Mimoh Chakraborty: ప్లీజ్ నాన్న.. ప్రభాస్‌తో ఒక్క ఫోటో - అలా రిక్వెస్ట్ చేశానంటున్న 'ఫౌజీ' నటుడి కుమారుడు, 'నేనెక్కడున్నా' మూవీతో హీరోగా ఎంట్రీ
Nenekkadunna Movie: 'నేనెక్కడున్నా' మూవీతో తెలుగులో హీరో ఎంట్రీ ఇస్తున్నారు మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి. ఈ నెల 28న మూవీ విడుదల కానుండగా.. చిత్ర విశేషాలను ఆయన పంచుకున్నారు.

Mimoh Chakraborty's Shares Interesting Things About Nenekkadunna Movie: రెబల్ స్టార్ ప్రభాస్ ఫోటో కోసం తన తండ్రిని రిక్వెస్ట్ చేసినట్లు ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty) కుమారుడు మిమో చక్రవర్తి (Mimoh Chakraborty) తెలిపారు. ఆయన హీరోగా థ్రిల్లర్ మూవీ 'నేనెక్కడున్నా'తో (Nenekkadunna) తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఈ మూవీ ఈ నెల 28న విడుదల కానుండగా.. ఆసక్తికర విషయాలను లేటెస్ట్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన చిన్నప్పటి నుంచీ తెలుగు, తమిళ సినిమాలు చూస్తూ పెరిగానని.. అందుకే సినిమా అంటే ఆసక్తి ఏర్పడిందని చెప్పారు. 'నేను హీరోగా చేస్తున్నానని నాన్నకు తెలిసినప్పుడు హ్యాపీగా ఫీలయ్యారు. తెలుగు సినిమాలో ఛాన్స్ రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. రేపు ఆవకాశం వస్తే తమిళ, మలయాళ, పంజాబీ, భోజ్‌పూరి సినిమాలు చేస్తాను. నేను ఏ పని చేసినా నిజాయతీగా చేయాలని నాన్న చెప్పారు. నటుడిగానే కాదు. వ్యక్తిగానూ నిజాయతీగా ఉండమని చెప్పారు.' అని పేర్కొన్నారు.
సినిమాలో ఛాన్స్ అలా..
'నేనెక్కడున్నా' సినిమాలో తన కంటే ముందు సాషా ఛెత్రి కన్ఫర్మ్ అయ్యారని.. సినిమాలో హీరో పాత్ర కోసం నటులను చూస్తున్నారని తెలిసి నన్ను రికమెంట్ చేశారని మిమో చక్రవర్తి తెలిపారు. అప్పుడు దర్శకుడు మాధవ్ కోదాడ ముంబై వచ్చి తనకు కథ చెప్పారని.. కథ విన్న వెంటనే 'ఎస్' చెప్పానన్నారు. ఇది మంచి సందేశంతో కూడిన ఫిల్మ్ మాత్రమే కాదని.. తనకు తెలుగులో మంచి డెబ్యూ అవుతుందని అనుకున్నట్లు తెలిపారు. 'ఈ మూవీ జర్నలిజం బ్యాక్ డ్రాప్‌లో వచ్చే మంచి మెసేజ్ మూవీ. ఎట్ ద సేమ్ టైమ్.. ఇదొక కంప్లీట్ పాప్ కార్న్ ఎంటర్‌టైనర్. పాటలు, మంచి యాక్షన్ సీక్వెన్సులు, సన్నివేశాలు ఉన్నాయి. మహిళా జర్నలిస్టులు తమ కాళ్ళ మీద ఎందుకు నిలబడలేరు? అనే చక్కటి సందేశాన్ని ఇస్తుంది.' అని చెప్పారు.
Also Read: సరదాగా ఓసారి గడిచిన కాలానికి వెళ్లొద్దామా! - మరోసారి థియేటర్లలోకి బాలయ్య 'ఆదిత్య 369', ఎప్పుడంటే?
ప్రభాస్ ఫోటో కోసం నాన్నకు రిక్వెస్ట్
నాన్న మిథున్ చక్రవర్తి ప్రాక్టికల్ ఫాదర్ అని మిమో చక్రవర్తి అన్నారు. 'మేము తండ్రీకొడుకులుగా కంటే స్నేహితులుగా ఉంటాం. బయట జనాలకు ఆయన సూపర్ స్టార్. కానీ, నాకు నాన్న. ప్రాక్టికల్ ఫాదర్ అని చెప్పాలి. 'ఓ మై గాడ్' రీమేక్ గోపాల గోపాలలో నాన్న నటించారు. నేను ఒరిజనల్, రీమేక్ రెండూ చూశాను. ప్రజెంట్ ప్రభాస్ గారి ఫౌజీ సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్ సమయంలో ప్రభాస్ గారితో ఒక్క ఫోటో కావాలని నాన్నను రిక్వెస్ట్ చేశాను. పవన్ కళ్యాణ్, ప్రభాస్, దళపతి విజయ్ అంటే ఇష్టం. రజనీకాంత్ అన్నా ఇష్టమే. మిగతా స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేయాలని ఉంది. విక్రమ్ భట్ దర్శకత్వంలో పదమూడేళ్ల క్రితం చేసిన హిట్ ఫిల్మ్ 'హాంటెడ్' సీక్వెల్ చేస్తున్నా. నెట్‌ఫ్లిక్స్ కోసం 'ఖాకి' వెబ్ సిరీస్ సీజన్ 2 చేస్తున్నాను.' అని చెప్పారు.
'నేనెక్కడున్నా' మూవీ మంచి థ్రిల్లర్ అని.. దర్శకుడు మాధవ కోదాడ ఇంతకు ముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసినట్లు మిమో చక్రవర్తి తెలిపారు. 'ఇది ఆయన ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్. దీని కోసం ఎంతో కష్టపడ్డారు. మాధవ్ కోదాడ సీన్ వివరించిన తర్వాత ఎలా నటించాలనేది ఆర్టిస్టులకు వదిలేస్తారు. ఈ థ్రిల్లర్ సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ థ్రిల్ ఇస్తుంది. ఎండింగ్ ట్విస్ట్ జట్కా ఇస్తుంది. ఫస్ట్ టైం నేను కథ విన్నప్పుడు ఆ ట్విస్ట్ ఊహించలేదు. మెసేజ్ కూడా బావుంటుంది.' అంటూ చిత్ర విశేషాలు పంచుకున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

