అన్వేషించండి

Rythu Bharosa: అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి

Telangana News: ఆదివారం అర్ధరాత్రి దాటాక రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 4 కొత్త పథకాలను ప్రారంభించారు.

Telangana CM Revanth Reddy Launched Four New Welfare Schemes: రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. నారాయణపూర్ జిల్లా (Narayanpur District) కోస్గి మండలం చంద్రవంచలో జరిగిన కార్యక్రమంలో కొత్త పథకాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ, ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ పథకాలను ప్రారంభిస్తూ.. లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. మొత్తం 734 మందికి రైతు భరోసా చెక్కులు, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రూ.11.80 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేశారు.

'అర్ధరాత్రి దాటాక డబ్బులు జమ'

సాగు ఖర్చులు పెరిగాయని.. రైతు భరోసా (Rythu Bharosa) నిధులు పెంచామని సీఎం రేవంత్ తెలిపారు. ఏడాదికి ఎకరాకు రూ.12 వేల చొప్పున ఇస్తున్నామని.. ఇవాళ ఆదివారం కాబట్టి, రైతు భరోసా డబ్బులు జమ కావని చెప్పారు. అర్ధరాత్రి 12 దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. 'అప్పట్లో ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక్క సంతకంతో దేశమంతా రుణమాఫీ చేశారు. ఇప్పుడు ఒకే విడతలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశాం. ఇలా రుణమాఫీ చేసిన రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. దాదాపు 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.21 వేల కోట్లు వేశాం. భూమి లేని వారిని కూడా ఆదుకోవాలని గతంలో కూలీలు అడిగారు. భూమి లేని వ్యవసాయ కూలీలను ఆదుకునేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తీసుకువచ్చాం. ఈ పథకం కింద రూ.12 వేలు ఇస్తున్నాం.' అని వివరించారు.

'ప్రజల వద్దకు ప్రభుత్వం'

గతంలో ఏదైనా కావాలంటే, ఎవరైనా ఫామ్‌హౌస్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని.. ఇప్పుడు ప్రజల దగ్గరకే ఎమ్మెల్యేలు, అధికారులు వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 'గ్రామాల్లో ప్రజల సమక్షంలో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం. ప్రభుత్వమే ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తులు తీసుకుంటోంది. గడిచిన పదేళ్లలో పేదలకు ప్రభుత్వం ఇళ్లు రాలేదు. గత ప్రభుత్వం పదేళ్ల పాటు రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాం. పేదలు ఇల్లు నిర్మించుకుంటే రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నాం. రేషన్ కార్డు ఉన్న పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తాం. గ్రామసభల ద్వారా రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాం. అధికారులను గ్రామాలకు పంపిస్తున్నాం. ప్రజా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది.' అని రేవంత్ పేర్కొన్నారు.

'మాటిస్తే వెనక్కి తగ్గం'

కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే.. ఎప్పటికీ వెనక్కి తగ్గదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. 'పదేళ్లు అధికారంలో ఉండి పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. రూ.లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కూలింది. ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేస్తే.. ప్రజలను రెచ్చగొడుతున్నారు. మన ప్రజలకు ఉపాధి కోసం పరిశ్రమలు తేవాలని భావించాను. మాయమాటలు చెప్పి ప్రజలను రెచ్చగొట్టి పరిశ్రమలు అడ్డుకుంటున్నారు.' అని రేవంత్ పేర్కొన్నారు.

Also Read: Viral News: మహిళ ఇంటి ముందు బ్యాంక్ అధికారుల వినూత్న నిరసన, వంటావార్పుతో అంతా షాక్

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Republic Day In Andhra Pradesh: తొలిసారి అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకలు.. వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల అలర్ట్
తొలిసారి అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకలు.. వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల అలర్ట్
IND vs NZ 3rd T20I: అభిషేక్ శర్మ, సూర్య కుమార్ హాఫ్ సెంచరీలు.. 10 ఓవర్లకే టార్గెట్ ఉఫ్.. 3-0తో సిరీస్ కైవసం
అభిషేక్ శర్మ, సూర్య కుమార్ హాఫ్ సెంచరీలు.. 10 ఓవర్లకే టార్గెట్ ఉఫ్.. 3-0తో సిరీస్ కైవసం
Padma Awards 2026: పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు ప్రముఖులు వీరే.. వారి టాలెంట్ ఏంటి
పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు ప్రముఖులు వీరే.. వారి టాలెంట్ ఏంటి
Rohit Sharma Padma Shri Award: రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్‌లను వరించిన పద్మశ్రీ పురస్కారం
రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్‌లను వరించిన పద్మశ్రీ పురస్కారం

వీడియోలు

Rohit Sharma Harman Preet Kaur Padma Shri | రోహిత్, హర్మన్ లను వరించిన పద్మశ్రీ | ABP Desam
Rajendra prasad Murali Mohan Padma Shri | నటకిరీటి, సహజ నటుడికి పద్మశ్రీలు | ABP Desam
Bangladesh Cricket Huge Loss | టీ20 వరల్డ్ కప్ ఆడనన్నుందుకు BCB కి భారీ నష్టం | ABP Desam
Ashwin Fire on Gambhir Decisions | డ్రెస్సింగ్ రూమ్ లో రన్నింగ్ రేస్ పెట్టడం కరెక్ట్ కాదు | ABP Desam
Ind vs Nz 3rd T20I Preview | న్యూజిలాండ్ తో నేడు మూడో టీ20 మ్యాచ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Republic Day In Andhra Pradesh: తొలిసారి అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకలు.. వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల అలర్ట్
తొలిసారి అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకలు.. వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల అలర్ట్
IND vs NZ 3rd T20I: అభిషేక్ శర్మ, సూర్య కుమార్ హాఫ్ సెంచరీలు.. 10 ఓవర్లకే టార్గెట్ ఉఫ్.. 3-0తో సిరీస్ కైవసం
అభిషేక్ శర్మ, సూర్య కుమార్ హాఫ్ సెంచరీలు.. 10 ఓవర్లకే టార్గెట్ ఉఫ్.. 3-0తో సిరీస్ కైవసం
Padma Awards 2026: పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు ప్రముఖులు వీరే.. వారి టాలెంట్ ఏంటి
పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు ప్రముఖులు వీరే.. వారి టాలెంట్ ఏంటి
Rohit Sharma Padma Shri Award: రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్‌లను వరించిన పద్మశ్రీ పురస్కారం
రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్‌లను వరించిన పద్మశ్రీ పురస్కారం
GITAM Lands: విశాఖ భూములను క్రమబద్ధీకరించుకునేందుకు గీతం ప్రయత్నం - దోపిడీ అంటున్న విపక్షాలు - అసలు కథ ఇదీ!
విశాఖ భూములను క్రమబద్ధీకరించుకునేందుకు గీతం ప్రయత్నం - దోపిడీ అంటున్న విపక్షాలు - అసలు కథ ఇదీ!
Padma Awards 2026: సౌత్‌ సినిమాలో విరిసిన పద్మాలు... తెలుగు హీరోలు ఇద్దరికి పద్మశ్రీ, దివంగత ధరేంద్రకు పద్మ విభూషణ్
సౌత్‌ సినిమాలో విరిసిన పద్మాలు... తెలుగు హీరోలు ఇద్దరికి పద్మశ్రీ, దివంగత ధరేంద్రకు పద్మ విభూషణ్
PM Modi Mann Ki Baat: మన్‌కీ బాత్‌లో అనంతపురం ప్రజలను ప్రశంసించిన ప్రధాని మోదీ.. రీజన్ ఏంటంటే..
మన్‌కీ బాత్‌లో అనంతపురం ప్రజలను ప్రశంసించిన ప్రధాని మోదీ.. రీజన్ ఏంటంటే..
Nayanthara : 'మన శంకర వరప్రసాద్ గారు' కోసం నయనతార! - ఫస్ట్ స్పీచ్ కోసం వెయిటింగ్
'మన శంకర వరప్రసాద్ గారు' కోసం నయనతార! - ఫస్ట్ స్పీచ్ కోసం వెయిటింగ్
Embed widget