Radhe Shyam: 'రాధే శ్యామ్'లో మరో హీరోయిన్! రిలీజ్ ట్రైలర్‌లో ఆ అమ్మాయిని గుర్తు పట్టారా?
'రాధే శ్యామ్'లో పూజా హెగ్డే హీరోయిన్. అయితే... ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉన్నారు. ప్రభాస్‌కు జోడీగా నటించలేదు. స్పోర్ట్స్ పర్సన్ రోల్ చేసింది. ఆ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా?
'రాధే శ్యామ్' సినిమాలో హీరోయిన్ ఎవరు? పూజా హెగ్డే. ఇందులో మరో సందేహం లేదు. అవసరం లేదు కూడానూ! ప్రభాస్ సరసన ఆమెకు తొలి చిత్రమిది. అయితే... ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉన్నారు. ఆమె ప్రభాస్‌కు జోడీగా నటించలేదు. స్పోర్ట్స్ పర్సన్ రోల్ చేసింది. బుధవారం విడుదలైన 'రాధే శ్యామ్' రిలీజ్ ట్రైలర్‌లో ఉంది. ఇంతకీ, ఆ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా?
'రాధే శ్యామ్' రిలీజ్ ట్రైలర్ చూస్తే... 32 సెకండ్ల దగ్గర 'స్పోర్ట్స్ వద్దు' అని ప్రభాస్ ఓ డైలాగ్ చెబుతారు. రన్నింగ్ ట్రైన్‌లో ఆ సీన్ ఉంటుంది. అప్పుడు ఆయనకు చెయ్యి చూపించినది ఎవరో తెలుసా? ఆ తర్వాత 38 సెకండ్ల దగ్గర కూడా ఆమె ఇంకోసారి కనిపిస్తుంది. వన్ మినిట్ ట్రైలర్‌లో మొత్తం మీద రెండుసార్లు కనిపించారు. ఆ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా? ఆల్రెడీ రెండు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. ఆమె పేరు రిద్దీ కుమార్.
రాజ్ తరుణ్ హీరోగా 'దిల్' రాజు ప్రొడక్షన్ నిర్మించిన సినిమా 'లవర్'. అందులో రద్దీ కుమార్ హీరోయిన్. అంతకు ముందు ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ మేనల్లుడు విరాజ్ కె. అశ్విన్ హీరోగా నటించిన 'అనగనగా ఓ ప్రేమ కథ' సినిమాలో కూడా నటించారు. 'శతమానం భవతి' దర్శకుడు సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్న తాజా సినిమా 'కోతి కొమ్మచ్చి'లో ఓ కథానాయికగా నటిస్తున్నారు. 'రాధే శ్యామ్'లో రిద్ధి కుమార్‌కు ఇంపార్టెంట్ రోల్ దక్కినట్టు ఉంది. ఆమె ఆర్చరీ ప్లేయర్‌గా కనిపించనున్నారని సమాచారం.
ప్రేమకథా చిత్రంలో స్పోర్ట్స్ ఏంటి? రిద్ధి కుమార్ రోల్ ఏంటి? అనేది తెలియాలంటే... మార్చి 11 వరకూ వెయిట్ చేయాలి. సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ అయితే... రిద్ధి కుమార్‌ది కీ రోల్ అన్నమాట.
Also Read: 'అందుకే నాకింకా పెళ్లి కాలేదు' ప్రభాస్ ఫన్నీ కామెంట్స్
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రసీధ 'రాధే శ్యామ్' సినిమాను నిర్మించారు. దక్షిణాది భాషల్లో పాటలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా, హిందీ పాటలకు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నారు. తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, ప్రియదర్శి, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.