Prabhas: 'అందుకే నాకింకా పెళ్లి కాలేదు' ప్రభాస్ ఫన్నీ కామెంట్స్
ఈరోజు విడుదలైన 'రాధేశ్యామ్' సినిమా ట్రైలర్ లో 'ప్రేమ విషయంలో ఆదిత్య ప్రెడిక్షన్ తప్పు' అనే డైలాగ్ ఉంది.
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. ఈ మధ్యకాలంలో మన తెలుగు హీరోలంతా ఒక్కొక్కరిగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు కానీ ప్రభాస్ మాత్రం పెళ్లికి దూరంగా ఉంటున్నారు. 'బాహుబలి' తరువాత ప్రభాస్ పెళ్లి ఉంటుందని అన్నారు. ఆ తరువాత 'సాహో' రిలీజ్ అయ్యాక అని వార్తలొచ్చాయి. కానీ ఇప్పటివరకు ప్రభాస్ మాత్రం పెళ్లి చేసుకోలేదు. ఎవరైనా పెళ్లి టాపిక్ తీసుకొస్తే తెలివిగా తప్పించుకుంటున్నారు. తాజాగా 'రాధేశ్యామ్' సినిమా ప్రెస్ మీట్ లో కూడా ప్రభాస్ పెళ్లి టాపిక్ వచ్చింది.
ఈరోజు విడుదలైన 'రాధేశ్యామ్' సినిమా ట్రైలర్ లో 'ప్రేమ విషయంలో ఆదిత్య ప్రెడిక్షన్ తప్పు' అనే డైలాగ్ ఉంది. దీనిపై ఓ విలేకరి ప్రభాస్ ని ప్రశ్నిస్తూ.. 'ప్రేమ విషయంలో నిజజీవితంలో మీ లెక్క ఎన్ని సార్లు తప్పింది' అని అడగగా.. 'చాలా సార్లు.. అందుకే నాకింకా పెళ్లి కావడం లేదనుకుంటా..' అని ఫన్నీగా సమాధానమిచ్చారు. దీంతో అందరూ నవ్వేశారు. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ పెళ్లి విషయం ఎప్పుడూ హాట్ టాపికే.
ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. 'రాధేశ్యామ్' సినిమా మార్చి 11న విడుదల కానుంది. రీసెంట్ గానే ఆయన 'ఆదిపురుష్' సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఆయన 'సలార్', 'ప్రాజెక్ట్ K' సినిమాల్లో నటిస్తున్నారు. త్వరలోనే 'స్పిరిట్' సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. అలానే మైత్రి మూవీ మేకర్స్ లో ఓ సినిమా చేయబోతున్నారని టాక్.
View this post on Instagram