అన్వేషించండి

RBI MPC Meet: గవర్నర్ శక్తికాంత దాస్ ప్రసంగంలోని 10 కీలక విషయాలు

రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద, బ్యాంక్ రేటు కూడా 6.75 శాతం వద్ద స్థిరంగా ఉంచారు. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ 5:1 మెజారిటీతో పాలసీ రేట్లపై నిర్ణయం తీసుకుంది.

RBI MPC Meet April 2024 Key Points: కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25లో జరిగిన మొదటి ద్రవ్య విధాన కమిటీ (Monetary Policy Committee) సమావేశం ఫలితాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రోజు (05 ఏప్రిల్‌ 2024) ప్రకటించింది. ఈ ఎంపీసీ సమావేశం ఏప్రిల్ 03 బుధవారం నాడు ప్రారంభమైంది, ఈ రోజు ఉదయం వరకు 3 రోజుల పాటు కొనసాగింది. ద్వైమాసిక (2 నెలలకు ఒకసారి) ద్రవ్య పరపతి విధాన సమీక్షలో, రెపో రేటులో (Repo Rate) ఆర్‌బీఐ ఎంపీసీ ఎలాంటి మార్పులు చేయలేదు. అందుకే రెపో రేటును గతంలో లాగే 6.50 శాతం వద్దే కొనసాగించామని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das) తెలిపారు. 

రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద, బ్యాంక్ రేటు కూడా 6.75 శాతం వద్ద స్థిరంగా ఉంచారు. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ 5:1 మెజారిటీతో పాలసీ రేట్లపై నిర్ణయం తీసుకుంది.

ఆర్‌బీఐ గవర్నర్ ప్రసంగంలోని 10 కీలక విషయాలు ‍‌(10 key points from RBI Governor's speech):

1. భారతదేశ విదేశీ మారక నిల్వలు ‍‌(Foreign exchange reserves) రికార్డు స్థాయిలో 645.6 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి, 29 మార్చి 2024న ఈ రికార్డ్‌ సాధ్యమైంది. కొంతకాలం క్రితం, మన దేశంలోని విదేశీ మారక ద్రవ్య నిల్వల గురించి ఆందోళనలు ఉన్నాయి. అయితే ఆర్‌బీఐ ఈ సమస్యపై నిశితంగా దృష్టి పెట్టి పరిష్కరించింది. కేంద్ర బ్యాంక్‌పై ఉన్న విశ్వాసాన్ని కొనసాగించింది.

2. ప్రధాన ద్రవ్యోల్బణం (Core Inflation) రేటులో తగ్గుతోంది. కానీ, RBI లక్ష్యమైన 4 శాతం కంటే ఎక్కువగా ఉంది. దీనిని నియంత్రిత లక్ష్యానికి తీసుకురావడం మా ప్రాధాన్యతల్లో ఒకటి.

3. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాల దృష్ట్యా, CPI ఇన్‌ఫ్లేషన్‌ను (వినియోగదారు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం) నిర్దేశించిన పరిధిలోకి తీసుకురావడం అవసరం.

4. కీలక ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడానికి, అవసరమైన చర్యలు తీసుకోవడానికి RBI సిద్ధంగా ఉంది. ఆర్‌బీఐ లక్ష్యమైన 4 శాతానికి ద్రవ్యోల్బణాన్ని తీసుకురావడంలో MPC నిబద్ధతగా పని చేస్తుంది.

5. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు ‍‌(Geo-political tensions), సముద్ర వాణిజ్య మార్గాల్లో అడ్డంకుల కారణంగా ప్రపంచ స్థాయిలో ఆందోళన ఉంది.

6. ఆర్థిక వ్యవస్థలో ఉదారవాద వైఖరిని ఉపసంహరించుకోవాలన్న నిర్ణయానికి RBI MPC కట్టుబడి ఉంది. 

7. 2024-25 ఆర్థిక సంవత్సరంలోని 1, 3, 4 త్రైమాసికాల్లో ఆర్థిక వృద్ధి రేటు (GDP Growth Rate‌) 7 శాతం లేదా అంతకంటే ఎక్కువగా నమోదయ్యేలా లక్ష్యం నిర్దేశించారు. రెండో త్రైమాసికానికి మాత్రమే 6.9 శాతం లక్ష్యంగా పెట్టుకున్నారు.

8. భారత ఆర్థిక వ్యవస్థలోని బలానికి అనుగుణంగా భారతీయ రూపాయి (Indian Rupee) స్థిరంగా ఉంది, పటిష్టమైన పునాదిపై ఉన్నట్లు కనిపిస్తోంది.

9. దేశంలో ప్రభుత్వ సెక్యూరిటీలు, ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడుల (Investments in government securities and government bonds) మొత్తం వేగంగా పెరుగుతోంది.

10. ఆహార ద్రవ్యోల్బణం (Food Inflation) రేటులో నిరంతర హెచ్చుతగ్గులు ఉన్నాయి. అయితే, 2025 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఇది RBI నిర్దేశించిన 4 శాతం లక్ష్యం లోపులోకి వచ్చి 3.8 శాతం వద్ద కొనసాగుతుందని అంచనా.

మరో ఆసక్తికర కథనం: మీ EMI ఇంకో రెండు నెలల వరకు తగ్గదు, రెపో రేట్‌ మీద మళ్లీ 'స్టేటస్‌ కో'

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget