Game Changer Box Office Collection Day 1 : రామ్ చరణ్ కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్... 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్ ఎన్ని కోట్లంటే?
Ram Charan Game Changer Collection : రామ్ చరణ్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే స్ట్రాంగ్ ఓపెనింగ్ రాబట్టింది.

Game Changer : మెగా అభిమానులకు ముందుగానే సంక్రాంతి సంబరాలు 'గేమ్ ఛేంజర్' మూవీతో మొదలయ్యాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన పాన్ ఇండియా పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ 'గేమ్ ఛేంజర్' థియేటర్లలోకి వచ్చేసింది. ఊహించినట్టుగానే ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి. మొదటి రోజు ఈ సినిమా ఊహించిన విధంగానే మంచి ఓపెనింగ్ రాబట్టింది.
'గేమ్ ఛేంజర్' డే 1 కలెక్షన్స్
రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్'. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించగా, అంజలి, ఎస్జే సూర్య తదితరులు కీలకపాత్రలు పోషించారు. 'ఆర్ఆర్ఆర్' మూవీ తర్వాత రామ్ చరణ్ చేసిన మొదటి సోలో మూవీ ఇదే కావడంతో భారీ అంచనాలతో జనవరి 10న 'గేమ్ ఛేంజర్' థియేటర్లలోకి వచ్చింది. అయితే మొదటి రోజు ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం అదిరిపోయాయి. మొదటి రోజు 'గేమ్ ఛేంజర్' మూవీ ప్రపంచవ్యాప్తంగా 186 గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. 223 కోట్ల షేర్ వసూలు చేస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవుతుంది. ఇక ఈ శని, ఆదివారాలు వీకెండ్ కావడంతో మరింతగా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
View this post on Instagram
'గేమ్ ఛేంజర్' ఎలా ఉందంటే?
'గేమ్ ఛేంజర్' మూవీలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంతో అదరగొట్టాడు. ఈ పొలిటికల్ డ్రామాలో అప్పన్నగా ఆయన నటన అద్భుతం అంటూ అభిమానులు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ఎస్జె సూర్య పాత్ర కూడా బాగా పండింది. ఇంకా అంజలి నటన కూడా సినిమాకు హైలెట్గా నిలిచింది. ఈ పొలిటికల్ కమర్షియల్ మూవీలో రామ్ చరణ్ అభిమానులు ఆశించే అన్నీ అంశాలు ఉన్నాయి అంటున్నారు క్రిటిక్స్. అంతేకాదు ఈ మూవీ జనసేన ఫ్యాన్స్ కు కూడా బాగా కనెక్ట్ అవుతుందనే టాక్ నడుస్తోంది.
సినిమా స్టోరీ ఏంటంటే... రామ్ నందన్ అనే ఐఏఎస్ అధికారి విశాఖకు కలెక్టర్ గా బాధ్యతలు చేపడతారు. ఐఏఎస్ గా వచ్చాడో లేదో విశాఖలో ఉన్న అవినీతిపరులు, అక్రమార్కుల పని పడతారు. ముఖ్యంగా ఇసుక మాఫియా, రేషన్ బియ్యం మాఫియాలకు బుద్ధి చెప్పి, మంచి మార్గంలో నడిచేలా చేస్తాడు. అయితే ఆ మాఫియా వెనుక ముఖ్యమంత్రి సత్యమూర్తి కుమారుడు మోపిదేవి ఉండడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. ఆ గొడవ ఏకంగా ఎన్నికల వరకు తీసుకెళ్తుంది. అసలు రామ్ నందన్ పోలికలతో ఉన్న ఈ అప్పన్న ఎవరు? అతను ఎలా చనిపోయాడు? అప్పన్న భార్య పార్వతిని చూసి ముఖ్యమంత్రి ఎందుకు షాక్ అవుతాడు? ఎన్నికల్లో ఎవరు గెలిచారు? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అలాగే ఈ మూవీ సాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు, జీ సినిమాలు దక్కించుకున్నాయి.
Also Read : 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

