అన్వేషించండి

Travel Insurance: రైలు ప్రయాణీకులకు బిగ్‌ రిలీఫ్‌, ₹10 లక్షల ఇన్సూరెన్స్‌ ఆటోమేటిక్‌గా అప్లై అవుతుంది

వయస్సు, వర్గం, అనారోగ్యం వంటి ఏ కారణంతో సంబంధం లేకుండా యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌ (accident insurance) తీసుకోవడానికి ఎలిజిబుల్‌ అవుతారు.

Train Travel Insurance: రైలు ప్రయాణీకులకు రైల్వే శాఖ బిగ్‌ రిలీఫ్‌ ఇచ్చింది. ట్రైన్‌ జర్నీ చేసే ప్రతి వ్యక్తికి 10 లక్షల రూపాయల ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఆటోమేటిక్‌గా అప్లై అయ్యేలా టిక్కెట్‌ బుకింగ్‌లో మార్పు చేసింది.

రైలు ప్రయాణం కోసం IRCTC వెబ్‌సైట్‌లో టిక్కెట్‌ బుక్ చేసే సమయంలో, ట్రావెల్ ఇన్సూరెన్స్ (travel insurance) ఆప్షన్‌ కూడా కనిపిస్తుంది. చాలా మంది దీనిని టిక్‌ చేయరు, లేదా మరిచిపోతుంటారు. వాస్తవానికి ఈ ఇన్సూరెన్స్‌ పాలసీ విలువ కేవలం 35 పైసలు. ఈ పాలసీ తీసుకుంటే, జర్నీ పూర్తయ్యే వరకు సదరు పాసింజర్‌ ఇన్సూరెన్స్‌ కవరేజ్‌లో ఉంటాడు. జర్నీలో ఏదైనా ప్రమాదం జరిగితే, ప్రయాణీకుడికి లేదా అతని కుటుంబానికి రూ. 10 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది.

IRCTC వెబ్‌సైట్‌ ద్వారా రోజుకు దాదాపు 15 లక్షల మంది టికెట్లు బుక్‌ చేసుకుంటున్నారు. ఈ వెబ్‌సైట్‌లో టిక్కెట్‌ బుక్‌ చేసే ప్రతి వ్యక్తి... వయస్సు, వర్గం, అనారోగ్యం వంటి ఏ కారణంతో సంబంధం లేకుండా యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌ (accident insurance) తీసుకోవడానికి ఎలిజిబుల్‌ అవుతారు. టిక్కెట్‌ బుక్‌ చేసే టైమ్‌లోనే ఇన్సూరెన్స్‌ ఆప్షన్‌తో ఒక బాక్స్‌ కనిపిస్తుంది. టిక్కెట్‌ బుక్‌ చేసే వ్యక్తి ఆ బాక్స్‌లో టిక్‌ చేస్తే చాలు, ఇన్సూరెన్స్‌ అప్లికబుల్‌ అవుతుంది. అయితే, చాలా మంది ఈ ఆప్షన్‌ తీసుకోవడం లేదు. టిక్కెట్‌ బుక్‌ చేసుకునే తొందరలో కొందరు దీనిని గమనించడం లేదు. గమనించిన వారిలో మరికొందరు నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. ఇటీవల, ఒడిశా రైలు ప్రమాదంలో మరణించిన వారిలో కొంతమంది ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోలేదు. దానివల్ల వాళ్ల కుటుంబానికి పెద్ద ఆర్థిక సాయం మిస్సయింది.

టికెట్ బుకింగ్‌ ప్రాసెస్‌లో చిన్న మార్పు
ప్రయాణికులందరికీ ఇన్సూరెన్స్‌ బెనిఫిట్స్‌ అందాలనే ఉద్దేశంతో, ₹10 లక్షల ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఆటోమేటిక్‌గా అప్లై అయ్యేలా టికెట్ బుకింగ్‌ ప్రాసెస్‌లో చిన్న మార్పు చేసింది రైల్వే శాఖ. కేవలం 35 పైసలకే లభించే ఇన్సూరెన్స్‌ ఫెసిలిటీని డిఫాల్ట్‌ చేసింది. అంటే, ఇన్సూరెన్స్‌ మీద ఆటోమేటిక్‌గా టిక్‌ ఉంటుంది. ఇప్పుడు దీనిని ప్రయాణీకులు గమనించినా, గమనించకపోయినా.. అందరికీ ప్రమాద బీమా వర్తిస్తుంది. ఒకవేళ దీనిని వద్దు అనుకుంటే టిక్‌ తీసేస్తే సరిపోతుంది.

ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు?
రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్‌ ఉన్నప్పుడు, రైలు ప్రయాణ సమయంలో ప్రయాణీకుడికి ఏదైనా ప్రమాదం జరిగితే, జరిగిన నష్టాన్ని బట్టి బీమా మొత్తం అందుతుంది. రైలు ప్రమాదంలో ప్రయాణికుడు మరణిస్తే అతని కుటుంబానికి రూ. 10 లక్షలు అందుతుంది. ప్రమాదంలో రైల్వే ప్రయాణికుడు పూర్తి స్థాయి అంగవైకల్యానికి గురైతే బీమా కంపెనీ అతనికి 10 లక్షల రూపాయలు పరిహారంగా ఇస్తుంది. పాక్షిక అంగవైకల్యానికి రూ. 7.5 లక్షలు, గాయాలు అయితే రూ. 2 లక్షలను ఆసుపత్రి ఖర్చులుగా చెల్లిస్తుంది. రైలు ప్రమాదం జరిగిన 4 నెలల లోపు క్లెయిమ్ చేసుకోవచ్చు. బీమా కంపెనీ కార్యాలయాన్ని వెళ్లి, అవసరమైన పత్రాలు సమర్పించి బీమా మొత్తాన్ని పొందవచ్చు. 

ఇన్సూరెన్స్‌ రూల్స్‌ ప్రకారం, ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవడానికి నామినీ వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి. బీమా పాలసీలో నామినీ పేరు ఉంటే ఇన్సూరెన్స్‌ క్లెయిమ్ చేయడం ఈజీగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: భయపెడుతున్న పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
Viral News: పవన్‌తో బొత్స ఆలింగనం- సైలెంట్‌గా పక్కకు తప్పుకున్న పెద్దిరెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్సీలు
పవన్‌తో బొత్స ఆలింగనం- సైలెంట్‌గా పక్కకు తప్పుకున్న పెద్దిరెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్సీలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
Viral News: పవన్‌తో బొత్స ఆలింగనం- సైలెంట్‌గా పక్కకు తప్పుకున్న పెద్దిరెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్సీలు
పవన్‌తో బొత్స ఆలింగనం- సైలెంట్‌గా పక్కకు తప్పుకున్న పెద్దిరెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్సీలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
Stock Market News: పడి లేచిన అదానీ స్టాక్స్- భారీ లాభాల్లో సెన్సెక్స్ అండ్‌ నిఫ్టీ- రూ.5.50 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
పడి లేచిన అదానీ స్టాక్స్- భారీ లాభాల్లో సెన్సెక్స్ అండ్‌ నిఫ్టీ- రూ.5.50 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద  
Game Changer First Review : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
Embed widget