Balu Gani Talkies: ఆహాలో నాన్ స్టాప్ ఆటలకు ‘బాలు గాని టాకీస్’ రెడీ... బాలయ్య ఫ్యాన్ కథ, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆహా వేదికగా మరో క్రేజీ కామెడీ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ‘బాలు గాని టాకీస్’ పేరుతో నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతోంది, తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ను ఆహా అధికారికంగా ప్రకటించింది.
Balu Gani Talkies Release Date: శివ కుమార్ రామచంద్రపురపు ప్రధాన పాత్రలో విశ్వనాథన్ ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘బాలు గాని టాకీస్’. ఇప్పటికే ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలకావాల్సి ఉన్నా, కొన్ని కారణాలతో వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలో మూవీ లవర్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.
అక్టోబర్ 4 నుంచి ఆహాలో స్ట్రీమింగ్
‘బాలు గాని టాకీస్’ సినిమా ముందుగా చెప్పినట్లుగానే ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ 13 నుంచి ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు ఆక్టోబర్ 4 నుంచి ఆడియెన్స్ కు అందుబాటులోకి రాబోతోంది. ఈ మేరకు ఆహా రిలీజ్ డేట్ పోస్టర్ ను విడుదల చేసింది. మా ‘బాలు గాని టాకీస్’లో ఆటలు అక్టోబర్ 4 నుంచి మొదలవుతాయి’ అంటూ క్యూరియాసిటీ పెంచేసింది.
View this post on Instagram
సినిమాపై అంచనాలు పెంచిన ట్రైలర్
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమా పోస్టర్లు, టీజర్ అలరించాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా మూవీపై ఓ రేంజిలో అంచనాలు పెంచింది. ఈ సినిమా మొత్తంగా బాలు అనే కుర్రాడి సినిమా టాకీస్ చుట్టూ తిరుగుతుంది. బాలు అనే యువకుడికి ఓ థియేటర్ ఉంటుంది. అందులో ఎప్పుడూ అడల్ట్ కంటెంట్ సినిమాలు ఆడిస్తుంటాడు. ఈ సినిమా హాల్ ను రన్ చేసేందుకు చాలా చోట్ల అప్పులు చేస్తాడు. బాలయ్య అబిమాని అయిన బాలు.. ఎలాగైనా తన థియేటర్లలో నందమూరి నటసింహం సినిమా ఆడించాలనే ఆశ ఉంటుంది. ఇంతకీ అతడి కోరిక నెరవేరిందా? లేదా? అనే కథాశంతో మేకర్స్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో హీరో లవ్ స్టోరీ క్రేజీగా ఆకట్టుకుంటుంది. రఘు కుంచె ఈ సినిమాలో నెగెటివ్ పాత్ర పోషిస్తున్నారు.
ఇప్పటికే పలు సినిమాల్లో నటించి ఆకట్టుకన్న శివ
ఇప్పటికే ‘వకీల్‌సాబ్’, ‘మజిలీ’, ‘నిన్ను కోరి’ సహా పలు సినిమాల్లో నటించిన శివ రామచంద్రవరపు.. ‘బాలు గాని టాకీస్’ సినిమాలో హీరోగా కనిపించనున్నారు. ఈ సినిమాలో శ్రావ్య శర్మ హీరోయిన్ పాత్రలో కనిపించనుంది. ఈ మూవీ ఆక్టోబర్ 4 నుంచి ప్రేక్షకులను అలరించనుంది. విశ్వనాథన్ ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శరణ్య శర్మ, రఘు కుంచె, సుధాకర్ రెడ్డి, వంశీ నెక్కంటి, సురేష్ పూజారి, శేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనిధి సాగర్, పి రూపక్ ప్రణవ్ తేజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆదిత్య బీఎన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Read Also: ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా సూపర్ స్టార్ రజనీకాంత్... పిచ్చెక్కిస్తున్న ‘వేట్టయాన్’ ప్రివ్యూ