Mega DSC Notification: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్, ఖాళీలు ఎన్నో తెలుసా?
DSC 2024 Notification: ఏపీ విద్యాాశాఖ త్వరలోనే డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నవంబరు 2న టెట్ ఫలితాల వెల్లడైన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

AP Mega DSC 2024 Notification Date: ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పనుంది. ఈ మేరకు మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్‌ను త్వరలో జారీ చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది. నవంబరు మొదటివారంలో నోటిఫికేషన్ వెలువడనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎలాంటి న్యాయ వివాదాలు లేకుండా నోటిఫికేషన్ ఇచ్చేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ మెగా డీఎస్సీ ద్వారా మొత్తం 16,347 టీచర్ పోస్టులు భర్తీచేయనున్నారు. మరోవైపు టెట్ పరీక్షలు అక్టోబరు 21తో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలను నవంబరు 2న ప్రకటించనున్నారు. అదేరోజు డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మెగా డీఎస్సీ ద్వారా భర్తీచేసే మొత్తం ఖాళీల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT)-6,371 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్లు(SA)-7,725 పోస్టులు, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్(TGT)-1,781 పోస్టులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్(PGT)-286 పోస్టులు, ప్రిన్సిపల్-52 పోస్టులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET)-132 పోస్టులను భర్తీ చేయనున్నారు.
మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ దరఖాస్తుకు రేపే ఆఖరు..
ఏపీలో డీఎస్సీ పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు సాంఘిక సంక్షేమ/ గిరిజన సంక్షేమ శాఖలు దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ శిక్షణకు సంబంధించిన దరఖాస్తు గడువు అక్టోబరు 25తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేనివారు వెంటనే దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు ఉచిత బోధన, ఉచిత భోజనం, వసతి సౌకర్యాలను ప్రభుత్వం కల్పించనుంది. అదేవిధంగా అనుభవజ్ఞులైన బోధనా సిబ్బందితో ఆయా జిల్లాల్లో 3 నెలల పాటు తరగతులు నిర్వహించనున్నారు. ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ పరీక్షలకు సంబంధించి కోచింగ్ ఉంటుంది. అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు జ్ఞానభూమి వెబ్‌పోర్టల్ ద్వారా అక్టోబర్ 25లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
టెట్ ప్రిలిమినరీ 'కీ' విడుదల, ఫైనల్ కీ, ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీలో అక్టోబరు 3 నుంచి 21 వరకు 17 రోజులపాటు నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్షల(ఏపీటెట్-2024)కు సంబంధించిన అన్ని సబ్జెక్టుల రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక కీలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో వాటిని అందుబాటులో ఉంచింది. పేపర్ 2ఎ (సాంఘిక శాస్త్రం) పరీక్ష ప్రిలిమినరీ ‘కీ’లపై అభ్యంతరాలను అక్టోబర్ 25వ తేదీలోగా ఆన్‌లైన్‌లో తెలియజేయాలి. టెట్‌కు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేయగా.. 3,68,661 (86.28%) మంది హాజరయ్యారు. 17 రోజల పాటు రెండు విడతలుగా ఈ పరీక్షలు నిర్వహించారు. అక్టోబర్ 27న తుది ‘కీ’ విడుదల; నవంబర్ 2న ఫలితాల ప్రకటన ఉంటుంది. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే కాల్ సెంటర్ నెంబర్లు: 9398810958, 6281704160, 8121947387, 8125046997, 9398822554, 7995649286, 7995789286, 9505619127, 9963069286, 9398822618లలో లేదా ఈమెయిల్: grievances.tet@apschooledu.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏపీటెట్ జులై - 2024 ప్రాథమిక ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..
నవంబరు 2న టెట్ ఫలితాలు..
ఏపీలో అక్టోబరు 3 నుంచి 21 వరకు నిర్వహించిన ఏపీ టెట్ పరీక్షల ఫలితాలను నవంబరు 2న విడుదల చేయనున్నారు. ఏపీటెట్ పరీక్షలకు మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రాథమిక కీలను విద్యాశాఖ విడుదల చేసింది. అక్టోబర్ 27న తుది ‘కీ’ విడుదల చేసి; నవంబర్ 2న ఫలితాలను ప్రకటించనున్నారు. పరీక్షలో ఒక్కో పేపరును 150 మార్కులకు నిర్వహించగా.. అర్హత మార్కులను ఓసీ(జనరల్) అభ్యర్థులకు- 60 శాతంగా, బీసీ అభ్యర్థులకు- 50 శాతంగా, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్/ ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 40 శాతంగా నిర్ణయించారు.
ALSO READ: జూనియర్ లెక్చరర్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

