News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Tirumala Updates : శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు దర్శనానికి వెళ్తున్నారా, ఈ సేవలు రద్దయ్యాయి తెలుసా !

Tirumala News: తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం ఘనంగా నిర్వహించనుంది టీటీడీ. దాంతో నేడు ఆలయంలో పలు సేవల్ని టీటీడీ రద్దు చేసింది.

FOLLOW US: 
Share:

TTD Alert :   శ్రీవారి భక్తులకు గమనిక. నేడు తిరుమలలో శ్రీవారి ఆలయంతో ఆర్జిత సేవల్ని రద్దు చేశారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీవారి  ఆలయంలో జూలై 17న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం ఘనంగా నిర్వహించనుంది టీటీడీ. శ్రీవారి ఆలయంలో ఆదివారం నాడు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. రోజున ఉదయం ఆర్జిత సేవలు ఉండవు. సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.   సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు వచ్చింది.

సంప్రదాయంగా ఆణివార ఆస్థానం 
పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినం నాటి నుండి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి - ఏప్రిల్‌ నెలలకు మార్చడం జరిగింది. అయినప్పటికీ సంప్రదాయంగా ఆణివార ఆస్థానాన్ని కొనసాగిస్తున్నారు. 

పుష్ప పల్లకీపై తిరుమల పురవీధుల గుండా శ్రీవారి ఊరేగింపు
నేటి ఉదయం బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామి వారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేస్తారు.  మరో పీఠంపై స్వామి వారి సర్వ సైన్యాధ్యక్షుడైన శ్రీవిష్వక్సేనులవారు దక్షిణాభి ముఖంగా వేంచేపు చేస్తారు.. ఈ ఉత్సవమూర్తులతో పాటు ఆనంద నిలయంలోని మూలవిరాట్టుకు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు, ప్రసాదాలు నివేదించనున్నారు అర్చకులు.. ఆణివార ఆస్థానం సందర్భంగా సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్ప పల్లకీపై తిరుమల పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులకు కనువిందు చేయనున్నారు.

ఉదయం పూట ఆణివార ఆస్థానం నిర్వహిస్తున్న కారణంగా ఆర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ. శ్రీవారి ఆలయంలో ఆదివారం నాడు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. రోజున ఉదయం ఆర్జిత సేవలు ఉండవు. ఈ విషయాన్ని భక్తులు గుర్తించాలని టీటీడీ అధికారులు కోరుతున్నారు.

Published at : 17 Jul 2022 07:30 AM (IST) Tags: ttd Tirumala news Tirumala Termination of Arjita Services Anivara Asthanam

ఇవి కూడా చూడండి

తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!

తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!

Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష- ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన

Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష-  ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన

JC Prabhakar Reddy: తాడిపత్రిలో హై టెన్షన్! జేసీని అడ్డుకున్న పోలీసులు

JC Prabhakar Reddy: తాడిపత్రిలో హై టెన్షన్! జేసీని అడ్డుకున్న పోలీసులు

Tirumala News: తిరుమల కొండపై వారం నుంచి ఆగని వర్షం - భక్తులు తీవ్ర ఇబ్బందులు

Tirumala News: తిరుమల కొండపై వారం నుంచి ఆగని వర్షం - భక్తులు తీవ్ర ఇబ్బందులు

Tirupati Rains: తుపాన్ ప్రభావంతో తిరుపతిలో భారీ వర్షాలు, పలు విమానాలు దారి మళ్లింపు!

Tirupati Rains: తుపాన్ ప్రభావంతో తిరుపతిలో భారీ వర్షాలు, పలు విమానాలు దారి మళ్లింపు!

టాప్ స్టోరీస్

Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం

Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం

BRS Party News: ఇక తెలంగాణ భవన్ కేంద్రంగా బీఆర్ఎస్ పాలిటిక్స్: ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచనలు

BRS Party News: ఇక తెలంగాణ భవన్ కేంద్రంగా బీఆర్ఎస్ పాలిటిక్స్: ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచనలు

Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్

Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్

Mizoram Election Results 2023: మిజోరంలో బీజేపీ మిత్రపక్ష పార్టీ MNFకి షాక్, మెజార్టీ సాధించిన ZPM

Mizoram Election Results 2023: మిజోరంలో బీజేపీ మిత్రపక్ష పార్టీ MNFకి షాక్, మెజార్టీ సాధించిన ZPM
×