RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. రెండు టీమ్స్ లోను వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ ఉండటంతో ఈ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడం ఖాయం. దాంతో అసలు ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అన్న ప్రిడిక్షన్ మొదలు పెట్టారు ఫ్యాన్స్.
ఆర్‌సిబి విషయానికి వస్తే.. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఫామ్ ఆ టీమ్‌కు అతిపెద్ద బలం. కోహ్లీతో పాటు పవర్‌ఫుల్ బ్యాటింగ్ లైనప్ మ్యాచ్‌ని మలుపు తిప్పగలదు. అయితే బెంగళూరు టీమ్ కు ఎప్పటిలాగే డెత్ ఓవర్ల బౌలింగ్ కాస్త ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో ఎంతో బలంగా కనిపిస్తోంది.
గుజరాత్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ స్థిరంగా ఉండటంతో పాటు, వారి బౌలింగ్ ఎటాక్ స్పిన్ మరియు పేస్ విభాగాల్లో చాలా బాగుంది. ఇక పిచ్ రిపోర్ట్ ప్రకారం.. టాస్ గెలిచిన జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్‌లో డ్యూ ప్రభావం బ్యాటింగ్‌కు మరింత అనుకూలంగా మారుస్తుంది. కానీ గుజరాత్ బౌలర్లు కోహ్లీని త్వరగా అవుట్ చేస్తే మ్యాచ్ పూర్తిగా వారి చేతుల్లోకి వెళ్తుంది.
ట్రెండింగ్ వార్తలు





















