Hussain Sagar Missing Update: సముద్రంలో కాదు మునిగిపోయిది హుస్సేన్‌సాగర్‌లోనే - అయినా దొరకని అజయ్ ఆచూకీ - ఏమయ్యాడు ?
Hussain Sagar: హుస్సేన్ సాగర్ బోటు ప్రమాదంలో మిస్ అయిన అజ్య కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్‌ను కూడా రంగంలోకి దింపారు.
Hussain Sagar Ajay Missing: బోటు ప్రమాదం సందర్భంగా హుస్సేన్ సాగర్ లో మిస్సయిన అజయ్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. NDRF బృందాలు కూడా రంగంలోకి దిగాయి. అయితే అజయ్ ఆచూకీ మాత్రం తెలియడం లేదు. ఆదివారం బాణసంచాను కాల్చేందుకు పర్యాటక శాఖకు చెందిన రెండు బోట్లలో సామగ్రి తీసుకుని తన స్నేహితులతో కలిసి అజయ్ హుస్సేన్ సాగర్ మధ్యలోకి వెళ్లాడు. అయితే హఠాత్తుగా బాణసంచా పేలడంతో రెండు బోట్లు కాలిపోయాయి. బోటులో ఉన్న పలువురికి మంటలు అంటున్నాయి. అదే బోటులో ఉన్న నలుగురు యువకులు నీటిలో దూకి ఒడ్డుకు చేరుకున్నారు.
అజయ్ అనే వ్యక్తి అటు ఒడ్డుకు రాలేదు.. ఇటు ఆస్పత్రికి చేరలేదని గుర్తించిన పటాసుల టీమ్
ఎవరూ మిస్ కాలేదని అనుకున్నారు కానీ అజయ్ అటు ఒడ్డుకు చేరుకున్న వారిలో లేరు.. ఇటు గాయపడిన వారిలో లేరు. దీంతో ఆయన కుటుంబసభ్యులు అధికారులను సంప్రదించారు. అజయ్‌కు ఈత రాదని కుటుంబసభ్యులు చెప్పడంతో హుస్సేన్ సాగర్‌లో మునిగిపోయి ఉంటాడని పోలీసులు అనుమానంతో గాలింపు ప్రారంభించారు. ఉదయం రెండు బృందాలతో గాలింపు చేపట్టారు. తర్వాత ఎన్డీఆర్ఎఫ్ టీమును రంగంలోకి దింపారు. మునిగిపోయి ఉంటే.. తేలేవాడని.. గాలిస్తున్న వారు భావిస్తున్నారు.
మునిగిపోయినా ఇంత సేపు తేలకుండా ఉంటాడా ?
హుస్సేన్ సాగర్ లో మునిగిపోయి ఉంటే.. వెంటనే తేలుతారని అంచనా వేస్తున్నారు. అయితే అజయ్ తేలలేదు. ఒక వేళ నీటిలో మనిగి చనిపోయినా మృతదేహం అయినా తేలుతుందని అనుకుంటున్నారు. అడుగుభాగాన బురద ఉండి అందులో ఏమైనా కూరుకుపోయిందేమో అని చూస్తున్నారు. అయితే సహా య బృందాల ప్రయత్నాలు ఫలించలేదు.అజయ్ ఆచూకీ తెలియలేదు. అజయ్ బోటు దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చి ఉంటారని మొదట్లో అనుకున్నారు. కానీ ఆయనకు ఈత రాదని చెప్పిన తర్వాతనే అసలు విషయం తెలిసింది.
అంతా గాలించినా దొరకని ఆచూకీ
అజయ్ హుస్సేన్ సాగర్‌లో మునిగిపోయి ఉంటే ఖచ్చితంగా మృతదేహం అయినా లభించేదని .. మునిగిపోలేదని ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు. అయితే తమ బాధ్యతగా గాలింపు చేపడుతున్నారు. హుస్సేన్ సాగర్ ప్రవాహం ఉండేది కాదు ..నీరు నిలకడగా ఉంటాయి. అందుకే..ఎంతో సేపు అందులో మృతదేహం ఉండదని చెబుతున్నారు. అజయ్ ఒక వేళ బయటపడి ఉంటే.. ఇంటికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తాడన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఈ మిస్టరీ ఏమిటో చేధించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మోర వైపు రెస్క్యూటీమ్స్ తమ ప్రయత్నాలు తాము చేస్తున్నాయి.
Also Read : Maoist Encounters: కదల్లేని వృద్ధులను సైతం ఈడ్చుకొచ్చి కాల్చేస్తున్నారు, మావోయిస్టుల అంతం అమిత్ షా వల్ల కాదు