Bandla Ganesh : బండ్ల గణేష్‌ను చెప్పుతో కొట్టిన ఇండస్ట్రీ పెద్ద ఎవరు? - సీక్రెట్స్ బయటపెట్టిన ప్రొడ్యూసర్
Bandla Ganesh Reaction : ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తన జీవితంలో జరిగిన ఓ చేదు అనుభవాన్ని తాజా ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. ఇండస్ట్రీలో పెద్ద మనిషి తనను చెప్పుతో కొట్టినట్లు తెలిపారు.

Bandla Ganesh Reaction On Humiliation Incident : కమెడియన్‌గా, నిర్మాతగా, బిజినెస్ మ్యాన్‌గా, పొలిటీషియన్‌గా తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నారు బండ్ల గణేష్. పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని అయిన బండ్ల గణేష్ నిర్మాతగా తన విజయాలు, తన లక్ష్యాలు, ఇండస్ట్రీలో ఒకప్పుడు తనకు జరిగిన అవమానాన్ని... నటుడు రాజా రవీంద్ర పాడ్ కాస్ట్‌లో షేర్ చేసుకున్నారు. ఆ చేదు సంఘటన గురించి బండ్లన్న చెప్పుకొచ్చారిలా...
'చెప్పుతో కొట్టాడు'
ఇండస్ట్రీలో ఓ పెద్ద మనిషి తనను చెప్పుతో కొట్టినట్లు చెప్పారు బండ్ల గణేష్. 'అది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఓ అద్భుతమైన వ్యక్తి నాకు సాయం కూడా చేశారు. ఆయన కోపం నాకు వరంగా మారింది. ఆ రోజు నాకు బాగా గుర్తు. హెలికాఫ్టర్ యాక్సిడెంట్‌లో హీరోయిన్ సౌందర్య చనిపోయిన రోజు. నేను ఇంకో నటుడు ఆఫీసులో అలా ఊరికే కూర్చున్నాం. ఆయన వస్తే సార్... సార్ అని పిలిచినందుకు సడన్‌గా చెప్పుతో కొట్టాడు.
ఆయన ఏ టెన్షన్‌లో ఉన్నాడో ఏమో. రెండు రోజుల తర్వాత నాకు సారీ చెప్పాడు. వేరే వాళ్లపై కోపం నీపై చూపించానంటూ సంజాయిషీ ఇచ్చాడు. మన కంటే బలహీనుడిపై మనం విశ్వరూపం చూపిస్తాం. ఆ ఇన్సిడెంట్ తర్వాత నేను అక్కడి నుంచి బయటకు వచ్చేశా. నా దగ్గర డబ్బు లేదనే కదా నన్ను చెప్పుతో కొట్టాడు. ఆయన కన్నా ఎక్కువ డబ్బు సంపాదించి చూపిస్తా. లేదంటే నా పేరు గణేషే కాదు అని నాకు నేనే సవాల్ విసురుకున్నా. అలా నా లైఫ్ మార్చుకున్నా.' అని అప్పటి విషయం గుర్తు చేసుకున్నారు.
Also Read : వదలనే నిను వదలనే - మణిశర్మ లవ్ మ్యాజిక్... లవర్స్‌కు హార్ట్ టచింగ్ లిరిక్స్
'ఆయన కోసం ఏమైనా చేస్తా'
ఏపీ సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతుల కోసం తాను ఏమైనా చేస్తానని చెప్పారు బండ్ల గణేష్. 'తిరుమలకు కాలినడకన వెళ్లి వచ్చా. పొర్లుదండాలు పెట్టుకుని వెళ్లినా ఆయన రుణం తీర్చుకోలేను. మన జీవితంలో చేయూత అందించే వారిని మర్చిపోకూడదు. అది నా నైజం కాదు. పాదయాత్ర తర్వాత నా మైండ్ సెట్ మారిపోయింది.' అని చెప్పారు.
అదే నా లక్ష్యం
పవన్ కల్యాణ్‌కు మరో బ్లాక్ బస్టర్ హిట్ తీయడమే తన లక్ష్యమని చెప్పారు బండ్ల గణేష్. 'రీసెంట్‌గా వచ్చిన సినిమాలు చాలా బాగున్నా కలెక్షన్స్ రావడం లేదు. ఓటీటీల్లోకి వెంట వెంటనే మూవీస్ వచ్చేయడంతో ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. పవన్ కల్యాణ్ గారితో ఎవర్ గ్రీన్ మూవీ తీయాలని ఉంది. అది తీశాక నా బ్యానర్ క్లోజ్ చేస్తా.' అని చెప్పారు.
Also Read : గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ డాక్యుమెంటరీ - 9 ఏళ్ల తర్వాత ఓటీటీలో ఎంట్రీ... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు






















