Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Tirumala : టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. నగదు రహిత చెల్లింపు విధానాన్ని మరింత విస్తరించనున్నట్టు టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.
Tirumala : తిరుమల తిరుపతి దేవస్థానం - టీటీడీ రోజుకో టాపిక్ తో వార్తల్లో నిలుస్తోంది. త్వరలో అన్ని సేవలను నగదు రహిత చెల్లింపు విధానాన్ని తీసుకురానున్నట్టు టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. ఇందుకోసం కియోస్క్ మిషన్స్ ఉపయోగిస్తామన్నారు. జనవరి 2025లో ప్రారంభం కానున్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు ఏర్పాట్లపై ఇటీవలే సమీక్ష నిర్వహించిన టీటీడీ.. టోకెన్లు, టిక్కెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నామన్నారు.
కియోస్క్ మిషన్స్ తో నగద రహిత చెల్లింపులు
టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.1 నుండి రూ.లక్షలోపు విరాళం ఇవ్వదలచిన భక్తుల కోసం సులభంగా విరాళం ఇచ్చేందుకు వీలుగా తిరుమలలోని శ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో కియోస్క్ మిషన్లు (సెల్ఫ్ ఆపరేటెడ్ ఆన్ లైన్ పేమెంట్) ఏర్పాటు చేసిన విషయం విధితమే. తాజాగా పేరూరు సమీపంలోని శ్రీ వకుళామాత ఆలయంలో కూడా ఈ కియోస్క్ మిషన్ ను ప్రారంభించారు. మరో వారం రోజుల్లో విజయవాడ, చెన్నై, హైదరాబాద్ లోని శ్రీవారి ఆలయాల్లో కియోస్క్ మిషన్లను భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం అన్న ప్రసాదం ట్రస్టుకు మాత్రమే విరాళం ఇచ్చే అవకాశముంది. త్వరలో టీటీడీ ఆలయాల్లోని అన్ని సేవలకు ఈ మిషన్ల ద్వారా నగదు రహిత చెల్లింపు చేసే విధానాన్ని టీటీడీ అందుబాటులోకి తీసుకురానుంది.
ప్రస్తుతం అన్న ప్రసాదం ట్రస్టుకు మాత్రమే విరాళం ఇచ్చే అవకాశం ఉందన్న బీఆర్ నాయుడు.. త్వరలో టీటీడీ ఆలయాల్లోని అన్ని సేవలకు ఈ మిషన్ల ద్వారానే నగదు రహిత చెల్లింపు చేసే విధానాన్ని టీటీడీ అందుబాటులోకి తీసుకురానుందని వెల్లడించారు. ఈ మిషన్స్ ద్వారా ఇప్పటివరకు అన్న ప్రసాదం ట్రస్టుకు 50రోజుల్లో రూ.55 లక్షలు విరాళం అందిందని బీఆర్ నాయుడు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇకపోతే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, ఒంటిమిట్ట కోదండ రామాలయం, బెంగుళూరులో శ్రీవారి ఆలయంలో కూడా ఈ మిషన్లు ప్రారంభించారు. ఈ మూడు ఆలయాల్లో ఈ మిషన్ల ద్వారా 15రోజుల్లో రూ.5లక్షలు విరాళంగా అందింది.
దర్శనానికి ప్రజాప్రతినిధుల లేఖలు
ఇటీవల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలకు ప్రాధాన్యత కల్పిస్తామని టీటీడీ తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. వారానికి 2రోజులు మాత్రమే అవకాశం కల్పించకుండా.. ఈ వ్యవధిని పెంచాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాలను సమానం చూడాలన్నారు. 2 రోజులే కాకుండా వారం రోజులకు పెంచాలని చెప్పారు.
వైకుంఠ ఏకాదశికి టీటీడీ ఏర్పాట్లు
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భక్తుల అధిక రద్దీ దృష్ట్యా ఈ 10 రోజులలో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించమని టీటీడీ ఈవో జే శ్యామలరావు. ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులు స్వయంగా వస్తే వారికి మాత్రం శ్రీవారి దర్శనం కల్పిస్తామని చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 7న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుందని.. జనవరి 10న వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. జనవరి 11న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తాం'అని వెల్లడించారు.
Also Read : TTD News: శ్రీవారి హుండీల్లో వేసిన సొమ్మునూ నొక్కేస్తారా ? ఈ స్కాంపై విచారణ చేయిస్తే సంచలన విషయాలు