Jr NTR Kalyan Ram Tweet NBK Padma Bhushan | బాలకృష్ణకు పద్మభూషణ్ రావటంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సంతోషం | ABP Desam
నందమూరి బాలకృష్ణకు, జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య గ్యాప్ పెరిగిపోయిందని ఇన్నాళ్లూ తారక్ ఫ్యాన్స్ తెగ ఇబ్బంది పడిపోయారు. హరికృష్ణ పిల్లలు ఇద్దరూ బాలయ్య బాబాయ్ కు దూరమయ్యారనే టాక్ వినపడింది చాలా చోట్ల. కానీ బాలయ్యకు నిన్న వరించిన పద్మభూషణ్ పురస్కార సందర్భం వాటిన్నంటినీ పటా పంచలు చేసింది. సినీరంగంలో యాబై ఏళ్లుగా బాలకృష్ణ అందిస్తున్న సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ ముందు రోజు బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. దేశంలోనే అత్యున్నత పౌరపురస్కారాల్లో మూడోది ఇది. ఈ సందర్భంగా బాలకృష్ణకు అభిమానులు, బంధువులు, స్నేహితుల నుంచి అభినందనల వెల్లువ ముంచెత్తగా..ఓ రెండు ట్వీట్లు మాత్రం చాలా స్పెషల్. అవే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వేసిన స్పెషల్ ట్వీట్లు. బాలా బాబాయ్ కు పద్మభూషణ్ గౌరవం దక్కటం చాలా సంతోషంగా ఉంది. బాబాయ్ సినిమాల్లో చేసిన తిరుగులేని సేవలకు, ప్రజాజీవితంలో ప్రజలకు అందిస్తున్న సర్వీస్ కి ఈ గౌరవం ఓ గుర్తింపు అన్నారు జూనియర్ ఎన్టీఆర్. ఆయన అన్నయ్య కళ్యాణ్ రామ్ దాదాపుగా ఇదే ట్వీట్ పెట్టాడు. సో అన్నదమ్ములు ఇద్దరూ బాబాయ్ మీద గౌరవం చూపించటం వెంటనే విష్ చేయటం పైగా బాలా బాబాయ్ సంబోధించటం చూస్తుంటే...ఫ్యాన్స్ అనేసుకున్నంత గ్యాప్ అయితే వాళ్ల మధ్యనే లేదనేది స్పష్టమవుతోంది.





















