Price Targets: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్ టార్గెట్ ధరల్లో కోత, బ్రోకరేజ్‌లను మెప్పించని మార్జిన్స్
నికర వడ్డీ మార్జిన్ 3.4 శాతానికి పరిమితమైంది, RoA తగ్గడం దీనికి కారణమైంది.
Stock Market News in Telugu: ప్రైవేట్ రంగ లెండర్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, 2023 సెప్టెంబర్ క్వార్టర్‌లో ప్రకటించిన ఫలితాలతో ప్రముఖ బ్రోకరేజ్ కంపెనీలు సంతృప్తి చెందలేదు. ఓవరాల్‌గా క్వార్టర్లీ రిజల్ట్స్ బాగానే ఉన్నా, నికర వడ్డీ మార్జిన్ (NIM) బలహీనంగా ఉండడం అసంతృప్తికి కారణమైంది.
2023 సెప్టెంబర్ క్వార్టర్‌లో, ప్రైవేట్ రంగ లెండర్ HDFC బ్యాంక్ రూ. 16,811 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. స్వతంత్ర ప్రాతిపదికన లాభం రూ. 15,976 కోట్లుగా లెక్క తేలింది. గత ఏడాది ఇదే సమయంలో, బ్యాంక్ ఏకీకృత నికర లాభం రూ.11,162 కోట్లుగా, స్వతంత్ర నికర లాభం రూ.10,606 కోట్లుగా ఉంది. స్వతంత్ర ఆదాయం రూ. 46,181 కోట్ల నుంచి రూ.78,406 కోట్లకు చేరింది.
Q2 FY24లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 6.7% గ్రోత్‌తో చెంది రూ.27,385 కోట్లకు చేరుకుంది. ఏడాది క్రితం ఇదే కాలంలో హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్ ఉమ్మడి వడ్డీ ఆదాయం రూ.21,021 కోట్లుగా ఉంది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 3.4 శాతానికి పరిమితమైంది, RoA తగ్గడం దీనికి కారణమైంది. ఈ ఏడాది జులై 1న, HDFC బ్యాంక్‌లోకి పేరెంట్ కంపెనీ HDFC విలీనమైంది. ఆ మెర్జర్ తర్వాత విలీన సంస్థకు ఇవే మొదటి ఆర్థిక ఫలితాలు.
HDFC బ్యాంక్ తన క్వార్టర్లీ రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత, చాలా మంది ఎనలిస్ట్‌లు ఈ స్టాక్ మీద ప్రైస్ టార్గెట్ తగ్గించారు. అందరు ఎనలిస్ట్‌ల సగటు టార్గెట్ ధర ₹1,954. మంగళవారం నాటి ముగింపు ₹1,542.50తో పోలిస్తే, మరో 27% ర్యాలీని ఇది సూచిస్తోంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్ వాల్యుయేషన్స్ చారిత్రక సగటులతో పోలిస్తే ఇప్పుడు చౌకగా ఉన్నాయని చెప్పిన మార్కెట్ ఎక్స్‌పర్ట్స్, లాభదాయకత & వృద్ధిపై ఆందోళనల వల్ల రీ-రేటింగ్‌కు కాస్త టైమ్ పడుతుందని చెప్పారు.
HDFC బ్యాంక్ కొత్త టార్గెట్ ప్రైస్‌లు:
ఇన్వెస్టిక్ ---- రికమెండేషన్: హోల్డ్ ---- కొత్త టార్గెట్ ప్రైస్: 1,620 ---- పాత టార్గెట్ ప్రైస్: 1,690
కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ ---- రికమెండేషన్: బయ్ ---- కొత్త టార్గెట్ ప్రైస్: 1,800 ---- పాత టార్గెట్ ప్రైస్: 1,850
BNP పారిబాస్ ---- రికమెండేషన్: బయ్ ---- కొత్త టార్గెట్ ప్రైస్: 2,210 ---- పాత టార్గెట్ ప్రైస్: 2,210
ICICI సెక్యూరిటీస్ ---- రికమెండేషన్: బయ్ ---- కొత్త టార్గెట్ ప్రైస్: 1,750 ---- పాత టార్గెట్ ప్రైస్: 2,000
నోమురా ---- రికమెండేషన్: న్యూట్రల్ ---- కొత్త టార్గెట్ ప్రైస్: 1,750 ---- పాత టార్గెట్ ప్రైస్: 1,800
CLSA ---- రికమెండేషన్: బయ్ ---- కొత్త టార్గెట్ ప్రైస్: 1,900 ---- పాత టార్గెట్ ప్రైస్: 2,025
మోర్గాన్ స్టాన్లీ ---- రికమెండేషన్: ఓవర్‌వెయిట్ ---- కొత్త టార్గెట్ ప్రైస్: 2,110 ---- పాత టార్గెట్ ప్రైస్: 2,110
JP మోర్గాన్ ---- రికమెండేషన్: ఓవర్‌వెయిట్ ---- కొత్త టార్గెట్ ప్రైస్: 1,900 ---- పాత టార్గెట్ ప్రైస్: 1,900
జెఫరీస్ ---- రికమెండేషన్: బయ్ ---- కొత్త టార్గెట్ ప్రైస్: 2,030 ---- పాత టార్గెట్ ప్రైస్: 2,030
సిటీ ---- రికమెండేషన్: బయ్ ---- కొత్త టార్గెట్ ప్రైస్: 2,110 ---- పాత టార్గెట్ ప్రైస్: 2,110
HSBC ---- రికమెండేషన్: బయ్ ---- కొత్త టార్గెట్ ప్రైస్: 1,850 ---- పాత టార్గెట్ ప్రైస్: 1,930
నువామా ---- రికమెండేషన్: బయ్ ---- కొత్త టార్గెట్ ప్రైస్: 1,770 ---- పాత టార్గెట్ ప్రైస్: 1,960
ఈ రోజు (బుధవారం, 18 అక్టోబర్ 2023) ఉదయం 11.30 గంటల సమాయానికి 1.22% నష్టంతో రూ.1,522.50 వద్ద హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు కదులుతున్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: భారీ షాక్ ఇచ్చిన గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial