముందు 'ఉప్పెన' తీశారు. అది మ్యూజికల్ బ్లాక్ బస్టర్. దర్శకుడికి మ్యూజిక్ పరంగా మంచి టేస్ట్ ఉందని పేరు వచ్చింది. దానికి తోడు ఇప్పుడు రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. దాంతో 'పెద్ది' సినిమా మీద మాత్రమే కాదు పాటల మీద కూడా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని 35 కోట్ల రూపాయలకు టీ సిరీస్ సంస్థ ఆడియో రైట్స్ తీసుకుంది. అది సంగతి.
శ్రీ రామనవమి పండక్కి ఫస్ట్ షాట్!
రామ్ చరణ్ పుట్టిన రోజున కేవలం ఫస్ట్ లుక్ మాత్రమే విడుదల చేశారు. 'పెద్ది' టైటిల్ అధికారికంగా ఆ రోజు అనౌన్స్ చేసినా... అంతకు ముందు ఎప్పుడో లీక్ అయ్యింది. నిజానికి చరణ్ బర్త్ డే స్పెషల్ కింద గ్లింప్స్ కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. అయితే అప్పుడు కుదరలేదు.
శ్రీ రామ నవమి సందర్భంగా ఏప్రిల్ 6వ తేదీన పెద్ది ఫస్ట్ షాట్ (వీడియో గ్లింప్స్) విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అనౌన్స్ చేసింది. మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులు అందరూ ఆ షాట్ కోసం వెయిట్ చేస్తున్నారు.
Also Read: మధుశాల రివ్యూ: ETV Winలో పొలిటికల్ క్రైమ్ డ్రామా... వరలక్ష్మి శరత్ కుమార్ సినిమా బావుందా? లేదా?
View this post on Instagram
'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ సరసన నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్, టాలీవుడ్ సీనియర్ కథానాయకుడు జగపతి బాబు, బాలీవుడ్ నటుడు - మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు శర్మ నటిస్తున్నారు. రత్నవేలు ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థల సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకం మీద వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. నవీన్ నూలి ఎడిటర్.
Also Read: 'దిల్' రాజు సినిమాకూ టైమ్ ఇవ్వలేదు... హిందీ కోసం సౌత్ వదిలేసింది... ఇప్పుడు కామెంట్స్ ఏంటమ్మా?





















