Ishmart Jodi 3 Winner: ప్రేరణ - శ్రీపాద్ జోడీ కప్పు కొట్టింది... బిగ్ బాస్ ట్రోఫీ మిస్ అయ్యింది కానీ ఈసారి విన్నరే
Prerana Kambam Shripad Deshpande: బుల్లితెర నటి ప్రేరణ కంభం, శ్రీపాద్ దేశ్ పాండే దంపతులు 'ఇస్మార్ట్ జోడీ 3' సీజన్ విజేతలుగా నిలిచారు. ఆదివారం రాత్రి జరిగిన ఫినాలేలో వాళ్ళు కప్పు అందుకున్నారు.

సీరియల్ ఆర్టిస్ట్ ప్రేరణ (Prerana Kambam) 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 8'లో పార్టిసిపేట్ చేసింది. గ్రాండ్ ఫినాలే వరకు చేరుకుంది. అయితే మూడు అడుగుల దూరంలో ఆవిడకు కప్ మిస్ అయింది. బిగ్ బాస్ ముగిసిన వెంటనే 'స్టార్ మా'లో 'ఇస్మార్ట్ జోడి సీజన్ 3' (Ishmart Jodi 3) మొదలు అయ్యింది. భర్త శ్రీపాద్ దేశ్ పాండేతో కలిసి అందులో అడుగు పెట్టింది ప్రేరణ. ఈసారి విన్నర్ ట్రోఫీ అందుకుంది.
ఇస్మార్ట్ జోడి 3 విజేతలు...
ప్రేరణ & శ్రీపాద్ దంపతులు!
Prerana Kambam family background: ప్రేరణ తమిళ కుటుంబంలో జన్మించిన అమ్మాయి. అయితే... ఆమెది హైదరాబాద్! తండ్రి సాఫ్ట్వేర్ ఉద్యోగి కావడం, హైదరాబాద్ టిసిఎస్ కంపెనీలో ఆయన పని చేస్తున్న సమయంలో భాగ్య నగరంలో ప్రేరణ జన్మించింది. ఆ తర్వాత ఫ్యామిలీ బెంగళూరు షిఫ్ట్ కావడంతో ఎడ్యుకేషనల్ లైఫ్ అంతా అక్కడ జరిగింది. మళ్లీ సీరియల్ ఆర్టిస్టుగా హైదరాబాద్ వచ్చారు ప్రేరణ.
View this post on Instagram
కన్నడలో కొన్ని సీరియల్స్ చేసిన తర్వాత 'కృష్ణ ముకుంద మురారి'తో తెలుగు బుల్లితెర మీద అడుగు పెట్టారు. 'బిగ్ బాస్ సీజన్ 8'లో పార్టిసిపేట్ చేశారు. కన్నడ సీరియల్స్ కంటే తెలుగు మీద ఆవిడ ఎక్కువగా కాన్సెంట్రేట్ చేస్తున్నారు. ఇస్మార్ట్ జోడి విజేతగా నిలవడంతో మరిన్ని అవకాశాలు వస్తాయని చెప్పవచ్చు. బిగ్ బాస్ రివ్యూల ద్వారా పాపులర్ అయిన ఆది రెడ్డి, కవిత దంపతులు 'ఇస్మార్ట్ జోడి 3' స్థానంతో నిలబెట్టుకున్నారు.
View this post on Instagram
నటుడు, దర్శకుడు, హోస్ట్ ఓంకార్ పేరు చెబితే తెలుగు బుల్లితెర వీక్షకులలో గుర్తుపట్టని వారు ఎవరు ఉండరు. ఆయనకు అంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తనదైన హోస్టింగ్, డిఫరెంట్ కాన్సెప్ట్ షోలతో తెలుగు ప్రజలను అలరిస్తున్నారు. ఆయన నేతృత్వంలో 'ఇస్మార్ట్ జోడి 3' మొదలు అయింది. మొదటి వారం 6.33 టిఆర్పి సాధించింది. ఇప్పుడు ఈ షో కూడా ముగిసింది. మార్చి 23 (ఆదివారం) రాత్రి గ్రాండ్ ఫినాలే జరిగింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

