Banking Apps: పేమెంట్స్ యాప్స్‌కు పర్మిషన్స్ ఇస్తున్నారా? - అయితే మీ డేటా అవుటే!
Banking Fintech Apps: బ్యాంకింగ్ పేమెంట్ యాప్స్ అవసరం లేని పర్మిషన్స్ రిక్వెస్ట్ చేస్తున్నాయని, తద్వారా యూజర్ డేటాను కలెక్ట్ చేస్తున్నాయని తెలుస్తోంది.
Big Issue Regarding User Privacy: ప్రజలు తమ సౌలభ్యం కోసం బ్యాంకింగ్ యాప్‌లను ఉపయోగిస్తున్నారు. వీటి ద్వారా బ్యాంకుకు వెళ్లకుండానే వారి పని పూర్తి అవుతుంది. ఈ యాప్‌ల సహాయంతో ప్రజల సమయం ఆదా అవుతుంది కానీ ప్రైవసీకి భంగం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారతదేశంలోని 70 శాతం కంటే ఎక్కువ ఫిన్‌టెక్, బ్యాంకింగ్ యాప్‌లు తమ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయగలవని ఒక నివేదిక వెల్లడించింది. కాబట్టి యూజర్లు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వినియోగదారులు తమ మొబైల్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసినప్పుడల్లా యాప్ అనేక యాక్సెస్‌ల కోసం అనుమతిని అడుగుతుంది. వాటిని యూజర్ ఇస్తేనే ఆ యాప్ వర్క్ మొదలవుతుంది. పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఈ యాప్‌లు వినియోగదారుల ప్రైవేట్ వివరాలను యాక్సెస్ చేస్తాయి. ఇందులో వినియోగదారుడి కాంటాక్ట్స్, లొకేషన్, ఫోటోలు, వీడియోలు, మైక్రోఫోన్, ఎస్ఎంఎస్ మొదలైనవి ఉంటాయి.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
యూజర్ల ప్రైవసీ ప్రమాదంలో...
యూజర్ల ప్రైవసీకి సంబంధించి ఆర్‌బీఐ చేసిన విశ్లేషణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్బీఐ తెలుపుతున్న దాని ప్రకారం 339 ఫిన్‌టెక్, బ్యాంకింగ్ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో లిస్ట్ అయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కరెన్సీ, ఫైనాన్స్‌పై విడుదల చేసిన నివేదికలో ఇవి అత్యంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్‌ను ట్రాక్ చేస్తున్నట్లు తెలిసింది. నివేదిక ప్రకారం 73 శాతం యాప్‌లు వినియోగదారుల లొకేషన్‌ను ట్రాక్ చేస్తాయి. అయితే మూడు వంతుల కంటే ఎక్కువ యాప్‌లు ఫోటోలు, మీడియా, ఫైల్‌లు, స్టోరేజ్ కోసం డేటా పర్మిషన్‌లను వినియోగదారులను కోరాయి.
యాక్సెస్ పొందడమే కాకుండా ఈ యాప్‌లు యూజర్ లొకేషన్‌ను కూడా ట్రాక్ చేస్తాయి. అంటే యూజర్ ఎక్కడికి వెళ్లినా యాప్ అతనిని ట్రాక్ చేస్తూనే ఉంటుంది. యూజర్ ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా యాప్‌లో మొత్తం సమాచారం ఉంటుంది. మొబైల్ వాలెట్లు అత్యంత సెన్సిటివ్ పర్మిషన్లను కోరతాయని ఈ నివేదిక పేర్కొంది.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?