అన్వేషించండి

Aadhi Pinisetty: నిక్కి గల్రానీతో విడాకుల వార్తలు - ఆది పినిశెట్టి ఏమన్నారంటే?, క్లిక్స్ కోసం ఎంతకైనా తెగిస్తారా అంటూ..

Aadhi Pinisetty On Divorce Rumours: నటుడు ఆది పినిశెట్టి తన విడాకుల వార్తలపై స్పందించారు. నిక్కీ గల్రానీతో తన జీవితం సంతోషంగా ఉందని.. క్లిక్స్ కోసం కొందరు ఎంతకైనా తెగిస్తారని అన్నారు.

Aadhi Pinisetty Reaction On Divorce Rumours With Nikki Galrani: నటుడు ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) తన వైవాహిక జీవితంపై వస్తోన్న రూమర్లపై స్పందించారు. నిక్కీ గల్రానీతో (Nikki Galrani) తాను విడిపోతున్నట్లు వస్తోన్న వార్తలపై అసహనం వ్యక్తం చేశారు. 'శబ్దం' సినిమా ప్రమోషన్లలో భాగంగా లేటెస్ట్ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్, మ్యారేజ్ లైఫ్ గురించి మాట్లాడారు. తాను నిక్కీ గల్రానీతో విడాకులు తీసుకుంటున్నట్లు వస్తోన్న వార్తలను చూసి చాలా బాధ పడ్డానని.. అలాంటి వార్తలు రాసే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నిక్కీ నాకు మొదటి నుంచి మంచి స్నేహితురాలు. నా ఇంట్లో వాళ్లు సైతం ఆమెకు బాగా నచ్చారు. అలాగే, నా కుటుంబానికి సైతం ఆమె ఎంతో చేరువైంది. ఆమెతో లైఫ్ నాకు సంతోషంగా ఉంటాననిపించింది. దీంతో పెద్దల అంగీకారంతో మేము వివాహం చేసుకున్నాం. ప్రస్తుతం జీవితాన్ని సంతోషంగా సాగిస్తున్నాం. అయితే, మేమిద్దరం విడాకులు తీసుకుంటున్నట్లు కొన్ని యూట్యూబ్ కథనాలు వచ్చాయి. ఫస్ట్ వాటిని చూసి నేను షాకయ్యా. చాలా కోపం వచ్చింది. ఆ తర్వాత ఆయా ఖాతాల్లో ఉన్న పాత వీడియోలు చూసి ఇలాంటివి పట్టించుకోకుండా ఉండడమే మంచిది అనిపించింది. ఇలాంటి వాళ్లు క్లిక్స్ కోసం ఎంతకైనా తెగిస్తారు అనిపించింది.' అని ఆది పేర్కొన్నారు.

ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ ఇద్దరూ కలిసి 'యాగవరైనమ్ నా కక్కా' సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాలో 2015లో మలుపు పేరుతో తెలుగులోనూ వచ్చింది. ఈ సినిమా టైంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అనంతరం మరకతమణి మూవీలోని కలిసి నటించారు. దాదాపు రెండేళ్లు తమ ప్రేమ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచారు. అనంతరం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇటీవల విడాకుల రూమర్స్ రాగా దానిపై ఆది పినిశెట్టి క్లారిటీ ఇచ్చారు.

Also Read: 'హిట్ 3'లో నానితో పాటు అడివి శేష్... కృష్ణ దేవ్‌తో అర్జున్ సర్కార్ సందడి - ట్విస్ట్‌ చూశారా?

డిఫరెంట్ కథలతో..

ఆది పినిశెట్టి అటు తమిళం ఇటు తెలుగులోనూ డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుని ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. హీరోగానే కాకుండా నెగిటివ్ రోల్‌లోనూ నటించి మెప్పించారు. తేజ దర్శకత్వం వహించిన 'ఒక V చిత్రం' మూవీతో తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం చాలా గ్యాప్ తర్వాత 2009లో 'వైశాలి'తో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఏకవీర, గుండెల్లో గోదారి, మలుపు, మరకతమణి సినిమాలు ఆకట్టుకున్నాయి. నెగిటివ్ రోల్‌లో అల్లు అర్జున్ 'సరైనోడు'లో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత సుకుమార్ 'రంగస్థలం'లో రామ్ చరణ్ అన్నగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. నీవెవరో, అజ్ఞాతవాసి, యూటర్న్, దివారియర్ సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

తాజాగా.. ఆయన లీడ్ రోల్‌లో నటించిన చిత్రం 'శబ్ధం'. అరివళగన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. వైశాలి విజయం తర్వాత వీరి కాంబోలో వస్తోన్న రెండో సినిమా ఇది. ఈ నెల 28న విడుదల కానుంది. 7జి ఫిల్మ్స్ శివ నిర్మించగా.. సిమ్రాన్, లైలా, లక్ష్మీమేనన్ కీలక పాత్రలు పోషించారు.

Also Read: సరదాగా ఓసారి గడిచిన కాలానికి వెళ్లొద్దామా! - మరోసారి థియేటర్లలోకి బాలయ్య 'ఆదిత్య 369', ఎప్పుడంటే?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget