(Source: ECI/ABP News/ABP Majha)
Odisha News: ఒడిశాలో తీరం దాటిన దానా తుపాను- గాలులు, వానతో భారీ విధ్వంసం
Dana Cyclone Effect: ఓవైపు వందకుపైగా కిలోమీటర్లతో వీస్తున్న గాలి మరోవైపు జోరు వన కారణంగా ఒడిశాలో భారీ విధ్వంసమే సృష్టించింది. ఈ ఉదయం తీరం దాటిన తుపాను మూడు ప్రాంతాలను ఊపేసింది.
Latest Weather In Odisha: మూడు రోజలుగా ప్రజలను వణికిస్తున్న దానా తుపాను ఈ ఉదయం తీరం దాటింది. ఒడిశాలోని భితార్కానికా- ధమ్రా మధ్య తీరం దాటింది. తీరం దాటేటప్పుడు తుపాను బీభత్సం సృష్టించింది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ తీర ప్రాంతాన్ని మెలితిప్పేసింది. తుపాను ధాటికి భద్రక్, జగత్సింగ్‌పూర్, బాలాసోర్ ప్రాంతాలు చివురుటాకులో వణికిపోయాయి. చెట్లు, విద్యుత్‌స్తంభాలు నేలకొరిగాయి.
Odisha: Trees uprooted due to gusty winds and heavy downpour as Cyclone Dana makes landfall
— ANI Digital (@ani_digital) October 25, 2024
Read @ANI Story | https://t.co/A86a9zxnWP#Odisha #CycloneDana #landfall pic.twitter.com/Gxlgwx4qY7
తుపాను ధాటికి జరిగిన నష్టం ఎంతా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. వేల పునరావాసకేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం లక్షల్లో జనాలను అక్కడకు తరలించింది. వారంతా సురక్షితంగా ఉన్నారు. అయితే తుపాను తీరం దాటే సమయంలో కురిసిన వర్షానికి, గాలులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసే పనుల్లో అధికారులు ఉన్నాయి. సముద్రం ఇంకా అల్లకల్లోలంగా ఉంది. అందుకే మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.