అన్వేషించండి

Stock Market: 500 పైగా షేర్లలో సర్క్యూట్‌ లిమిట్‌ మార్పు, మీ దగ్గర ఈ స్టాక్స్‌ ఉన్నాయా?

10 శాతం సర్క్యూట్‌ పరిమితి ఉన్న స్టాక్‌ ఒక రోజులో 10 శాతానికి మించి పతనం కాదు, అదే విధంగా 10 శాతానికి మించి పెరగదు.

BSE Changes In Stock Circuit Limits: బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ BSE, తన దగ్గర లిస్ట్‌ అయిన దాదాపు 500 పైగా షేర్లలో సర్క్యూట్ (అప్పర్‌ సర్క్యూట్‌ / లోయర్‌ సర్క్యూట్‌) పరిమితులను మార్చింది. మొత్తం 331 స్టాక్స్‌కు సర్క్యూట్ పరిమితిని 5 శాతం నుంచి 10 శాతానికి పెంచింది. మరో 14 స్టాక్స్‌లో ఈ పరిమితిని 5 శాతం నుంచి 20 శాతానికి సవరించింది. ఇంకా, 168 షేర్లలో లిమిట్‌ను 10 శాతం నుంచి 20 శాతానికి తీసుకెళ్లింది. ఇలా, మొత్తం 513 షేర్లకు సర్క్యూట్ పరిమితి BSE మార్చింది.

సర్క్యూట్‌ లిమిట్‌ అంటే ఏంటి?
ఒక స్టాక్‌ ధర, ఒక ట్రేడింగ్‌ రోజులో, నిరిష్ట పరిమాణానికి మించి పెరగకుండా లేదా తగ్గకుండా స్టాక్‌ మార్కెట్లు విధించే పరిమితిని సర్క్యూట్‌ లిమిట్‌ అంటారు. చిన్న పెట్టుబడిదార్లు నష్టపోకుండా స్టాక్‌ ఎక్సేంజీలు ఈ నిర్ణయం తీసుకుంటాయి. ఉదాహరణకు.. ఒక కంపెనీ మీద ఏదైనా ప్రతికూల వార్త వచ్చినప్పుడు ఆ కంపెనీ షేర్లు పతనమవుతాయి. ఇలాంటి కేస్‌లో లోయర్‌ సర్క్యూట్‌ లేకపోతే ఆ షేర్ల విలువ ఒక్క రోజులో సున్నా అవుతుంది, రిటైల్‌ ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోతారు. లోయర్‌ సర్క్యూట్‌ ఉంటే... అమ్మకాల వల్ల ఒక షేర్‌ ధర నిర్దిష్ట శాతం (5 శాతం లేదా 10 శాతం లేదా 20 శాతం) పతనం కాగానే, ఆ రోజుకు ఆ స్టాక్‌ లోయర్‌ సర్క్యూట్‌లో లాక్‌ అవుతుంది. ఇక ఆ స్టాక్‌లో ఆ రోజు అమ్మకాలు చేయడానికి వీలుండదు. తర్వాతి ట్రేడింగ్‌ రోజులో ఆ స్టాక్‌లో లావాదేవీలు మళ్లీ ఫ్రెష్‌గా మొదలవుతాయి. ఒక రోజు తర్వాత లేదా కొన్ని రోజుల తర్వాత అదే కంపెనీకి సంబంధించి మంచి వార్త రాగానే తిరిగి ఆ షేర్లు పుంజుకుంటాయి, రిటైల్‌ ఇన్వెస్టర్లు కాస్త ఊపిరి పీల్చుకుంటారు.

అప్పర్‌ సర్క్యూట్‌ కేస్‌ కూడా ఇలానే ఉంటుంది. ఒక కంపెనీకి సంబంధించి ఏదైనా మంచి వార్త తెలిస్తే, ఆ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తుతాయి. ఆ షేర్లను దక్కించుకోవడానికి బిగ్‌ బాయ్స్‌ పోటీ పడతారు. ఫలితంగా షేర్‌ ధరలకు రెక్కలు వచ్చి చిన్న ఇన్వెస్టర్లకు అందవు, ఆ ప్రయోజనం దక్కదు. ఇలాంటి అసమతౌల్యాన్ని అప్పర్‌ సర్క్యూట్‌ నివారిస్తుంది. ఆ స్టాక్‌లో కొనుగోళ్లు నిర్దిష్ట శాతానికి  (5 శాతం లేదా 10 శాతం లేదా 20 శాతం) చేరుకోగానే ఆ రోజుకు ఆ స్టాక్‌ అప్పర్‌ సర్క్యూట్‌లో ఆగిపోతుంది. ఇక ఆ స్టాక్‌లో ఆ రోజు కొనుగోళ్లు చేయడానికి వీలుండదు. తర్వాతి ట్రేడింగ్‌ రోజులో ఆ షేర్లు కొనడానికి రిటైల్‌ ఇన్వెస్టర్లకు అవకాశం దక్కతుంది.

ఏ స్టాక్‌కైనా లోయర్‌ సర్క్యూట్‌ పరిమితి, అప్పర్‌ సర్క్యూట్‌ పరిమితి ఒకే స్థాయిలో ఉంటుంది. ఉదాహరణకు.. 10 శాతం సర్క్యూట్‌ పరిమితి ఉన్న స్టాక్‌ ఒక రోజులో 10 శాతానికి మించి పతనం కాదు, అదే విధంగా 10 శాతానికి మించి పెరగదు. 

సర్క్యూట్‌ పరిమితి పెంచడం వల్ల ఆయా స్టాక్స్‌లో లావాదేవీలు, లిక్విడిటీ మరింత పెరుగుతాయి. దీనివల్ల రిటైల్‌ ఇన్వెస్టర్లకు ప్రయోజనం ఉంటుంది.

1) సర్క్యూట్ పరిమితి 5 శాతం నుంచి 10 శాతానికి పెరిగిన 331 షేర్లు

IFCI, మహానగర్ టెలిఫోన్ నిగమ్, కేసోరామ్ ఇండస్ట్రీస్, MMTC, సంఘీ ఇండస్ట్రీస్, శ్రీరామ్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ, ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్, జైప్రకాష్ అసోసియేట్స్, బర్న్‌పూర్ సిమెంట్, NBCC (ఇండియా), ఐనాక్స్ విండ్, స్టెర్లింగ్ అండ్‌ విల్సన్ రెన్యూవబుల్ ఎనర్జీ, ఇండియాబుల్స్ ఎంటర్‌ప్రైజెస్, BEML ల్యాండ్ అసెట్స్, ప్లాజా వైర్స్‌, గిన్ని ఫిలమెంట్స్.

2) సర్క్యూట్ పరిమితి 5 శాతం నుంచి 20 శాతానికి పెరిగిన 14 స్టాక్స్‌

షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, పారామౌంట్ కమ్యూనికేషన్స్, న్యూక్లియస్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్స్, ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్, DB రియాల్టీ, ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్, EMS, ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ, సాక్‌సాఫ్ట్.

3) సర్క్యూట్ పరిమితి 10 శాతం నుంచి 20 శాతానికి పెరిగిన 168 స్క్రిప్స్‌

ఫోర్స్ మోటార్స్, మంగళూరు రిఫైనరీ మరియు పెట్రోకెమికల్స్, లైకా ల్యాబ్స్, శక్తి షుగర్స్, వక్రాంగీ, ఫోర్టిస్ మలార్ హాస్పిటల్స్, జెనోటెక్ లేబొరేటరీస్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, UCO బ్యాంక్, IIFL ఫైనాన్స్, IRB ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్లు, జూపిటర్ వ్యాగన్లు, పంజాబ్ & సింధ్ బ్యాంక్, హౌసింగ్ & అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఖాదిమ్ ఇండియా, రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, డేటా ప్యాటర్న్స్ (ఇండియా), షెల్టర్ ఫార్మా.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: గవర్నర్ శక్తికాంత దాస్ ప్రసంగంలోని 10 కీలక విషయాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget