అన్వేషించండి

Pawan Kalyan: అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ - చర్చించిన అంశాలు ఇవే !

Delhi: కేంద్రమంత్రి అమిత్ షాతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు రాజకీయాలపైనా చర్చించినట్లుగా తెలుస్తోంది.

Pawan Kalyan met Union Home Minister Amit Shah in delhi: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత ఢిల్లీకి వెళ్లిన ఆయన దాదాపుగా ఇరవై నిమిషాల సేపు అమిత షాతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులతో పాటు తన మంత్రిత్వ శాఖకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల అంశాన్ని కూడా ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా రాజకీయ అంశాలపైనే చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు. సమావేశం ముగిసిన తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ విజయవాడ బయలుదేరారు. 

డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్                 

డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కల్యాణ్ అధికారిక పర్యటన మీద ఢిల్లీ వెళ్లడం ఇదే మొదటి సారి. అయితే ఈ పర్యటనలో ఆయన కేవలం అమిత్ షాతో మాత్రమే భేటీకి షెడ్యూల్ చేసుకున్నారు. అమిత్ షాతో సమావేశం కోసం గతంలోనే పవన్ కల్యాణ్ పేషీ నుంచి ప్రతిపాదనలు వెళ్లే...తాజాగా అపాయింట్మెంట్ ఖరారు చేశారని అందుకే పవన్ ఢిల్లీ వెళ్లారని అంటున్నారు. ఏపీలో పరిస్థితులపై ఆయన ఓ నివేదిక ఇచ్చారని తెలుస్తోంది.  రాజకీయ అంశాలనూ నివేదికలో పొందు పరిచినట్లుగా భావిస్తున్నారు.             

Also Read: AP Cabinet: ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లుకు ఆమోదం - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే! 

శాంతిభద్రతల అంశంపై మరింత కఠినంగా వ్యవహరించాలనే ఆలోచన                  

రెండు రోజుల కిందట పవన్  కల్యాణ్ పిఠాపురంలో మాట్లాడినప్పుడు శాంతిభద్రతల అంశంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హోంమంత్రి అనితను బాధ్యత తీసుకోవాలని హెచ్చరించడంతో పాటు తాను హోంమంత్రిగా బాధ్యతలు తీసుకుంటే పరిస్థితి వేరుగా ఉంటుందని కూడా ప్రకటించారు. ఈ క్రమంలో ఏపీ లో శాంతిభద్రతల కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని ఈ విషయంలో కేంద్రం సహకారం ఉండాలని పవన్ కల్యాణ్ కోరినట్లుగా చెబుతున్నారు. అమిత్ షా కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మహిళలను కించ పరుస్తూ కీచకులుగా మారిన వారిపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. 

కడప ఎస్పీపై బదిలీ వేటు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం వహించారనే !

చర్చించిన అంశాలపై కాసేపట్లో అధికారిక ప్రకటన                 

అమిత్ షాతో భేటీపై పవన్ కల్యాణ్, జనసేన పార్టీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అధికారిక ప్రకటనలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. అమిత్ షా బిజీగా ఉన్న సమయంలోనూ పవన్ కల్యాణ్‌కు సమయం కేటాయించారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అందుకే స్వల్ప సమయం మాత్రమే మాట్లాడారని అంటున్నారు.               

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక లేనట్లే - రఘురాజు అనర్హత రద్దు చేసిన హైకోర్టు
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక లేనట్లే - రఘురాజు అనర్హత రద్దు చేసిన హైకోర్టు
Sai Durgha Tej: అలాంటి కామెంట్స్ దారుణం! సోషల్ మీడియాను తగలబెట్టేస్తా - ఏబీపీ దేశం ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ లో తేజ్  
అలాంటి కామెంట్స్ దారుణం! సోషల్ మీడియాను తగలబెట్టేస్తా - ఏబీపీ దేశం ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ లో తేజ్  
Skoda Kylaq: రూ.8 లక్షల్లోపు ధరలోనే అదిరే ఎస్‌యూవీ - స్కోడా కైలాక్‌ వచ్చేసింది!
రూ.8 లక్షల్లోపు ధరలోనే అదిరే ఎస్‌యూవీ - స్కోడా కైలాక్‌ వచ్చేసింది!
AP Cabinet: ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లుకు ఆమోదం - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లుకు ఆమోదం - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Usha Vance Chilukuri on Donald Trump Win | US Elections 2024 లో ట్రంప్ గెలుపు వెనుక తెలుగమ్మాయిDonald Trump Won US Elections 2024 | అధికారం కోసం అణువణువూ శ్రమించిన ట్రంప్ | ABP DesamDonald Trump Going to be Win US Elections 2024 | అధ్యక్ష ఎన్నికల్లో విజయానికి చేరువలో ట్రంప్ | ABPవీడియో: మా ఇంటికి దేవుడు వచ్చి టీ చేసిచ్చాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక లేనట్లే - రఘురాజు అనర్హత రద్దు చేసిన హైకోర్టు
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక లేనట్లే - రఘురాజు అనర్హత రద్దు చేసిన హైకోర్టు
Sai Durgha Tej: అలాంటి కామెంట్స్ దారుణం! సోషల్ మీడియాను తగలబెట్టేస్తా - ఏబీపీ దేశం ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ లో తేజ్  
అలాంటి కామెంట్స్ దారుణం! సోషల్ మీడియాను తగలబెట్టేస్తా - ఏబీపీ దేశం ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ లో తేజ్  
Skoda Kylaq: రూ.8 లక్షల్లోపు ధరలోనే అదిరే ఎస్‌యూవీ - స్కోడా కైలాక్‌ వచ్చేసింది!
రూ.8 లక్షల్లోపు ధరలోనే అదిరే ఎస్‌యూవీ - స్కోడా కైలాక్‌ వచ్చేసింది!
AP Cabinet: ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లుకు ఆమోదం - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లుకు ఆమోదం - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Honor X9c: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్ - ధర ఎంతంటే?
108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్ - ధర ఎంతంటే?
US New President Donald Trump: మిత్రమా! ప్రజల కోసం కలిసి పని చేద్దాం; ట్రంప్‌నకు మోదీ ట్వీట్, ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ
మిత్రమా! ప్రజల కోసం కలిసి పని చేద్దాం; ట్రంప్‌నకు మోదీ ట్వీట్, ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ
Vasamsetti Subhash: చంద్రబాబు తిడతారు, అవసరమైతే కొడతారు: తనకు సీఎం క్లాస్‌పై మంత్రి వాసంశెట్టి సుభాష్‌
చంద్రబాబు తిడతారు, అవసరమైతే కొడతారు: తనకు సీఎం క్లాస్‌పై మంత్రి వాసంశెట్టి సుభాష్‌
AP DSC 2024: ఏపీలో నిరుద్యోగులకు షాక్, 'మెగా డీఎస్సీ' ప్రకటనను వాయిదా వేసిన విద్యాశాఖ, కారణమిదేనా!
ఏపీలో నిరుద్యోగులకు షాక్, 'మెగా డీఎస్సీ' ప్రకటనను వాయిదా వేసిన విద్యాశాఖ, కారణమిదేనా!
Embed widget