Morning Top News:
హైదారాబాద్ రీజినల్ రింగ్‌రోడ్డుపై కేంద్రం కీలక నిర్ణయం
భారతమాల పథకం ఫేజ్-I క్రింద తెలంగాణలో ప్రతిష్టాత్మంగా నిర్మించనున్న హైదారాబాద్ రీజినల్ రింగ్‌రోడ్డుకు సంబంధించిన కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర భాగంలో పనులకు సంబంధించి కేంద్రం టెండర్లను పిలిచింది. ఈ పనుల్లో భాగంగా గిర్మాపూర్ నుంచి యాదాద్రి వరకు నాలుగు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించనున్నారు. దీన్ని నాలుగు భాగాలుగా చేసి టెండర్లు పిలించారు. ఈ ఫోర్‌లేన్ల రహదారిని రూ. 5,555కోట్లతో రెండేళ్లలో నిర్మించనున్నారు.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే..!
తిరుమల తిరుపతి దేవస్థానం - టీటీడీ రోజుకో కీలక నిర్ణయం తీసుకుంటోంది. త్వరలో అన్ని సేవలను నగదు రహిత చెల్లింపు విధానాన్ని తీసుకురానున్నట్టు టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. ఇందుకోసం కియోస్క్ మిషన్స్ ఉపయోగిస్తామన్నారు. జనవరి 2025లో ప్రారంభం కానున్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు ఏర్పాట్లపై ఇటీవలే సమీక్ష నిర్వహించిన టీటీడీ.. టోకెన్లు, టిక్కెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతి ఇవ్వనుంది.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
హైడ్రా కోసం FM రేడియో స్టేషన్: కమిషనర్ రంగనాథ్
హైడ్రా కోసం ఒక FM రేడియో స్టేషన్ పెట్టాలని ఆలోచన చేస్తున్నాం అని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. "నోటరీ ఉన్న భూములు రెండు మూడు రకాలుగా వెరిఫై చేసి కొనాలి. అనుమతి లేని నిర్మాణాల్లో బిజినెస్ చేసేవాళ్ళు.. నోటీస్ ఇచ్చిన వెంటనే ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పటి వరకు 200 ఎకరాలు హైడ్రా కాపాడింది. 2025లో 12 చెరువులను సుందరీకరించాలని హైడ్రా టార్గెట్‌గా పెట్టుకుంది" అని రంగనాథ్ అన్నారు.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
తెలంగాణలో టీడీపీ యాక్షన్ ప్లాన్ రెడీ
తెలుగుదేశం పార్టీ తెలంగాణపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం యాక్షన్ ప్లాన్ రెడీ చేసే బాధ్యతను ప్రశాంత్ కిషోర్ తో పాటు షో టైమ్ కన్సల్టెన్సీకి చెందిన రాబిన్ శర్మకు అప్పగించినట్లుగా తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్టుగా పని చేయడం లేదు. కానీ తన ఐడియాలు మాత్రం ఇస్తున్నారు. రాబిన్ శర్మ గత ఎన్నికల్లో టీడీపీ గెలవడానికి స్ట్రాటజిస్టుగా పని చేశారు. ఈ క్రమంలో వారు తెలంగాణలో చతికిలపడిన
టీడీపీకి మళ్లీ ఊపిరి పోయడానికి రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
బన్నీ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ రియాక్షన్
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ కావడంపై డిప్యూటీ సీఎం
పవన్ కల్యాణ్‌కు ప్రశ్న ఎదురైంది. కడప పర్యటనలో మీడియాతో మాట్లాడుతుండగా.. బన్నీ అరెస్టుపై స్పందించాలని ఓ విలేకరి అడిగారు. ‘ఇక్కడ జనాలు చచ్చిపోతే సినిమా గురించి మాట్లాడతారా? కొంచెం పెద్ద మనసుతో ఆలోచించండి.. పెద్దగా ఆలోచించండి’ అని అన్నారు.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
కనిపిస్తే మోహన్ బాబు అరెస్ట్..?
జర్నలిస్టుపై హత్యాయత్నం కేసులో మోహన్ బాబు ఆజ్ఞాతంలో ఉన్నారు. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో ఆయన హైదరాబాద్ లో ఉండడం లేదని అంటున్నారు. పోలీసులు24వ తేదీ తర్వాత మోహన్ బాబుకు నోటీసులు జారీ చేస్తామని ప్రకటించారు.కానీ ఆ రోజు ముగిసి ఐదు రోజులు అయినా పట్టించుకోలేదు. బయట కనిపిస్తే అరెస్టు చేస్తారేమోనన్న ఉద్దేశంతో మోహన్ బాబు హైదరాబాద్‌లోనే ఉండటం లేదని చెబుతున్నారు.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
హీటెక్కిన ఢిల్లీ ఎన్నికల ప్రచారం
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల సమావేశాలకు ముహూర్తం సమీపిస్తున్న వేళ.. రాజకీయ నేతల విమర్శల దాడి పెరుగుతోంది. నేతల హామీలతో ఢిల్లీ ఓటర్లు తడిసిముద్దవుతున్నారు. తాము అధికారంలోకి వస్తే మహిళా సమ్మాన్ యోజనను తీసుకువస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా ప్రతి మహిళకు నెలనెలా రూ.2100 ఇస్తామని చెప్పారు. దీనిపై కేబినెట్ తీర్మానం చేశాస్తామన్నారు. వృద్ధుల వైద్యానికి అయ్యే ఖర్చును ఢిల్లీ ప్రభుత్వమే భరిస్తుందన్నారు.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఆరు రోజులుగా బోరుబావిలో చిన్నారి
రాజస్థాన్‌లోని కోట్‌పుత్లీ జిల్లాలో మూడేళ్ల చిన్నారి బోరుబావిలో పడిన విషయం తెలిసిందే. గత ఆరు రోజులుగా చిన్నారిని బయటకు తీసుకువచ్చేందుకు అధికార యంత్రాంగం శాయశక్తుల కృషిచేస్తున్నా ఫలితం మాత్రం సూన్యంగానే ఉంది. నేటికీ ఆ చిన్నారి బోరుబావిలోనే ఉంది. బోరుబావి రంధ్రంలో తన కుమార్తె నరకం అనుభవిస్తోందని, ఎలాగైనా తన పాపను సురక్షితంగా బయటకు తీసుకురావాలని అధికార యంత్రాంగాన్ని చిన్నారి తల్లి వేడుకుంటోంది.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం- 28 మంది మృతి
దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. యువాన్ ఎయిర్ పోర్టులో రన్‌వే మీద అదుపుతప్పిన విమానం గోడను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. విమానంలో మొత్తం 181 మంది ఉన్నారు. వారిలో 175 మంది ప్రయాణికులు కాగా, ఆరుగురు విమాన సిబ్బంది ఉన్నారని యోన్హాప్ రిపోర్ట్ చేసింది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కొన్ని రిపోర్టుల ప్రకారం అయితే ఇదివరకే 28 మంది మృతిచెందారని సమాచారం.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి
తెలుగుతేజం, భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి అరుదైన ఘనత సాధించింది. వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచింది. ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన టోర్నీలో కోనేరు హంపి విజేతగా నిలిచింది. ర్యాపిడ్ చెస్ టోర్నీలో కోనేరు హంపి 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఛాంపియన్‌గా అవతరించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..