Kadapa SP Transfer: కడప ఎస్పీపై బదిలీ వేటు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం వహించారనే !
Andhra: సోషల్ మీడియాలో మహిళల్ని కించ పరిచేలా పోస్టులు పెడుతున్న వారిని ఉపేక్షిస్తున్న కడపఎస్పీని బదిలీ చేశారు. వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేసి నోటీసులు ఇచ్చి వదిలేయడమే కారణం.
Kadapa SP: పోలీసుల పనితీరుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ కొంత మంది పోలీసులు తీరు మార్చుకోకపోవడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన నేతల్ని వారి కుటుంబాల్లోని మహిళల్ని కించ పరుస్తూ.. మార్ఫింగులు చేస్తూ విచ్చలవిడిగా పోస్టులు పెడుతున్న వారిని ఉపేక్షిస్తున్నారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇలాంటి పోస్టులు పెట్టేవారిలో కడప జిల్లాకు చెందిన వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి ముఖ్యుడు. ఆయనపై గతంలో వైఎస్ సునీత కూడా ఫిర్యాదు చేశారు. అయనను అరెస్టు చేసిన పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చి వదిలి పెట్టేశారు.దీంతో గగ్గోలు రేగింది.
వర్రా రవీంద్రారెడ్డిపై వివిధ ప్రాంతాల్లో పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి. సీరియల్ అఫెన్సర్ అయిన ఆయనను కోర్టులో ప్రవేశ పెట్టకుండా నోటీసులు ఇచ్చి పంపేయడంతో ఆయన పారిపోయారు. మరో కేుసలో అదుపులోకి తీసుకునేందుకు ఆయన ఇంటికి వెళ్లినప్పటికీ అక్కడ లేరు.దాంతో ఆయన సోదరుడ్ని కుటుంబసభ్యుల్ని స్టేషన్ కు తరలించారు. వర్రా రవీంద్రారెడ్డి విషయంలో ఇది తీవ్ర నిర్లక్ష్యమని భావించిన ఏపీ ప్రభుత్వం కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును తక్షణం బదిలీ చేసింది. ఆయన వెంటనే హెడ్ క్వార్టర్ లో రిపోర్టు చేయాలని ఆదేశించి. చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ సీఐను సస్పెండ్ చేశారు.
Also Read: AP Cabinet: ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లుకు ఆమోదం - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
వైసీపీ హయాంలో సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెడితే .. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వాట్సాపుల్లో షేర్ చేసినా పోలీసులు కేసులు పెట్టి అరెస్టు చేసేవారు. అదే వైసీపీ కార్యకర్తలు అత్యంత అసభ్యంగా ఎవర్ని తిట్టినా పట్టించుకునేవారు కాదు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా వారు చంద్రబాబుతో పాటు ఇతర ముఖ్య నేతలు, వారి కుటుంబసభ్యులపై నీచంగా పోస్టులు పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. స్వయంగా హోంమంత్రిపై కూడా పోస్టులు పెడుతున్నా పోలీసులు చూసీ చూడనట్లుగా ఉంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.