అన్వేషించండి

MLAs Disqualification Case: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ కూర్చోవాలా? సుప్రీంకోర్టు

Supreme Cout of India | ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ కూర్చోవాలా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

BRS MLAs Disqualification Case | న్యూఢిల్లీ: తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు నేడు సుప్రీంకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. ఇదివరకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి వారి తరఫు లాయర్ల వాదనలు విన్నది. నేడు ఏప్రిల్ 2 (బుధవారం) నాడు స్పీకర్ తరపున లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. స్పీకర్ చర్యలు తీసుకోవాలని సైతం ధర్మాసనం ఆదేశింలేదా, ఫిరాయింపుల అంశంపై స్పీకర్ చర్యలు తీసుకోకున్నా తాము చూస్తూ ఉండిపోవాలా అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. అసెంబ్లీ కార్యదర్శి తరపున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింగ్వీ వాదనలు వినిపించనున్నారు. రేపు (ఏప్రిల్ 3న) ఉదయం 10 గంటలకు ధర్మాసనం సమయం కేటాయించింది.

అసెంబ్లీ కార్యదర్శి తరపున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గీ..

నేటి విచారణలో ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల తరఫు వాదనలు సుప్రీంకోర్టు ధర్మాసనం విన్నది. ‘ఒక రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులపై మరో రాజ్యాంగ ధర్మాసనం తీర్పులు ఎలా ఇస్తుంది. స్పీకర్ కు రాజ్యాంగం విశేష అవకాశాలు కల్పించింది. వాటిని కోర్టులు హరించకూడదు. స్పీకర్ నిర్ణయం తీసుకున్నాక కోర్టులు దానిపై న్యాయసమీక్ష చేపట్టే అవకాశం ఉంటుంది. కానీ పలానా సమయానికి నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు కోర్టులు చెప్పడం భావ్యం కాదు. కోర్టులు, ధర్మాసనాలు ఇచ్చే సూచనలు పాటించాలా.. లేదా అనేది విశేష అధికారం స్పీకర్లకు ఉంటుంది’ అని ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.

చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు సూచించలేమా.. జస్టిస్ బీఆర్ గవాయ్

సకాలంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు సూచించలేమా అని జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసిన వారం రోజుల్లోనే కోర్టులో పిటిషన్ వేశారని ముకుల్ రోహత్గీ తెలిపారు. స్పీకర్ కు దీనిపై ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకుండా, ఒక పిటిషన్ తరువాత మరో పిటిషన్ వేస్తూ పోయారని సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కోర్టులు రాజ్యాంగ పరిరక్షకులుగా ఉంటాయని జస్టియ్ బీఆర్ గవాయ్ అన్నారు. ఇప్పటికే ఏడాది ముగిసింది, మరో నాలుగేళ్లు స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా కోర్టులు ఎలాంటి ఆదేశాలు జారీ చేయకూడదా.. ఇలాగే చూస్తూ ఉండిపోవాలా అని ముకుల్ రోహత్గీని ప్రశ్నించారు. పిటిషనర్ల ఇష్టానుసారం అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాలు తీసుకోరని, గత ఏడాది మార్చి 18న పిటిషనర్లు స్పీకర్ కు ఫిర్యాదు చేయగా.. ఈ జనవరి 16న ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారని ముకుల్ రోహత్గీ అన్నారు.


ఈ పిటిషన్లపై ఫిర్యాదులు ఇచ్చినా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎందుకు చర్యలు తీసుకోలేదని కోర్టు పలుమార్లు అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా అంటూ ధర్మాసనం సెటైర్లు వేసింది. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోకుండా, ఎందుకు జాప్యం జరిగిందని స్పీకర్ కు, తెలంగాణ ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు గతంలోనే నోటీసులు ఇచ్చింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Independence Day 2026: దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!
దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!
Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Telangana Cabinet Decisions: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Telugu Movies OTT : ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
Brezza vs Venue EMI Comparison: Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Embed widget