Nandamuri Balakrishna on Padmabhushan | పద్మభూషణ్ పురస్కారంపై నందమూరి బాలకృష్ణ ఇంటర్వ్యూ | ABP Desam
ఇది నా కిరీటంలో ఓ కలికితురాయి. నేనెప్పుడూ ఏదీ ఆశించలేదు. కానీ నా యాభై ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం అందించిన ఈ గౌరవానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. 108 సినిమాలు పూర్తి చేశాను. మూడోసారి ఎమ్మెల్యేగా సేవలు అందిస్తున్నాను. 15ఏళ్లుగా బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ ఛైర్మన్ గా పనిచేస్తున్నాను. అక్కడ పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. నేనేం చేస్తున్నానో గుర్తించినందుకు...నన్ను అభిమానించేవారికి..నన్ను వెనకుండి నడిపిస్తున్న వారికి.. కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నాను. ఈ ప్రయాణం ఇంకా అయిపోలేదు. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. ఆంధ్ర, తెలంగాణ తో పాటు దేశవిదేశాల్లో ఉంటున్న తెలుగు వారందరికీ నా నమస్కారం. ప్రత్యేకించి నా అభిమానులకు కృతజ్ఞుడిని. నా కష్ట సమయంలోనూ వాళ్లే నాతో ఉన్నారు. నా తల్లితండ్రుల ఆశీస్సులు నాకు పుష్కలంగా ఉన్నాయి. నా నటన, నా సేవా ప్రస్థానం, నా రాజకీయ జీవితం ఇకపైనా కొనసాగుతుంది.
రిపోర్టర్ :
నాన్న గారికి భారత రత్న రావాలని భావిస్తున్నారా..?
మా నాన్న గారికి భారత రత్న రావాల్సి ఉంది. వస్తుందని ఆశిస్తున్నాను. పేదలను ప్రగతివైపు నడిపించిన మహానుభావుడు ఆయన. సంక్షేమపథకాలకు పితామహుడు ఆయనే. రెండు రూపాయలకే కిలో బియ్యం, వృద్ధులకు పింఛన్లు, పేదలకు ఇళ్లు లాంటివి మొదలుపెట్టింది ఆయనే. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఆయన తీసుకువచ్చిన సంక్షేమ పథకాలనే అమలు చేస్తున్నాయి. కనుక అంతటి మనిషికి తప్పక భారతరత్న వరిస్తుందని ఆశిస్తున్నాను.





















