అన్వేషించండి
Morning Top News: నేడే ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్, ఏపీకీ కేంద్రం గుడ్ న్యూస్ వంటి మార్నింగ్ న్యూస్
Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.
![Morning Top News: నేడే ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్, ఏపీకీ కేంద్రం గుడ్ న్యూస్ వంటి మార్నింగ్ న్యూస్ Todays Top 10 headlines 25 th October Andhra Pradesh Telangana politics latest news today from abp desam latest telugu news updates Morning Top News: నేడే ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్, ఏపీకీ కేంద్రం గుడ్ న్యూస్ వంటి మార్నింగ్ న్యూస్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/24/61d7348ef312e5e9f7bb3aacbbf85be717297878110091036_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Todays Top 10 headlines
Source : Canva
Today Top News:
1.నేడే ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్
దక్షిణాది విజయాలను మరింత బలంగా వినిపించేలా రెండో ఎడిషన్ సదరన్ రైజింగ్ సమ్మిట్ ను నిర్వహించేందుకు ఏబీపీ నెట్‌వర్క్ సిద్ధమైంది. దేశంలో పలు భాషల్లో మీడియా సంస్థలను నడుపుతున్న ABP NETWORK ఇండియా గ్రోత్ స్టోరీలో సౌతిండియా ప్రాధాన్యతను తెలిపేందుకు సదస్సులు నిర్వహిస్తోంది. సౌతిండియా సక్సెస్‌ను సెలబ్రేట్ చేసేలా The Southern Rising Summit 2024 ను ఇవాళ హైదరాబాద్‌లో జరపనుంది. ఈ సెకండ్ ఎడిషన్ సమ్మిట్ లో దక్షణాది రాజకీయ, సాంస్కృతిక, పారిశ్రామిక, క్రీడా రంగాల్లో వేసిన ముద్ర వేసిన వారు మాట్లాడతారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
2. విభిన్న రంగాల ప్రముఖల హాజరు
ఇవాళ జరగనున్న ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో విభిన్నరంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. దేశాభివృద్ధిలో దక్షిణాది పాత్రపై చర్చించనున్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరోయిన్ రాశిఖన్నా, రాపిడో కో ఫౌండర్ అరవింద్ సంకా, సుప్రసిద్ధ క్లాసికల్ డ్యాన్సర్ యామిరెడ్డి, డాక్టర్ అనూ ఆచార్య, ఫ్యాషన్ డిజైనర్ గౌరంగ్ షా తో సహా అనేక మంది ప్రముఖులు సదరన్ రైజింగ్ సమ్మిట్‌కు హాజరవుతున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
3. ఎవరైనా అమ్మ మీద కేసు వేస్తారా? : షర్మిల
మాజీ సీఎం జగన్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య ఆస్తి వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. దీని పై తాజాగా షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. కుటుంబంలో సమస్యలు ఉండడం సహజమేనని, కానీ అందరూ అమ్మల మీద కోర్టుల్లో కేసులు వేయరు కదా? ఇలా కోర్టుకు లాగరు కదా? అన్నారు. చెల్లెళ్ల మీద కేసులు వేసుకుంటారా? అని ప్రశ్నించారు. అయితే, జగన్‌పై లీగల్ ఫైట్ చేస్తారా అనే ప్రశ్నకు షర్మిల సమాధానం ఇవ్వలేదు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
4. ఏపీకీ కేంద్రం గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితన్ గడ్కరీ ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. రూ.252.42 కోట్ల విలువైన రహదారి పనులకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఇందులో రణస్థలం నుంచి శ్రీకాకుళం వరకూ ఆరులైన్ల ఎలివేటెడ్ కారిడార్ అభివృద్ధి, ఆధునికీకరణ గురించి కూడా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల పలు చోట్ల ట్రాఫిక్ సమస్యలు తీరడం సహా రహదారి భద్రత పెరుగుతుందని గడ్కరీ తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
5. నవంబర్‌లో మెగా డీఎస్సీ?
నవంబర్ మొదటి వారంతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే ఎటువంటి న్యాయ వివాదాలకు తావు లేకుండా విద్యాశాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. మూడు, నాలుగు నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేసి, ఆ వెంటనే ఎంపికైన వారికి శిక్షణ ప్రారంభించాలని భావిస్తోంది. 16,347 పోస్టులతో ఈ నోటిఫికేషన్‌ను జారీ చేస్తారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
6. దానా ఎఫెక్ట్.. ఒడిశా అలర్ట్
ఒడిశాలోని భితర్‌కనికా -ధమ్రా సమీపంలో దానా తుపాను తీరం దాటుతుందని వాతావరణ కేంద్రం హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనిపై మోహన్ చరణ్ మాఝీ సర్కారు అప్రమత్తమైంది. తీర ప్రాంతంలోని సుమారు 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సీఎం మోహన్ చరణ్ మాఝీ తెలిపారు. 7వేల పునరావస కేంద్రాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. శుక్రవారం తుపాను తీరం దాటే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
7. తండ్రి వేధింపులు తట్టుకోలేక బడిలో దాక్కున్న బాలిక
తండ్రి పెట్టే బాధలు భరించలేక స్కూల్‌లోనే దాక్కుందో బాలిక. తన తండ్రి అమ్మెస్తానంటూ బెదిరిస్తున్నాడని ఇంటికి వెళ్లనంటూ మారాం చేసింది. ఇంతలో ఆ తండ్రి వచ్చి స్కూల్‌లో గొడవ చేశాడు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి బాలికను అధికారుల సంరక్షణలో ఉంచారు. భార్యపై కోపం వచ్చిన ప్రతిసారి 11 ఏళ్ల కుమార్తెపై కక్ష తీర్చుకోవడం ఆ తండ్రికి అలవాటుగా మారింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
8. బాణసంచా దుకాణాలకు అనుమతులు తప్పనిసరి
బాణసంచా దుకాణాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని జీహెచ్ఎంసీ కీలక ప్రకటన చేసింది. క్రాకర్స్ విక్రయించే దుకాణదారులు కచ్చితంగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. హోల్ సేల్ దుకాణాలకు రూ.66 వేలు, రిటైల్ దుకాణాలకు రూ.11 వేలు నిర్ణయించినట్లు చెప్పారు. ఈ మేరకు పలు కీలక సూచనలు చేశారు. దుకాణాలు ఏర్పాటు చేయాలనుకునే వారంతా నిర్ణీత ఫీజును చెల్లించి జీహెచ్ఎంసీ నుంచి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
9.సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్
దీపావళి సందర్భంగా పీఎల్‌ఆర్‌ఎస్ బోనస్‌ను శుక్రవారం సింగరేణి కార్మికులకు చెల్లించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు ఆయన రూ.358 కోట్లను విడుదల చేయాలని సింరేణి సీఎండీ బలరాంను ఆదేశించారు. గత ఏడాది బోనస్ కన్నా ప్రస్తుతం ప్రకటించిన రూ.50 కోట్లు అధికం మొత్తం కావడం విశేషం. బోనస్ కింద ఒక్కో కార్మికుడు రూ.93,750 అందుకోనున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
10. కివీస్‌ను కట్టడి చేసిన భారత్
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్ 259 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (0) డకౌట్‌గా వెనుదిరిగి నిరాశపర్చారు. ఆట ముగిసే సమయానికి టీమిండియా 16-1 స్కోరుతో ఉంది. గిల్ (6*), జైస్వాల్ (10*) క్రీజులో ఉన్నారు. భారత్ ఇంకా 243 పరుగుల వెనుకంజలో ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
రాజమండ్రి
విజయవాడ
గాసిప్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion