Naga Chaitanya: 'తండేల్' సక్సెస్ మీట్‌లో డీజేగా మారిన నాగ చైతన్య... శోభిత క్యూట్ రియాక్షన్ ఏంటంటే?
Naga Chaitanya : 'తండేల్' మూవీ సక్సెస్ తో ఫుల్ ఖుషీగా ఉన్న నాగ చైతన్య తాజాగా డీజేగా కొత్త అవతారం ఎత్తారు. ఆ పిక్ ను శోభిత సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రియాక్ట్ అయ్యింది.

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం 'తండేల్' సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. చిత్ర బృందంతో పాటు సినీ ప్రముఖులను వరుసగా పార్టీలు ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నారు చై. ఆయన తాజాగా నటుడి నుంచి డీజేగా మారి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ నేపథ్యంలోనే నాగ చైతన్య డీజే ప్లే చేస్తున్న పిక్ పై ఆయన భార్య శోభిత ధూళిపాళ స్పందించింది.
డీజేగా కొత్త అవతారం ఎత్తిన నాగ చైతన్య
హీరోయిన్ శోభిత ధూళిపాళ - అక్కినేని నాగ చైతన్య గత ఏడాది డిసెంబర్ 5న జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అక్కినేని కుటుంబం నుంచి అభిమానులకు ఏదో ఒక శుభవార్త అందుతోంది. 'తండేల్' మూవీ కూడా పెళ్లయ్యాకే రిలీజై, బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే తన భర్త నాగచైతన్య డీజేగా మారిన ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది శోభిత. 'తండేల్' మూవీలో నటుడిగా అదరగొట్టిన నాగచైతన్య డీజేగా మారి తనలోని మ్యూజిషియన్ ను నిద్రలేపాడు.
శోభిత తాజాగా షేర్ చేసిన ఫోటోలో నాగ చైతన్య ప్రొఫెషనల్ డీజే సెటప్ తో మ్యూజిక్ ని మిక్స్ చేయడంలో మునిగిపోయి కనిపిస్తున్నాడు. అందులో బ్రౌన్ కలర్ స్వెటర్లో, క్యాజువల్ లుక్ లో, మెడలో హెడ్ ఫోన్స్ తో అచ్చం డీజే లాగా ఫోకస్ చేశాడు. ఆ ఫోటోలను షేర్ చేస్తూ శోభిత రెడ్ హార్ట్ ఎమోజిని పంచుకుంది. నిజానికి నాగ చైతన్యకు యాక్టింగ్ తో పాటే రేసింగ్ కూడా ఇష్టం అన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఆయన డీజేగా కూడా మారగలడు అన్న విషయం తెలిసిన చై అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
కోడలు అడుగు పెట్టిన వేళా విశేషం
నాగచైతన్య - శోభిత ధూళిపాళ ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించడానికి ఎలాంటి సందర్భం వచ్చినా వదిలి పెట్టరు. ఈ జంట కొన్ని రోజుల క్రితం 'తండేల్' సక్సెస్ బాష్ లో కనిపించారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో నాగ చైతన్య 'బుజ్జి తల్లి' అంటూ శోభిత పట్ల తన ప్రేమను వ్యక్తం చేయడం మరింత క్యూట్ గా అనిపించింది. శోభిత తమ ఇంటికి విచ్చేసిన వేళా విశేషం... వరుస గుడ్ న్యూస్ తో చాలా సంతోషంగా ఉన్నామని నాగార్జున సైతం వేదికపైనే ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా 'తండేల్' మూవీ ఫిబ్రవరి 7న థియేటర్లలోకి వచ్చింది. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ శ్రీకాకుళం మత్స్యకారుల జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఈ పాన్ ఇండియా మూవీ పాజిటివ్ టాక్ తో 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక రెండు రోజుల క్రితం నాగచైతన్య ఇండస్ట్రీలోని ప్రముఖులకు సక్సెస్ పార్టీ ఇవ్వడం, దానికి పలువురు సెలబ్రిటీలు హాజరు కావడం జరిగింది. రానా రెస్టారెంట్లో ఈ పార్టీ జరగగా సూర్యదేవర నాగవంశీ, అశ్వని దత్, అల్లు అరవింద్, రానా దగ్గుబాటి, దేవి శ్రీ ప్రసాద్, నిఖిల్, రాఘవేంద్రరావు, డైరెక్టర్ మారుతి తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

