Balakrishna Venkatesh: వెంకటేష్ సినిమా సెట్స్‌లో బాలకృష్ణ సందడి - ఆ స్మైలూ, ఎఫెక్షనూ సూపరంతే
Sankranthiki Vasthunnam Movie: 'విక్టరీ' వెంకటేష్ హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'దిల్' రాజు, శిరీష్ నిర్మిస్తున్న సినిమా సెట్స్‌లో నట సింహం నందమూరి బాలకృష్ణ సందడి చేశారు.
విక్టరీ వెంకటేష్ (Venkatesh) కథానాయకుడిగా బ్లాక్ బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. అగ్ర నిర్మాత 'దిల్' రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం మీద ఆయన సోదరుడు శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో జరుగుతోంది. వెంకటేష్ సహా ఇతర ప్రముఖ తారాగణం పాల్గొంటున్నారు. ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే...
వెంకీ అండ్ టీంకు బాలకృష్ణ సర్‌ప్రైజ్
వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా సెట్స్‌లోకి ప్రత్యేక అతిథి వచ్చారు. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ #వెంకీఅనిల్3 చిత్రీకరణ జారుతున్న ప్రదేశంలో సందడి చేశారు.
Sparking excitement all around 🤩✨
— Sri Venkateswara Creations (@SVC_official) September 21, 2024
Natasimham #NandamuriBalakrishna garu graced the sets of #VenkyAnil3 during the latest schedule at RFC 💥
It was a delight to witness the dynamic camaraderie between #NBK, Victory @VenkyMama, and @AnilRavipudi ❤️🔥#SVC58 shoot in progress 💥… pic.twitter.com/9tlqUrcUgG
'ఎఫ్ 2', 'ఎఫ్ 3' సినిమాల తర్వాత వెంకటేష్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కలయికలో తెరకెక్కుతున్న మూడో చిత్రమిది. దీనికి ముందు బాలయ్య, అనిల్ కలిసి 'భగవంత్ కేసరి' చేశారు. వెంకటేష్, బాలకృష్ణ మధ్య మంచి అనుబంధం ఉంది. దానికి తోడు దర్శకుడితో దీనికి ముందు చేశారు. అందుకని, #వెంకీఅనిల్3 సెట్స్‌లో సందడి చేశారు. వెంకీ, బాలకృష్ణ హగ్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: ఆహాలో నాన్ స్టాప్ ఆటలకు ‘బాలు గాని టాకీస్’ రెడీ... బాలయ్య ఫ్యాన్ కథ, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
భార్యగా ఐశ్వర్య... ప్రేయసిగా మీనాక్షి!
'సంక్రాంతికి వస్తున్నాం' టైటిల్ ఈ సినిమాకు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఆ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా తెలుగు అమ్మాయి ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా... మాజీ ప్రేయసిగా మీనాక్షి చౌదరి కనిపించనున్నారు. ట్రై యాంగిల్ క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న చిత్రమిది.
Also Read: ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా సూపర్ స్టార్ రజనీకాంత్... పిచ్చెక్కిస్తున్న ‘వేట్టయాన్’ ప్రివ్యూ
Sankranthiki Vasthunnam Movie Cast And Crew: విక్టరీ వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర లిమాయే, 'నట కిరీటి' రాజేంద్ర ప్రసాద్, 'డైలాగ్ కింగ్' సాయి కుమార్, నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కాబ్రా, చిట్టి తదితరులు ఇతర తారాగణం.
ఈ చిత్రానికి వీఎఫ్ఎక్స్: నరేంద్ర లోగిసా, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్, కూర్పు: తమ్మిరాజు, సహ రచయితలు: ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ, యాక్షన్ డైరెక్టర్: వి వెంకట్, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి,సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, నిర్మాత: శిరీష్, సమర్పణ: 'దిల్' రాజు,రచన - దర్శకత్వం: అనిల్ రావిపూడి.