Kannappa Teaser Release Date: కన్నప్ప టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన విష్ణు మంచు
Vishnu Manchu's Kannappa Teaser: విష్ణు మంచు టైటిల్ పాత్రలో రూపొందుతున్న మైథలాజికల్ యాక్షన్ డ్రామా 'కన్నప్ప'. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల తేదీని ఈరోజు అనౌన్స్ చేశారు.

డైనమిక్ స్టార్ విష్ణు మంచు (Vishnu Manchu) కథానాయకుడిగా రూపొందుతున్న మైథాలజికల్ సోషియో ఫాంటసీ యాక్షన్ డ్రామా 'కన్నప్ప'. మహాశివరాత్రి (Mahashivratri) సందర్భంగా ఇవాళ టీజర్ విడుదల తేదీని అనౌన్స్ చేశారు.
మార్చి ఒకటో తేదీన 'కన్నప్ప' టీజర్!
Kannappa teaser release date and time: మార్చి ఒకటి... ఈ శనివారం కన్నప్ప టీజర్‌ను ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నట్లు విష్ణు మంచు తెలిపారు. మహా శివరాత్రి సందర్భంగా విష్ణు మంచు ఈ రోజు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లారు. ఆ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. మెట్ల మార్గంలో ఆయన ఏడు కొండల మీదకు నడిచి వెళ్లారు.
'కన్నప్ప' నుంచి 'శివ శివ శంకరా' పాటను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. దానికి మంచి స్పందన లభిస్తోంది. ఆల్రెడీ ఆ పాటను ఎనిమిది కోట్ల (8 మిలియన్ వ్యూస్) వీక్షించారు. ఆ ఒక్క పాటతో సినిమా క్రేజ్ మరింత పెరిగిందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
Mark your calendars! #Kannappa Teaser is dropping on March 1st! The journey of devotion and valor unfolds further. Are you ready? ⚔🔥#Kannappa🏹 #KannappaTeaser #HarHarMahadevॐ@themohanbabu @iVishnuManchu @Mohanlal #Prabhas @akshaykumar @realsarathkumar @MsKajalAggarwal… pic.twitter.com/7XIteVSxbc
— 24 Frames Factory (@24FramesFactory) February 26, 2025
ఏప్రిల్ 25న సినిమా గ్రాండ్ రిలీజ్!
Kannappa movie release date: ఏప్రిల్ 25వ తేదీన 'కన్నప్ప'ను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లే ప్రచార కార్యక్రమాలను విష్ణు మంచు ప్రారంభించారు.
Also Read: తెలుగులో విడుదలకు బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'ఛావా' రెడీ... ఎన్టీఆర్ డబ్బింగ్‌లో నిజమెంత?
ప్రభాస్ ఒక్క రూపాయి తీసుకోలేదు!
'కన్నప్ప'లో మహా రుద్రని పాత్రలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటించినందుకు ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని విష్ణు మంచు తెలిపారు. తమ కుటుంబంతో ఉన్న స్నేహం, ముఖ్యంగా తన నాన్న మంచు మోహన్ బాబు మీద ఉన్న గౌరవం కారణంగా ఫ్రీగా చేశారని వివరించారు. మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ సైతం రెమ్యూనరేషన్ తీసుకోలేదని, తమ కోసం సినిమాలో నటించారని చెప్పారు.
ఇక 'కన్నప్ప' సినిమాలో మహా శివుని పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించారు. ఇతర కీలక పాత్రల్లో లెజెండరీ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, చందమామ కాజల్ అగర్వాల్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకం మీద ఈ సినిమాను మోహన్ బాబు ప్రొడ్యూస్ చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

