Stocks to watch 03 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - SBI, ITC మీద ఓ కన్నేయండి
మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
Stocks to watch today, 03 February 2023: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 71 పాయింట్లు లేదా 0.40 శాతం గ్రీన్ కలర్‌లో 17,710 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
అదానీ స్టాక్స్: అదానీ స్టాక్స్‌లో గురువారం వరకు జోరుగా అమ్మకాలు కొనసాగింది. ఇవాళ కూడా ఈ గ్రూప్ స్టాక్స్ మరోసారి మార్కెట్ యాక్షన్‌ను నిర్ణయించనున్నాయి. పతనం ఆగిపోయే వరకు ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండడం అవసరం.
SBI: ప్రభుత్వ రంగ రుణదాత SBI, మూడో త్రైమాసికం ఫలితాలను ప్రకటించడానికి సిద్ధంగా ఉంది. బ్యాంక్ నికర లాభం గత సంవత్సరంతో పోలిస్తే 60- 70% భారీ వృద్ధితో ఘనమైన సంఖ్యలను నివేదించనత్తని అంచనా. నికర వడ్డీ ఆదాయం (NII) కూడా ఆరోగ్యకరంగా రెండంకెల్లో పెరుగుతుందని అంచనా.
ITC: డిసెంబర్ త్రైమాసికంలో సిగరెట్ & FMCG వ్యాపారాల్లో రెండంకెల వృద్ధిని ఐటీసీ నివేదించవచ్చని మార్కెట్ భావిస్తోంది. ఆక్యుపెన్సీ స్థాయుల్లో బలమైన మెరుగుదల నేపథ్యంలో హోటల్స్ వ్యాపారం కూడా మంచి ప్రదర్శన కనబరుస్తుందని లెక్క కట్టారు.
టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్: డిసెంబర్ 2022తో ముగిసిన త్రైమాసికంలో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఏకీకృత నికర లాభం రూ. 351 కోట్లకు చేరింది, 32% వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ. 265 కోట్లుగా ఉంది. విశ్లేషకుల సగటు అంచనా అయిన రూ. 270 కోట్ల కంటే లాభం చాలా ఎక్కువగా వచ్చింది.
డాబర్ ఇండియా: డిసెంబర్ త్రైమాసికంలో ఈ కంపెనీ ఏకీకృత నికర లాభం గత సంవత్సరం (YoY) కంటే 5% పడిపోయి రూ. 476 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ఆదాయం ఓ మాదిరిగా 3.4% పెరిగి రూ. 3,043 కోట్లకు చేరుకుంది.
బెర్జర్ పెయింట్స్: డిసెంబర్ త్రైమాసికంలో బెర్గర్ పెయింట్స్ ఏకీకృత నికర లాభం సంవత్సరానికి 20% క్షీణించి, రూ. 201 కోట్లుగా తేలింది. ఆదాయం మాత్రం 5.6% పెరిగి రూ. 2,693.59 కోట్లకు చేరుకుంది.
వైభవ్ గ్లోబల్: గత ఐదేళ్లలో ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించిన వైభవ్ గ్లోబల్ షేర్లకు ఇవాళ (శుక్రవారం, 03 ఫిబ్రవరి 2023) ఎక్స్ డివిడెండ్ డేట్. కంపెనీ ప్రకటించిన డివిడెండ్ మొత్తం మేరకు ఆటోమేటిక్‌గా షేర్ ప్రైస్ తగ్గిపోతుంది.
APL అపోలో ట్యూబ్స్: డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో వచ్చిన లాభం రూ. 54 కోట్లుగా APL అపోలో ట్యూబ్స్ నివేదించింది. అదే సమయంలో ఆదాయం స్వల్పంగా తగ్గి రూ. 489 కోట్లకు చేరుకుంది.
GMM ఫ్రాడ్లర్: డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల్లో GMM Pfaudler ఆదాయ వృద్ధి 23% & ఎబిటా వృద్ధి 44% గా నమోదైంది. ఈ త్రైమాసికంలో కంపెనీ లాభం రూ. 40 కోట్లకు చేరింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.