అన్వేషించండి

Crime News: తండ్రి అమ్మెస్తాడని స్కూల్‌లో దాక్కున్న బాలిక- చౌటుప్పల్లో ఘటన 

Bhuvanagir News: తండ్రి పెట్టే హింసకు, బెదిరింపులకు భయపడిపోయిన ఓ బాలిక స్కూల్‌లో దాక్కుంది. చౌటుప్పల్‌లో జరిగిన ఘటనపై పోలీసులు జోక్యం చేసుకున్నారు.

Choutuppal Crime News: తండ్రి పెట్టే బాధలు భరించలేక స్కూల్‌లోనే దాక్కుందో బాలిక. తన తండ్రి అమ్మెస్తానంటూ బెదిరిస్తున్నాడని ఇంటికి వెళ్లనంటూ మారాం చేసింది. ఇంతలో ఆ తండ్రి వచ్చి స్కూల్‌లో గొడవ చేశాడు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి బాలికను అధికారుల సంరక్షణలో ఉంచారు. 

హైదరాబాద్‌కు చెందిన అక్బర్ దంపతులు చాలా రోజు క్రితం చౌటుప్పల్‌ వచ్చి జీవిస్తున్నారు. భార్యభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నాయి. భర్తతో గొడవ పడ్డ భార్య తన కుమారుడితో పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి అక్బర్‌ తన కుమార్తెతో కలిసి ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. తాగుడుకు బానిసైన అక్బర్ నిత్యం ఆమెను వేదించడం మొదలు పెట్టాడు. భార్యపై కోపం వచ్చిన ప్రతిసారి 11 ఏళ్ల కుమార్తెపై కక్ష తీర్చుకోవడం అలవాటుగా మారింది. 

బుధవారం కూడా బాలికను చిత్రవధ చేశాడు. కొట్టి హింసించాడు. ఎవరికైనా అమ్మెస్తానంటూ బెదిరించాడు. దీంతో బాలిక భయపడిపోయింది. చౌటుప్పల్ లోని బంగారుగడ్డలోని ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్న బాలిక గురువారం స్కూల్‌కు రాలేకపోయింది. సాయంత్రానికి భయపడుతూనే స్కూల్‌కు వచ్చింది. జరిగిన విషయాన్ని స్కూల్ పిల్లలకు చెప్పింది. రోజంతా ఏం తినలేదని ఆకలిగా ఉందంటూ బోరుమంది. 

బాలిక పరిస్థితి గమనించిన స్నేహితులు విషయాన్ని ఉపాధ్యాయులకు చెప్పారు. వెంటనే వాళ్లు బాలికతో మాట్లాడి ధైర్యం చెప్పి అన్నం తినిపించారు. స్కూల్ విడిచిపెట్టే టైం అయింది. రోజూ తన తండ్రి కొండుతున్నాడని... అమ్మెస్తానంటూ భయపెడుతున్నాడని చెబూతూ ఏడ్చింది. 

ఇంతలో ఇంటికి వెళ్లిన తండ్రికి పాప కనిపించలేదు. ఫుల్‌గా మద్యం సేవించి ఉన్న అక్బర్‌ నేరుగా స్కూల్ వద్దకు వచ్చి గొడవపడ్డాడు. తండ్రి గొంతు విన్న బాలిక స్కూల్‌లోనే వేరే గదికి వెళ్లి దాక్కుంది. తండ్రితో వెళ్లబోనంటూ ఉపాధ్యాయులకు చెప్పేసింది. పాప భయపడుతోందని తర్వాత పంపిస్తామంటూ ఉపాధ్యాయులు చెబుతున్నా అక్బర్ వినిపించుకోలేదు. 

అక్బర్ చేసిన హంగమాతో ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా బెదిరిపోయారు. ఇంతలో స్థానికులు ఎంఈవో, పోలీసులకు ఫోన్ ేచసి విషయాన్ని చెప్పారు. సమాచారం అందుకున్న వచ్చిన వారు అక్బర్‌తో మాట్లాడారు. వాళ్లపై కూడా తిరగుబాటు చేశాడు అక్బర్. 

చివరకు బాలికను మండల రిసోర్స్ సెంటర్‌కు తరలించారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి జిల్లా బాలసదన్‌కు తీసుకెళ్లారు. తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. 

Also Read: 'బాణసంచా దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి' - జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక ప్రకటన, ఇవీ నిబంధనలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Odisha News: ఒడిశాలో తీరం దాటిన దానా తుపాను- గాలులు, వానతో భారీ విధ్వంసం
ఒడిశాలో తీరం దాటిన దానా తుపాను- గాలులు, వానతో భారీ విధ్వంసం
Andhra News: ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ - రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు, కేంద్ర మంత్రి కీలక ప్రకటన
ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ - రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు, కేంద్ర మంత్రి కీలక ప్రకటన
GHMC Commissioner: 'బాణసంచా దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి' - జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక ప్రకటన, ఇవీ నిబంధనలు
'బాణసంచా దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి' - జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక ప్రకటన, ఇవీ నిబంధనలు
Crime News: తండ్రి అమ్మెస్తాడని స్కూల్‌లో దాక్కున్న బాలిక- చౌటుప్పల్లో ఘటన 
తండ్రి అమ్మెస్తాడని స్కూల్‌లో దాక్కున్న బాలిక- చౌటుప్పల్లో ఘటన 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఏబీపీ నెట్‌వర్క్ నేతృత్వంలో సదరన్ రైజింగ్ సమ్మిట్, గ్రాండ్‌గా ఈవెంట్‌లెబనాన్‌పై ఇజ్రాయేల్ భీకర దాడులు, నేలమట్టమైన నగరంఐదేళ్ల తరవాత మోదీ జిన్‌పింగ్ భేటీ, ఎవరు ఏం మాట్లాడారంటే?హెజ్బుల్లా కీలక నేతని మట్టుబెట్టిన ఇజ్రాయేల్ సైన్యం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Odisha News: ఒడిశాలో తీరం దాటిన దానా తుపాను- గాలులు, వానతో భారీ విధ్వంసం
ఒడిశాలో తీరం దాటిన దానా తుపాను- గాలులు, వానతో భారీ విధ్వంసం
Andhra News: ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ - రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు, కేంద్ర మంత్రి కీలక ప్రకటన
ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ - రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు, కేంద్ర మంత్రి కీలక ప్రకటన
GHMC Commissioner: 'బాణసంచా దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి' - జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక ప్రకటన, ఇవీ నిబంధనలు
'బాణసంచా దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి' - జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక ప్రకటన, ఇవీ నిబంధనలు
Crime News: తండ్రి అమ్మెస్తాడని స్కూల్‌లో దాక్కున్న బాలిక- చౌటుప్పల్లో ఘటన 
తండ్రి అమ్మెస్తాడని స్కూల్‌లో దాక్కున్న బాలిక- చౌటుప్పల్లో ఘటన 
Mega DSC Notification: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌, ఖాళీలు ఎన్నో తెలుసా?
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌, ఖాళీలు ఎన్నో తెలుసా?
YS Sharmila:  అందరూ  అమ్మల మీద, చెల్లెళ్ల మీద  కోర్ట్ ల్లో కేసులు వేయరు  కదా? - జగన్‌కు షర్మిల కౌంటర్
అందరూ అమ్మల మీద, చెల్లెళ్ల మీద కోర్ట్ ల్లో కేసులు వేయరు కదా? - జగన్‌కు షర్మిల కౌంటర్
Dana Cyclone: ఒడిశా తీరం దిశగా 'దానా' తుపాను - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్
ఒడిశా తీరం దిశగా 'దానా' తుపాను - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్
Venom 3 Review: వెనమ్ 3 రివ్యూ: ‘వెనమ్’ సిరీస్‌లో లాస్ట్ సినిమా - మంచి ఫేర్‌వెల్ ఇచ్చారా?
వెనమ్ 3 రివ్యూ: ‘వెనమ్’ సిరీస్‌లో లాస్ట్ సినిమా - మంచి ఫేర్‌వెల్ ఇచ్చారా?
Embed widget