Balakrishna Akhanda 2: ఇక్కడ థియేటర్లలో, అక్కడ కుంభమేళాలో... 'అఖండ 2' అప్డేట్ ఇచ్చిన బాలయ్య, ఫ్యాన్స్‌కి పూనకాలే
Balakrishna and Boyapati Film: నందమూరి నటసింహం బాలయ్య ‘డాకు మహారాజ్’గా థియేటర్లను షేకాడిస్తూనే.. మరోవైపు ఆయన నటిస్తోన్న ‘అఖండ 2’ సినిమా అప్డేట్‌ని వదిలి ఫ్యాన్స్‌కు ఈ పండక్కి డబుల్ ట్రీట్ ఇచ్చేశారు.

Balayya Akhanda2 Thaandavam Update: సంక్రాంతికి ‘డాకు మహారాజ్’గా థియేటర్లలోకి వచ్చిన గాడ్ ఆఫ్ మాసెస్, నందమూరి నటసింహం బాలయ్య.. థియేటర్లలో శివతాండవ మాడేస్తున్నాడు. ఆ తాండవాన్ని తట్టుకోవడమే ఫ్యాన్స్ వల్ల కాకపోతుంటే.. ఇప్పుడు మరో తాండవానికి బాలయ్య తెరలేపాడు. థియేటర్లలో ‘డాకు’గా దడదడలాడిస్తున్న బాలయ్య.. మరోవైపు ఉత్తరప్రదేశ్, ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాలో మరో తాండవానికి శ్రీకారం చుట్టారు. అదే ‘అఖండ2: తాండవం’. ‘అఖండ’ సినిమాతో అందరి ప్రశంసలు అందుకుని, అద్భుతమైన హిట్ అందుకున్న బాలయ్య.. తనకే సాధ్యమైన విధంగా ఆ సినిమాలో చెలరేగిపోయారు. ఇప్పుడా ‘అఖండ’కు సీక్వెల్‌గా ఊర మాస్ డైరెక్టర్ బోయపాటితో మరోసారి ఆయన కొలాబరేట్ అవుతున్నారు.
రీసెంట్‌గా ‘అఖండ 2: తాండవం’ అనౌన్స్‌మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కామ్‌గా షూటింగ్ కూడా మొదలెట్టేసి.. కొంతమేర షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఇప్పుడు సంక్రాంతిని పురస్కరించుకుని ఈ సీక్వెల్‌కు సంబంధించిన అప్డేట్‌ని మేకర్స్ వదిలారు. ఈ అప్డేట్ అలాంటిలాంటి అప్డేట్ కాదు.. ‘అఖండ 2’ న్యూ షూటింగ్ షెడ్యూల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మహా కుంభమేళాలో సోమవారం గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ షెడ్యూల్‌లో చిత్రయూనిట్ చాలా కీలకమైన సన్నివేశాలని ఈ మహా కుంభమేళాలో చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.
ఈ అప్డేట్ వచ్చినప్పటి నుండి నందమూరి అభిమానుల ఆనందానికి అవధులే లేవంటే నమ్మాలి మరి. ఎందుకంటే, ఒక వైపు ‘డాకు మహారాజ్’ సంబరాల్లో అభిమానులను ముంచేసిన బాలయ్య.. అస్సలు కొద్దిగా కూడా గ్యాప్ ఇవ్వకుండా.. వెంటనే మరో సినిమా షూటింగ్‌లో పాల్గొని.. వెంటనే అప్డేట్ వదలడంతో.. ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్ ఇచ్చినట్లయింది. అందులోనూ భారీ అంచనాలున్న ‘అఖండ 2’ అప్డేట్ కావడంతో.. ఈ సంక్రాంతి నందమూరి ఫ్యాన్స్‌కి మెమరబుల్‌గా ఉండేలా బాలయ్య ప్లాన్ చేశాడని ఆయన అభిమానులు అనుకుంటూ ఉండటం విశేషం. బోయపాటి శ్రీనుతో బాలయ్య సినిమా అంటే ఉండే క్రేజే వేరు. ఆ క్రేజ్‌కి తగ్గట్టుగానే బోయపాటి ఈ ‘అఖండ 2’ను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నట్లుగా తెలుస్తోంది.
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ కోసం నాల్గవ సారి కొలాబరేట్ అయ్యారు. ‘అఖండ’తో అదరగొట్టిన ఈ కాంబో.. ఈసారి మరింత హై -ఆక్టేన్ యాక్షన్, గ్రిప్పింగ్ డ్రామాను ఇస్తామని ప్రామిస్ చేస్తోంది. ఎం తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘అఖండ’ సినిమాకు ఇచ్చిన సంగీతంతో బాక్సులు బద్దల్ చేసిన ఎస్. థమన్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు. 25 సెప్టెంబర్, 2025న దసరా కానుకగా ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకువస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సో.. దసరాకి కూడా థియేటర్లలో తాండవమే అన్నమాట!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

