LSG Accused Pitch Curators: ఓటములపై కొత్త పల్లవి అందుకుంటున్న ఫ్రాంచైజీలు.. క్యూరేటర్లపై ఆరోపణలు.. తాజాగా ఈ జాబితాలో లక్నో
ఆడలేక మద్దెల ఓడె.. అన్న చందంగా లోపాలు కవర్ చేసుకోలేక, ఓటములపై పిచ్ క్యూరెటర్లపై కొన్ని జట్లు ఆరోపణలు చేస్తున్నాయని చర్చ జరుగుతోంది. చెన్నై, కేకేఆర్, లక్నో ఇలా ఆరోపణలు చేస్తున్నాయి.

LSG VS PBKS Live Updates: పిచ్ లపై మరో జట్టు అసంతఈప్తి వ్యక్తం చేసింది. తాజాగా తమ హోం గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో పిచ్ వల్లే తాము ఓడిపోయామని లక్నో సూపర్ జెయింట్స్ పేర్కొంది. సోమవారం జరిగిన మ్యాచ్ లో ఎనిమిది వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ చేతిలో లక్నో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో తాము పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుందని, అందుకు తగిన విధంగా సిద్ధమయ్యామని, అయితే ఆశ్చర్యకరంగా పేసర్లకు సహకరించిందని లక్నో కోచ్ జహీర్ ఖాన్ వాపోయాడు. లక్నో తమకు హోం గ్రౌండ్ అని, అందుకు తగిన విధంగా పిచ్ ఉండాలని కోరుకోవడం తప్పేమీ కాదు కదా అని ప్రశ్నించాడు. అయితే క్యూరెటర్లు మాత్రం స్పిన్ కు బదులుగా పేసర్లకు సహకరించేలా పిచ్ రూపొందించారని, ఇది కరెక్టు కాదని వ్యాఖ్యానించాడు. దీనిపై క్యూరెటర్లతో మాట్లాడుతామని, భవిష్యత్తులో దీనిపై మరింత ఫోకస్ పెడతామని పేర్కొన్నాడు.
Zaheer Khan said, "you've seen teams have a home advantage in the IPL. The curator is not thinking that it's a home game, it looked like it was a Punjab curator out here in Lucknow".#ZaheerKhan #PBKSvsLSG #IPL2025 pic.twitter.com/CF44zVPH2O
— @πi$# (@IamAnishG20) April 2, 2025
రిషబ్ అసంతృప్తి..
ఇక పిచ్ గురించి లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాము స్పిన్ కు అనుకూలిస్తుందని, అందుకు తగిన విధంగా పేసర్ ప్రిన్స్ కు బదులు సిద్ధార్థ్ ను తీసుకున్నామని, అయితే పేసర్లకు సహకరించేలా పిచ్ ఉండటంతో తాము నష్టపోయామని పేర్కొన్నాడు. నిజానికి ఇక్కడ తాము ఏడు మ్యాచ్ లు ఆడతామని, తమకు తగిన విధంగా పిచ్ ఉండాలని కోరుకుంటున్నామని తెలిపాడు. రాబోయే రోజుల్లో పిచ్ క్యూరెటర్ల నుంచి మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక ఈ మ్యాచ్ లో పంజాబ్ పేసర్లు కలిసి ఐదు వికెట్లు తీశారు.
పిచ్ లపై జట్ల ఆరోపణ..
ఇక ఈ సీజన్ లో ఇప్పటికే కొన్ని జట్లు పిచ్ రూపకల్పనపై ఆరోపణలు చేశాయి. తమకు తగిన విధంగా పిచ్ రూపోందించడం లేదని ఫిర్యాదు చేస్తున్నాయి. ఫస్ట్ డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ ఈ అంవాన్నితెరపైకి తీసుకురాగా, ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఇదే పల్లవి అందుకుంది. తమ హోం గ్రౌండ్ లోని క్యూరెటర్లకు ఆయ జట్లకు తగిన విధమైన పిచ్ లు రూపొందించడం లేదని పేర్కొంటున్నాయి. అయితే దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆయా జట్లలో లోపాలు సరిదిద్దుకోకుండా పిచ్ లపై ఓటమి నెపం నెట్టివేయడం కరెక్టు కాదని వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా ఇలా సొంత గ్రౌండ్ లోని క్యూరెటర్లపై ఆరోపణలు చేయడం మాత్రం కాస్త సంచలనంగా మారింది. రాను రాను రోజుల్లో ఈ ఆరోపణలు ఏ మలుపు తీసుకోనున్నాయని చర్చ జరుగుతోంది.



















