(Source: ECI/ABP News/ABP Majha)
Nagar Kurnool News: ఇదేనా రాహుల్ మీ ప్రేమ దుకాణం? అచ్చంపేటలో బీఆర్‌ఎస్ నేత ఇంటి దాడిపై కేటీఆర్ సీరియస్
KTR Comments On Rahul Gandhi: నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటలో జరిగన గొడవ తెలంగాణలో రాజకీయ దుమారే రేపుతోంది. దీనిపై డీజీపీ, సీఎంతోపాటు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని బీఆర్‌ఎస్ ప్రశ్నిస్తోంది.
Telangana News: తెలంగాణలో పోలింగ్ అనంతరం నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటలో గొడవలు జరిగాయి. బీఆర్‌ఎస్ కౌన్సిలర్ బాలరాజు ఇంటిపై ప్రత్యర్థులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఈ దాడి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. బీఆర్‌ఎస్ లీడర్ ప్రవీణ్‌కుమార్ తన ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేసి పోలీసుల తీరును, ప్రభుత్వం పని తీరును ప్రశ్నించారు. దీన్ని రీ ట్వీట్ చేసిన మాజీ మంత్రి,బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇదేనా మీ ప్రేమ దుకాణం అంటూ రాహుల్ గాంధీకి ట్యాగ్ చేశారు.
దాడికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన ప్రవీణ్‌కుమార్... అచ్చంపేటలో బీఆరెస్ కౌన్సిలర్ బాలరాజు ఇంటిపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశారని అన్నారు. పట్టపగలే బరితెగించారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి ఈ వీడియోలను ట్యాక్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ మాఫియాను నడిపిస్తున్నారని మండిపడ్డారు.
"రేవంత్ రెడ్డి... మీ ఎమ్మెల్యే వంశీకృష్ణ మాఫియా నడిపిస్తున్నా మా కార్యకర్తల మీద యథేచ్చగా దాడులు జరిపిస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అచ్చంపేటలో మా కార్యకర్తలకు ప్రాణహాని ఉంది. వాళ్లకేం జరిగినా ముఖ్యమంత్రే బాధ్యత వహించాలి."
నిన్న అచ్చంపేట పట్టణంలో కాంగ్రేసు గూండాల దాడిలో స్థానిక పోలీసుల ‘ప్రేక్షక పాత్ర’ చూడండి @TelanganaDGP గారు. ఆగంతకులు యధేచ్చగా హత్యాయత్నం చేస్తుంటే పోలీసు అధికారి టాబ్లెట్ (electronic gadget) పట్టుకొని చోద్యం చూస్తున్నారు! ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే? ఇప్పుడే DSP గారితో… https://t.co/k9H8Jr333S pic.twitter.com/pdUTrDg1vh
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) May 15, 2024
నిందితులపై వెంటనే అరెస్టు చేసి పీడీ యాక్టు ప్రయోగించాలని డిమాండ్ చేశారు ప్రవీణ్ కుమార్. లేకుంటే ప్రజలకు స్వేచ్చలేదని అన్నారు. అచ్చంపేటలో కాంగ్రెస్ నేతలు దాడులు చేస్తున్న టైంలో అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ డీజీపీకి ఈ వీడియోలను ట్యాక్ చేసి సమాధానం చెప్పాలని నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. " తెలంగాణ డీజీపీ... ఆగంతకులు యథేచ్చగా హత్యాయత్నం చేస్తుంటే పోలీసు అధికారి టాబ్లెట్ పట్టుకొని చోద్యం చూస్తున్నారు. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే? ఇప్పుడే డీఎస్పీతో మాట్లాడితే నిందితులు ఇంకా పరారీలో ఉన్నారని చెబుతున్నారు. ఆ ఇద్దరు పోలీసు ఆఫీసర్లు కనీసం ఒక్క నిందితున్ని కూడా పీఎస్‌కు తీసుకరాలేకపోయారు! వాళ్ల మీద చర్య తీసుకోండి. ఈ దాడి జరుగుతుందని పోలీసులకు ముందే తెలియదా? ఇప్పుడైనా స్థానిక ఎమ్మెల్యేను తీసుకొచ్చి పోలీసు స్టేషన్‌లో ప్రశ్నిస్తే ప్రధాన నిందితులు రెండు నిమిషాల్లో దొరుకుతారు."
ప్రవీణ్‌కుమార్ వీడియోలను రీట్వీట్ చేసిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి ట్యాగ్ చేశారు. అందులో ఇలా రాసుకొచ్చారు. "రాహుల్ గాంధీ ఇదేనా మీ ప్రేమ దుకాణం?. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రత్యర్థులపై ఇలా కిరాతకంగా దాడి చేయడమా. ఈ దుర్ఘటనలో పోలీసులు కూడా ఉండటం చాలా సిగ్గుచేటు. తెలంగాణ డీజీపీ మీరు స్పందించి ఈ గూండాలపై చర్యలు తీసుకోకుంటే మే మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తాం. న్యాయం జరిగే వరకు పోరాడుతాం" అని ట్వీట్ చేశారు.
Yahi Hai Kya Aapki “Mohabbat Ki Dukaan” @RahulGandhi ?
— KTR (@KTRBRS) May 15, 2024
Brazenly attacking opponents and abusing power. Shameful that police have become part of the abuse and attack @TelanganaDGP If you don’t act and book these goons and the spectator like cops, we will move the Human Rights… https://t.co/9VL4VjxD31