అన్వేషించండి

Raghurama Custodial Torture case: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం, నిందితుల్ని గుర్తించానని వెల్లడి

Raghurama krishna Raju | ఎంపీగా ఉన్న సమయంలో వైసీపీ హయాంలో రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ ఎదుర్కొన్నారు. ఆయనపై దాడి చేసిన నిందితుల్ని రఘురామ తాజాగా గుర్తించారు.

Raghurama Custodial Torture | ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనకు సంబంధించిన కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితులను  రాఘురామ కృష్ణరాజు గుర్తించారు.  గుంటూరు జిల్లా న్యాయమూర్తి సమక్షంలో పరేడ్ నిర్వహించారు. ఎంపీగా ఉన్న సమయంలో రఘురామపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న తులసిబాబు, మరో వ్యక్తిని జడ్డిముందు ప్రవేశపెట్టి పరేడ్ నిర్వహించారు పోలీసులు. కస్టడీలో తనపై దాడి కేసులో నిందితులను గుర్తించానని రఘురామ కృష్ణరాజు స్పష్టం చేశారు. తాను ముఖానికి కర్చీఫ్ కట్టుకుని దాడి చేసిన వ్యక్తిని గుర్తించానని రఘురామ తెలిపారు.

నా గుండె మీద కూర్చుని కొట్టిన వ్యక్తిని గుర్తించా..

పరేడ్‌ అనంతరం డిప్యూటీ స్పీకర్ రఘురామ మీడియాతో మాట్లాడారు. కోర్టు సమన్లు జారీ చేయడంతో వచ్చాను. ఎంపీగా ఉన్న సమయంలో నాపై పోలీస్ కస్టడీలో దాడి చేసింది. నా మీద కూర్చొని దాడి చేసిన వ్యక్తిని స్పష్టంగా గుర్తించాను. తులసిబాబుకు ఎక్కడి నుంచి మద్దతు లభించిందో అందరికీ తెలుసు. అతడికి టీడీపీతో ఎలాంటి లింకులు లేవని గతంలోనే బహిర్గతమైంది. ఎస్పీ వద్దకు సైతం నేరుగా వెళ్లగల మనిషి తులసి బాబు. జడ్జి ఎదుట హాజరై పోలీస్ పరేడ్ లో నిందితులను చూసి గుర్తుపట్టాను. పోలీసులకు వివరాలు తెలిపాను’ అని రఘురామ చెప్పారు.

వారిని కూడా విచారించాలి..

నా కస్టోడియల్ టార్చర్ కేసులో ఏ1, ఏ2ను విచారణకు పిలవకపోవడంపై ఆశ్చర్యమేస్తోంది. ఈ కేసులో అప్పటి జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, తో పాటు జీజీహెచ్‌ పూర్వ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతి, అప్పటి ఏఎస్పీ విజయ్‌పాల్‌ లను పూర్తి స్థాయిలో విచారించాలన్నారు. కానీ డాక్టర్ ప్రభావతి ఆచూకీ కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. వారు ఎంత పెద్ద లాయర్లను పెట్టుకున్నా న్యాయం తనపైపే ఉందన్నారు రఘురామ. 

సుప్రీంకోర్టులో రఘురామ కేసు..

రఘురామ పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇటీవల కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ మాజీ సీఎం వైఎస్​ జగన్‌ మోహన్​ రెడ్డి బెయిల్‌ రద్దు, కేసుల ట్రయల్‌ విచారణ ధర్మాసనం మార్పు చేయాలని కోరుతూ రఘురామ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు రిజిస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ ధర్మాసనం నుంచి ఆ కేసును బదిలీ చేసింది. జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ, జస్టిస్‌ బీవీ నాగరత్న ధర్మాసనానికి కేసు విచారణ మార్చింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
Embed widget