Guntakal Railway Track Incident | రైల్వే ట్రాక్ చిక్కుపడిపోయిన ఆర్టీసీ బస్సు | ABP Desam
గుంతకల్లు హనుమాన్ సర్కిల్ వద్ద తృటిలో భారీ ప్రమాదం తప్పింది. రైల్వై లెవల్ క్రాస్ పై ఓ లారీ సడెన్ గా రిపేర్ వచ్చి ఆగిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. లారీ వెనుకే ఓ ఆర్టీసీ బస్సు ఉండగా...దాన్ని వెనక్కి తీసే గ్యాప్ లేకుండా పోయింది. ఈ లోగా ఆ రైలు మార్గంలో వందే భారత్ రైలు వేగంగా రావటంతో ప్రయాణికులంతా వణికిపోయారు. రైలు హారన్ విన్న ప్రయాణికులు బస్సు దిగేసి ట్రాక్ దాటేందుకు పరుగులు పెట్టారు. ఈలోగా రైల్వే సిబ్బంది వందేభారత్ లోకో పైలెట్ కు సమాచారాన్ని చేరవేయటంతో ఆ రైలును వెంటనే నిలిపివేశారు. తృటిలో లోకో పైలెట్ కు సమాచారం అందింది గానీ లేదంటే పెను ప్రమాదమే జరిగి ఉండేది. తృటిలో ఘోర ప్రమాదం తప్పిన ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు గుంతకల్లు వాసులు. ఘటనకు కారణమైన లారీను చాలా సేపు ప్రయత్నించి ట్రాక్ పై నుంచి తప్పించారు.





















