అన్వేషించండి

Dharmavaram: ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం

Andhra News: సత్యసాయి జిల్లా ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ నుంచి ఓ నేత బీజేపీలోకి చేరడంపై వివాదం రేగగా.. టీడీపీ, వైసీపీ నేతలు రాళ్లు రువ్వుకున్నారు.

Tension Situation In Dharmavaram: సత్యసాయి జిల్లా ధర్మవరం (Dharmavaram) పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం చెలరేగగా.. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ క్రమంలో 7 వాహనాలు ధ్వంసమయ్యాయి. కృష్ణాపురం జమీర్ అనే వ్యక్తి వైసీపీ నుంచి బీజేపీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు అతన్ని బీజేపీలోకి ఎలా చేర్చుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మంత్రి సత్యకుమార్ సమక్షంలో బీజేపీలోకి జమీర్ చేరుతున్న నేపథ్యంలో ధర్మవరం పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిని గమనించిన టీడీపీ నేతలు వారిని అడ్డుకున్నారు. 

దీంతో వివాదం చెలరేగి ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పెద్దఎత్తున రాళ్లు రువ్వుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. వివాదంలో ఇరు పార్టీల నేతలకు గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. మరోవైపు, ధర్మవరం పట్టణాన్ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ షాపులు మూయించారు. ఏ క్షణాన్నైనా మళ్లీ ఉద్రిక్తతలు జరిగే అవకాశం ఉండడంతో అప్రమత్తమయ్యారు. డీఎస్పీ బి.హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో అదనపు బలగాలు మోహరించారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని.. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్థానిక ప్రజలందరికీ భద్రత కల్పించడంతో పాటు శాంతి భద్రతలను పునరుద్ధరించినట్లు చెప్పారు.

Also Read: Raghurama Custodial Torture case: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం, నిందితుల్ని గుర్తించానని వెల్లడి

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Tank Bund Accident: ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
Hyderabad Viral Video: ఫుడ్ ఆలస్యమైందని Zomato డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వీడియో వైరల్
ఫుడ్ ఆలస్యమైందని Zomato డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వీడియో వైరల్
Telangana Woman Dies: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ మహిళ మృతి, మరొకరికి గాయాలు
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ మహిళ మృతి, మరొకరికి గాయాలు
RTC Driver, Conductor Attacked: అడిగిన చోట బస్సు ఆపనందుకు గురజాలలో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి
అడిగిన చోట బస్సు ఆపనందుకు గురజాలలో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Hyderabad Tank Bund Accident: ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Embed widget