Aditya 369 Re Release: సరదాగా ఓసారి గడిచిన కాలానికి వెళ్లొద్దామా! - మరోసారి థియేటర్లలోకి బాలయ్య 'ఆదిత్య 369', ఎప్పుడంటే?
Aditya 369 Re Release: నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే ఐకానిక్ మూవీ అంటే 'ఆదిత్య 369' అని చెప్పొచ్చు. తాజాగా ఈ సినిమాను డిజిటల్ హంగులతో రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Aditya 369 Re Release On This Summer: టాలీవుడ్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన ఫస్ట్ ఇండియన్ సైంటిఫిక్ ఫిక్షనల్ మూవీ 'ఆదిత్య 369' (Aditya 369). 1991లో విడుదలైన ఈ సినిమా ఎప్పటికీ ఓ సంచలనమే. టైమ్ ట్రావెల్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన సినిమాలో బాలయ్య డబుల్ రోల్ చేశారు. బాలకృష్ణ శ్రీకృష్ణదేవరాయలు పాత్రలో తన అభినయం, డైలాగ్స్, నటనతో మెప్పించారు. 'ఆదిత్య 369' సినిమా అంటే ఇప్పటికీ ఫ్యాన్స్‌కు ఓ ఐకానిక్. ప్రజెంట్ రీ రిలీజ్ ట్రెండ్ సాగుతున్న క్రమంలో మరోసారి ఈ మూవీని థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా డిజిటలైజ్ చేసి ఈ సమ్మర్‌లో గ్రాండ్‌గా రీ రిలీజ్ చేయబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని శివలెంక ప్రసాద్ నిర్మించారు. ఇళయరాజా మ్యూజిక్, జంధ్యాల డైలాగ్స్, ఎస్పీ బాలు గాత్రం, సింగీతం దర్శక నైపుణ్యం అన్నీ కలగలిపి ఈ చిత్రం సినీ అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది.
Bringing the FIRST SCI-FI of INDIAN CINEMA, #Aditya369 back to the Big Screens in 4K ☀️
— Sridevi Movies (@SrideviMovieOff) February 26, 2025
This Summer, let's travel back in time to witness #NBK's Timeless Classic in theatres again✨️
Natasimha #NandamuriBalakrishna #SingeetamSrinivasaRao #SPBalasubrahmanyam @ilaiyaraaja… pic.twitter.com/jxfW229m2O
Bringing the FIRST SCI-FI of INDIAN CINEMA, #Aditya369 back to the Big Screens in 4K ☀️
— Jayaganesh NBK 𓃵 (@JayaganNBK) February 26, 2025
This Summer, let's travel back in time to witness #NBK's Timeless Classic in theatres again✨️ pic.twitter.com/eEHr8olxwF
అయితే, ఆదిత్య 369 తొలిసారి విడుదల చేసిన సమయంలో ఎంత ఉత్సాహంగా, ఆసక్తిగా ఉన్నానో ఇప్పుడు రీ రిలీజ్‌కు కూడా అలాగే ఉన్నానని నిర్మాత శివలెంక ప్రసాద్ తెలిపారు. 'ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే ఈ సినిమాను డిజిటల్ 4Kలో ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దాం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్నీ వయసుల వారిని, నందమూరి అభిమానులని అలరించిన ఈ చిత్రాన్ని మళ్లీ థియేటర్లలోకి తీసుకు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎన్నో మంచి చిత్రాలు తెరకెక్కించిన నాకు, మా నిర్మాణ సంస్థకి ఓ గొప్ప గుర్తింపు, అద్భుతమైన పునాది 'ఆదిత్య 369'. ఈ సమ్మర్‌లో గ్రాండ్‌గా రీ రిలీజ్ చేయడానికి పూర్తి సన్నాహాలు చేస్తున్నాం.' అని పేర్కొన్నారు.
Also Read: విజయ్ దేవరకొండ అభిమానులకు బ్యాడ్ న్యూస్... ఆ హిందీ మూవీ కోసం తన సినిమా వాయిదా వేశాడా?
త్వరలోనే సీక్వెల్
మరోవైపు, ఈ మూవీకి సీక్వెల్ సైతం అనౌన్స్‌మెంట్ వచ్చింది. అన్‌స్టాపబుల్‌విత్ NBKలో ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని బాలకృష్ణ ప్రకటించారు. ఈ సినిమాకు 'ఆదిత్య 999 మ్యాక్స్' టైటిల్ ఖరారు చేసినట్లు చెప్పారు. ఇందులో బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా నటిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read: 'తండేల్' సక్సెస్ మీట్‌లో డీజేగా మారిన నాగ చైతన్య... శోభిత క్యూట్ రియాక్షన్ ఏంటంటే?





















