Kajal Aggarwal Workout Video: గర్భవతులకు ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తున్న కాజల్ అగర్వాల్! నెలలు నిండిన కడుపుతో ఎలా వర్కవుట్స్ చేశారో చూశారా?
కాజల్ అగర్వాల్ గర్భవతులకు ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తున్నారు. కడుపుతో ఉన్న సమయంలో ఎటువంటి వర్కవుట్స్ చేయాలనేది ఆమె చూపించారు.
ఇప్పుడు కాజల్ అగర్వాల్ గర్భవతి. సాధారణంగా మహిళలు గర్భధారణ సమయంలో బరువు పెరుగుతారు. శారీరక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ సమయంలో కొందరు చేసే విమర్శల గురించి గతంలో ఆమె స్పందించారు. ఇప్పుడు గర్భం దాల్చిన సమయంలో ఇటువంటి వ్యాయామాలు చేయాలనేది వివరిస్తూ... ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఒక వీడియో పోస్ట్ చేశారు.
"నేను ఎప్పుడూ చాలా యాక్టివ్ పర్సన్. నా లైఫ్ అంతా వ్యాయామాలు (వర్కవుట్స్) చేశా. అయితే... గర్భధారణ సమయంలో చేసే వ్యాయామాలు వేరు. ప్రెగ్నెన్సీ సమయంలో ఆరోగ్యవంతమైన జీవితం కోసం మహిళలు అందరూ వ్యాయామాలు చేయాలి. నాకు ప్రెగ్నెన్సీ సమయంలో పిలాటీస్, బార్ నాకు ఎంతో సహాయపడ్డాయి. ఏరోబిక్ కండీషనింగ్ లక్ష్యం ఏంటంటే... ఫిట్‌నెస్ పరంగా అత్యున్నత స్థాయి చేరుకోవడం కాదు, ఫిట్‌నెస్ లెవల్ మైంటైన్ చేయడం" అని కాజల్ పేర్కొన్నారు. ఇది యాడ్ కాదని ఆమె అన్నారు.
Also Read: పుట్టబోయే బిడ్డ కోసం... కాజల్ అగర్వాల్ కొత్త జర్నీ
కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ కావడానికి ముందు నటించిన 'హే సినామికా' ఈ శుక్రవారం (మార్చి 3న) విడుదల కానుంది. అలాగే, మెగాస్టార్ చిరంజీవికి జంటగా నటించిన 'ఆచార్య' ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఆ తర్వాత నెలలో... అంటే మేలో కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూ దంపతుల ఇంట పండంటి బిడ్డ అడుగు పెట్టనున్నట్టు తెలిసింది. కాజల్ డెలివరీ మేలో జరగనుందని సమాచారం.
Also Read: కాజల్‌కు కోపం వచ్చింది... తన గర్భంపై వస్తున్న ట్రోల్స్‌కు దిమ్మతిరిగే సమాధానం!
View this post on Instagram