Mythri Movie Makers: బంపర్ ఆఫర్ ప్రకటించిన మైత్రీ మూవీ మేకర్స్ - 'లవ్‌గురు' సినిమా చూసి మలేషియా చూట్టేయండి!
Love Guru: లవ్ గురు ఆడియన్స్ మైత్రీ మూవీ మేకర్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూసిన వారికి మలేషియా, కశ్మీర్, ఊటీ వంటి సమ్మర్ హాలీడే ట్రిప్స్ ఫ్రి చూసే అవకాశం ఇచ్చింది.
Mythri Movie Makers Offer to Love Guru Audience: టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో మైత్రి మైవీ మేకర్స్ ఒకటి. ప్రస్తుతం ఈ బ్యానర్లో అన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్సే ఉన్నాయి. పుష్ప: ది రైజ్ నిర్మించిన ఈ సంస్థ ఇప్పుడు పుష్ప: ది రూల్ నిర్మిస్తోంది. దీనితో పాటు మరెన్సో సినిమాలను కూడా ఈ బ్యానర్లో రూపొందుతున్నాయి. మరోవైపు మైత్రీ మేకర్స్ డబ్బింగ చిత్రాలను కూడా సమర్పిస్తూ తెలుగులో రిలీజ్ చేస్తుంది. మలయాళ చిత్రం మంజుమ్మెల్ బాయ్స్‌ను తెలుగులో సమర్పించిన ఈ బ్యానర్ విజయ్ ఆంటోని లవ్‌గురు చిత్రాన్ని కూడా తెలుగులో విడుదల చేసంది. ఏప్రిల్ 11న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. ప్రస్తుతం థియేటర్లో రన్ అవుతుంది.
అయితే తాజాగా ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసేందుకు మైత్రీ మూవీ మేకర్స్ భారీ ప్లాన్‌తో వచ్చారు. 'లవ్‌గురు' ఆడియన్స్‌కి బంపర్ ఆఫర్ ప్రకటించింది సదరు సంస్థ. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. థియేటర్లో లవ్‌గురు సినిమా చూసి మలేషియా ట్రిప్ కొట్టేయంటూ ఆఫర్ ప్రకట్టించారు."ఫ్యామిలీతో కలిసి లవ్‌గురు(#LoveGuru) సినిమాను థియేటర్లో చూసి.. మీ కుటుంబంతో సహా పెయిడ్ ట్రిప్‌కు రెడీ అవ్వండి. ముగ్గురు లక్కీ విన్నర్స్‌ని ఎంపిక చేసి పైన పేర్కొన్న హాలీడే డెస్టినేషన్‌కు ఫ్రీ చూట్టేయండి. మరిన్ని వివరాలు, బంపర్ ఆఫర్ కోసం ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి"అంటూ వివరాలు వెల్లడించారు.
ఇక ఈ బంపర్ ఆఫర్ కొట్టేయాలంటే ఆడియన్స్ ఈ నాలుగు స్టేప్స్ ఫాలో అవ్వాలి. లవ్‌గురు సినిమా చూసేందుకు థియేటర్లకు వెళ్లిన ఫ్యామిలీ ఆడియన్స్ తమ పేరు, ఫోన్ నెంబర్, టికెట్ డిటెయిల్స్ ఫిల్ చేసి అక్కడ థియేటర్లో ఏర్పాటు చేసిన బాక్స్‌లో వేయాలి. అందులోంచి ముగ్గురు విన్నర్స్‌ని మైత్రీ టీం సెలక్ట్ చేసి వారికి సెలక్ట్ చేసి మీకు హాలీడే డెస్టినేషన్ ట్రిప్ టికెట్ అన్ని పంపిస్తుంది. ఒకవేళ ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకున్నవారు మీ టికెట్ ఫోటో తీసి ఇక్కడ పేర్కొన్న నెంబర్‌కి వాట్సాప్ చేయాలి. ఫస్ట్ విన్నర్‌కి మలేషియా ట్రిప్, సెకండ్ విన్నర్ కశ్మీర్, థర్డ్ ప్రైజ్ విన్నర్ ఊటీకి ఫ్యామిలీతో కలిసి వెళ్లోచ్చు. మరి ఇంకేందుకు ఆలస్యం వెంటనే లవ్‌గురు సినిమాకు మీ ఫ్యామిలీతో సహా వెళ్లి విన్నర్‌గా నిలిచి మైత్రీ మూవీ మేకర్స్ బంపర్ ఆఫర్ కొట్టేయండి.
View this post on Instagram
లవ్‌గురు కథేంటంటే
అరవింద్ (విజయ్ ఆంటోనీ) మలేసియా నుంచి ఇండియాకు ఇంటికి వస్తాడు. 35 ఏళ్లు వచ్చినా అతడికి పెళ్లి కాదు. తల్లిదండ్రులు పెళ్లి ప్రస్తావన తీసుకురాగనే వద్దు అంటాడు. తన మనసులో ప్రేమ పుట్టినప్పుడే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెబుతాడు. ఈ క్రమంలో తన బంధువులు చనిపోతే వెళ్లి అక్కడ లీలా (హీరోయిన్ మృణాళిని రవి)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుని ఇంట్లో చెప్పేస్తాడు. అయితే పెళ్లికి లీలా కండిషన్ పెడుతుంది, హైదరాబాద్‌కి షిఫ్ట్ అవుతానంటేనే పెళ్లి చేసుకుంటానంటుంది. ఇక వారంలో పెళ్లి చేసుకుని కండిషన్ మీద హైదరాబాద్ వెళతారు. అప్పటి వరకు చాలా పద్ధతిగా ఉన్న ఆమె హైదరాబాద్లో అడుగు పెట్టగానే మోడ్రన్ గెటప్‌లోకి వస్తుంది. హీరోయిన్ అవ్వాలనేది తన లక్ష్యం అని, తన మాట వినకుండా పెళ్లి చేశారని, విడాకులు ఇస్తానని చెబుతుంది. లీలాపై ప్రేమతో, ఆమెకు దగ్గరవ్వడం కోసం సినిమా ప్రొడ్యూస్ చేయడానికి అరవింద్ ముందుకు వస్తాడు. సినిమా నిర్మాణంలో ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? లీలా, అరవింద్ చివరకు కలిశారా? లేదా? అనేది సినిమా.