Telangana High Court: సినిమా థియేటర్లలోకి 16 ఏళ్లలోపు పిల్లలు - ఈ టైంలో వారికి నో ఎంట్రీ, తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
Telangana News: పదహారేళ్లలోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించే టైమింగ్స్ విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 11 నుంచి ఉదయం 11 వరకూ వారిని థియేటర్లలోకి అనుమతించొద్దని తెలిపింది.

Telangana High Court Key Orders On Children Entry Timings In Theaters: సినిమా థియేటర్లలోకి పిల్లల ఎంట్రీ టైమింగ్స్‌కు సంబంధించి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. పదహారేళ్లలోపు పిల్లలు వెళ్లే సమయ వేళలపై కీలక వ్యాఖ్యలు చేసింది. రాత్రి 11 నుంచి ఉదయం 11 గంటల వరకూ పదహారేళ్లలోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించొద్దని ఆదేశించింది. ఈ మేరకు అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది.
సినిమా టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ బి.విజయ్ సేన్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. సమయం సందర్భం లేని షోలకు పిల్లలు వెళ్లడం వల్ల వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. ఈ మేరకు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 22వ తేదీకి వాయిదా వేసింది. కాగా, తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్ షోలకు అనుమతించడం లేదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

