Ashok Galla New Movie: అమెరికా నేపథ్యంలో మహేష్ మేనల్లుడి కొత్త సినిమా - నమ్రత క్లాప్‌తో మొదలు
సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, పారిశ్రామికవేత్త జయదేవ్ గల్లా కుమారుడు అశోక్ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.

Suryadevara Naga Vamsi New Movie: కంటెంట్ బేస్డ్ కథలకు పెద్ద పీట వేస్తూ వరుస సినిమాలు ప్రొడ్యూస్ చేస్తోంది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. ఒక వైపు స్టార్ హీరోలతో భారీ సినిమాలు చేస్తూ... మరో వైపు యంగ్ హీరోలను ఎంకరేజ్ చేస్తూ డిఫరెంట్ ఫిలిమ్స్ తీయడం మొదలు పెట్టారు సితార అధినేత సూర్యదేవర నాగవంశీ. ఆయన శనివారం కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త జయదేవ్ గల్లా కుమారుడు అశోక్ గల్లా (Ashok Galla) కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలో ప్రొడక్షన్ నంబర్ 27ను ప్రారంభించారు.
అశోక్ గల్లా సరసన శ్రీ గౌరీ ప్రియ
అశోక్ గల్లా కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నాగవంశీతో కలిసి ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ సంస్థ మీద మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య నిర్మిస్తున్న చిత్రమిది.
ఈ సినిమాలో శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya Reddy) కథానాయిక. అశోక్ గల్లా జంటగా ఆమెకు మొదటి చిత్రమిది. సితార, ఫార్చ్యూన్ ఫోర్ సంస్థల్లో ఇంతకు ముందు సూపర్ హిట్ 'మ్యాడ్' సినిమా చేశారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో మరో యువ కథానాయకుడు, ఫైట్ మాస్టర్ విజయ్ కుమారుడు, 'కోట బొమ్మాళి పీఎస్' ఫేమ్ రాహుల్ విజయ్ కూడా యాక్ట్ చేస్తున్నారు. ఆయనకు జంటగా శివాత్మికా రాజశేఖర్ నటించనున్నారు.
Also Read: వెంకటేష్ సినిమా సెట్స్‌లో బాలకృష్ణ సందడి - ఆ స్మైలూ, ఎఫెక్షనూ సూపరంతే
Quirky, funny, and full of heart romantic comedy-drama is heading your way soon! 💘😉
— Sithara Entertainments (@SitharaEnts) September 21, 2024
Sithara Entertainments ~ #ProductionNo27🗽 launched officially with a pooja ceremony today! 🤩
Shoot Begins from September Last week! 🎥@AshokGalla_ @srigouripriya @ActorRahulVijay… pic.twitter.com/PhUORBvXBW
శనివారం సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో వైభవంగా సినిమా ప్రారంభోత్సవం జరిగింది. మహేష్ సతీమణి నమ్రత ఘట్టమనేని ఫస్ట్ క్లాప్ ఇవ్వగా.... చిత్ర బృందానికి హీరో తల్లి పద్మ గల్లా, మంజుల స్వరూప్ స్క్రిప్ట్ అందజేశారు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు.
అమెరికా నేపథ్యంలో సినిమా... దర్శకుడు ఎవరంటే?
అమెరికా నేపథ్యంలో అశోక్ గల్లా కొత్త సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఉద్భవ్ రచయిత, దర్శకుడు. సెప్టెంబర్ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని దర్శక నిర్మాతలు తెలిపారు. కడుపుబ్బా నవ్వించే కామెడీతో పాటు, హృదయాన్ని హత్తుకునే డ్రామా కూడా ఈ సినిమాలో ఉంటుందని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంటుందని నిర్మాతలు తెలిపారు.
Also Read: సుకుమార్ భార్య తబిత బర్త్ డే సెలబ్రేషన్స్... ఫారిన్‌లో చీర కట్టారు, ఎక్కడున్నారో తెలుసా?
Ashok Galla New Movie Cast And Crew: అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి ఓ జంటగా... రాహుల్ విజయ్, శివాత్మికా రాజశేఖర్ మరో జంటగా నటిస్తున్న ఈ సినిమాకు ఛాయాగ్రాహకుడు: భరద్వాజ్ ఆర్, నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ - ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ - సాయి సౌజన్య, రచన - దర్శకత్వం: ఉద్భవ్.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

